‘ఆమెకు నేనంటే ఎందుకు ఇష్టంలేదు? మొన్నటి వరకు బాగానే ఉంది... ఇప్పుడు ఎందుకు దూరం పెడుతోంది’ ఓ ప్రేమికుడి ఆవేదన.


‘రోజుకు గంటలు గంటలు మాట్లాడేవాడు... ఇప్పుడు ఫోన్ చేసినా మాట్లాడటానికి ఇష్టపడడం లేదు... ఎందుకిలా’ ఇంకో ప్రేమికురాలి బాధ. 


ఇలాంటి ఘటనలు మనచుట్టూ చాలానే జరుగుతుంటాయి. ఎంతోమందికి ఇది అనుభవం కూడా. మనసు మారడానికి పట్టే సమయం చాలా తక్కువ.  ఆ మనసును మార్చేసే ఆలోచనలు, కారణాలు ఇవి కూడా కావచ్చు అంటున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. 


మరొకరు నచ్చి ఉండొచ్చు
మనసు మారడానికి పట్టే సమయం చాలా తక్కువ అని ముందే చెప్పాం. అదే విధంగా మీకన్నా మంచి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి ఎదురై ఉండొచ్చు. అభిప్రాయాలు కలిసి ఉండొచ్చు. మీ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ అవసరాలు, ప్రాధాన్యతలకు వారు కూడా చాలా విలువ ఇచ్చి ఉండొచ్చు. 


త్వరపడి నిర్ణయం తీసుకున్నట్టు అనిపించినా...
చాలా త్వరగా బంధంలోకి అడుగుపెట్టినట్టు వారికి అనిపించి ఉండొచ్చు. చిన్న వయసులోనే ప్రేమ బంధంపై ఆసక్తి పోయి ఉండొచ్చు. అలాంటప్పుడు కూడా బంధం విషయంలో వెనక్కి తగ్గుతారు కొంతమంది.


సన్నిహితంగా ఉండడం నచ్చక కూడా...
మీతో సన్నిహితంగా ఉన్నప్పుడు ఆమె లేదా అతడికి రొమాంటిక్ గా అనిపించకపోయి ఉండొచ్చు. మీతో వారికి సెక్స్ అనే ఊహ కూడా నచ్చకపోయి ఉండొచ్చు. 


సొంత ఎదుగుదల కోసం 
కెరీర్ లో ఎదగడానికి ప్రేమ అడ్డంకిగా మారినా కూడా కొంతమంది లవర్ ను దూరంగా పెడతారు. సొంత ఎదుగుదలపై ఎక్కువ ఆసక్తి ఉన్న మనుషులు ప్రేమ, పెళ్ళిళ్లకు తక్కువ ప్రాధాన్యతనిస్తారు. 


తరచూ తగదాలు అవుతున్నా...
మీ ప్రేమబంధంలో తరచూ తగాదాలు అవుతున్నా కూడా కొంతమంది ఆ బంధానికి స్వస్తి పలుకుతారు. గొడవల వల్ల కలిగే ఒత్తిడి అతడు లేదా ఆమెలో మార్పుకు కారణం కావచ్చు. 


Also read: పిల్లలు ఎత్తు పెరగాలా... ఈ ఆటలు ఆడించండి
Also read:   చపాతీలు రోజూ తింటున్నారా? చేసుకునే పద్దతి మార్చండి చలికాలంలో చాలా రోగాలను దూరం పెట్టొచ్చు
Also read: నిద్రను రానివ్వకుండా చేసే అలవాట్లు ఇవే... దూరం పెట్టకపోతే పెద్ద రోగాలు రావడం ఖాయం
Also read: గుడ్ న్యూస్... ఈ వ్యాక్సిన్ ఒమిక్రాన్‌కు చుక్కలు చూపిస్తుందట, మీరు ఇదే వేయించుకున్నారా?
Also read: రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా, ఎక్కడికీ ప్రయాణం చేయకపోయినా... ఒమిక్రాన్ వచ్చేస్తోంది ఎలా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి