Happy New Year 2025 Wishes in Telugu : గడిచిపోయిన రోజులను మరచిపోయి.. కొత్త ఆలోచనలతో, కొత్త ఆనందాలను వెతుక్కోవాలనే ఉద్దేశంతో మనం న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాము. 2024 ఎలా గడిచినా.. కొత్త సంవత్సరం 2025 మాత్రం సంతోషం ఇవ్వాలని కోరుకుంటాము. ఈ సమయంలో మీతో పాటు.. మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, మీ శ్రేయోభిలాషులకు కూడా సోషల్ మీడియా ద్వారా విషెష్ చేసేయండి. 


కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నప్పుడు ఇష్టమైనవారితో ఆనందం, ప్రేమ పంచుకోవడం తప్పేమిలేదు. ఓ క్షణం మీరు వారు బాగుండాలని విష్ చేస్తే.. అది మీకు అంతకు రెట్టింపుతో మీకు అందుతుంది. ఈ పాజిటివ్​ నోట్​తో 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలుగులో చెప్పేయండి. వాట్సాప్, ఫేస్​బుక్ ఇతర సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా విషెష్ చెప్పాలనుకుంటే వీటిని ఫాలో అయిపోండి. 


న్యూ ఇయర్ 2025 శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి.. 



  • మీకు, మీ కుటుంబానికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు 2025. ఈ ఏడాది మీకు అంతులేని ఆనందం, విజయం అందాలని కోరుకుంటున్నాను. 

  • కొత్త సంవత్సరం పూర్తి ఆనందంతో, మరపురాని జ్ఞాపకాలను మీకు పంచాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ 2025. 

  • ఆరోగ్యం, శ్రేయస్సుతో పాటు మీ జీవితానికి అంతులేని ప్రేమ దక్కాలని విష్ చేస్తున్నాను. మీకు, మీ ఫ్యామిలీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  • కొత్త ఏడాది. కొత్త ఆలోచనలు. మీ డ్రీమ్స్​ అన్ని నెరవేరాలని.. ప్రతి విషయం మీకు సానుకూలంగా జరగాలని.. అన్ని విజయాలు మీకు దక్కాలని కోరుకుంటూ న్యూ ఇయర్ 2025 శుభాకాంక్షలు.

  • 2024లో జరిగిన సంఘటనలన్నీ విడిచిపెట్టి.. 2025లో కొత్త అవకాశాలను మీరు స్వీకరించాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్.

  • ఈ కొత్త సంవత్సరాన్ని మనం అంతా ప్రేమతో, ఆనందంతో స్వాగతిద్దాం. మీకు, మీ కుటుంబాలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  • 2025 మీకు కొత్త అడ్వెంచర్స్​ను, మునెపన్నడూ చూడని ప్రేమను, మరచిపోలేని మధుర జ్ఞాపకాలను అందించాలని విష్ చేస్తూ.. హ్యాపీ న్యూ ఇయర్ 2025.


Also Read : ఇండియాలో న్యూ ఇయర్​ని ఎప్పటినుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారో తెలుసా? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే



  • ఈ ఏడాది మీకు పూర్తి సంతోషం, మంచి ఆరోగ్యం, ప్రతి బ్లెస్సింగ్ మీ లైఫ్​లో మేజర్​ రోల్ ప్లే చేయాలని కోరుకుంటూ.. నూతన సంవత్సరం శుభాకాంక్షలు 2025.

  • నూతన సంవత్సరం కొత్త ఆనందాన్ని, కొత్త లక్ష్యాలను, కొత్త విజయాలను మీకు అందించాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025.

  • గడిచిపోయిన రోజు గురించి చింతించకుండా.. కొత్త అవకాశాలను మీరు స్వాగతించాలి. కొత్త అనుభవాలు, కొత్త పరిచయాలు మీ లైఫ్​ని కలర్​ఫుల్​గా మార్చాలని విష్ చేస్తూ.. హ్యాపీ న్యూ ఇయర్ 2025.

  • కొత్త సంవత్సరం, కొత్త ప్రారంభానికి శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ 2025.

  • 2025 మీకు అద్భుతమైన కొత్త జీవితాన్ని పరిచయం చేయాలని ప్రార్థిస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు. 

  • కొత్త సంవత్సరంలో మీ కలలు నెరవేరాలని.. మీ ఆరోగ్యం మీకు మరింత సహకరించాలని.. మీ జీవితంలోని నెగిటివిటీ అంతా.. పాజిటివ్​గా మారాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ 2025.

  • సంతోషం, శ్రేయస్సు, మరపురాని క్షణాలతో నిండిన అద్భుతమైన లైఫ్ మీ ముందు ఉంది. కొత్త సవాళ్లతో కూడిన మీ జీవితం కలర్​ఫుల్​గా ముందుకు సాగాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025. 



Also Read : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా