Jagadhatri  Serial Today Episode:   కాచి, బూచి ఇంటి పని చేస్తుంటే యువరాజ్‌ తిడతాడు. నిషిక కోపంగా ఆ జగధాత్రి ఏదో చేసింది యువరాజ్‌. మనం లేని టైం చూసి వాళ్లను ఏదో చేసింది అని చెప్తుంది.  ధాత్రి, కేదార్‌ జ్యూస్‌ తాగుతూ కూర్చుంటే కాచి, బూచి మొత్తం క్లీన్‌ చేస్తుంటారు. అలాగే ఆస్తి పేపర్స్‌ వెతుకుతుంటారు. ఎక్కడా వీలునామా పేపర్స్‌ దొరకపోయే సరికి కాచి, బూచి నిరాశగా బయటకు వస్తుంటే.. ధాత్రి, కేదార్‌కు దగ్గరకు వెళ్లి మనం వెతికే వీలునామా పేపర్‌ ఇంట్లో లేదంట.. కౌషికి వదిన బ్యాంకు లాకర్‌ లో పెట్టిందట అని చెప్తుంది. అది విన్న కాచి, బూచి బాధపడతారు. తర్వాత నిషికకు దివ్యాంక ఫోన్‌ చేసి నేను పార్టీకి రావడం లేదని ఆ జగధాత్రి కళ్లు కప్పి కౌషికికి మందు తాగించు. మందు తాగిన కౌషికి నన్ను సురేష్‌ను తిట్టేలా చేయ్‌ అదంతా వీడియో తీసి నాకు పంపించు అని చెప్తుంది సరే అంటుంది నిషిక. అదే ప్లాన్‌ మొత్తం యువరాజ్, కాచి, బూచికి చెప్తుంది నిషిక.

బూచి: అబ్బా ఇలాంటి ప్లాన్లు నా మీద ఎవరూ ఎందుకు వేయరు.

యువరాజ్: నిషి అక్క డ్రింక్ లో మందు కలిపే బాధ్యత నువ్వు తీసుకో.. కాచి నువ్వు దివ్యాంకకు ఫోన్‌ చేయ్‌. బావ వీడియో నువ్వు తీయ్‌

 అని చెప్పగానే సరే అని అందరూ లోపలికి వెళ్తారు. నిషిక డ్రింక్‌లో మందు కలుపుతుంది. అది తీసుకెళ్లి ఇవ్వబోతుంటే ధాత్రి వచ్చి కూల్‌ డ్రింక్స్ నేను ఇస్తాను అంటూ చెప్పగానే అవసరం లేదని నేనే ఇస్తానని నిషిక తీసుకుని వెళ్తుంది. ధాత్రి అనుమానిస్తుంది.

నిషిక: వదిన కూల్ డ్రింక్స్ తీసుకోండి..

కౌషికి: వద్దు నిషి నేను కూల్‌ డ్రింక్స్‌ తాగను  కదా..

నిషిక:అందుకోసమే నీ కోసం స్పెషల్‌ గా మ్యాంగో జ్యూస్‌ తీసుకొచ్చాను

అని ఇవ్వగానే కౌషికి జ్యూస్‌ తాగుతుంది. కౌషికికి ఎదురుగా కూర్చున్న కాచి వీడియో తీస్తుంది. మరోవైపు కేదార్‌ జ్యూస్‌ తీసుకొచ్చి ధాత్రికి ఇస్తాడు. కేదార్‌ జ్యూస్‌ నాకు ఇవ్వు అని అడగ్గానే ధాత్రి ఇవ్వకుండా అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ గార్డెన్‌లోకి వెళ్తుంది. అక్కడ కౌషికి మత్తుగా కూర్చుని ఉండటం చూసి ధాత్రి అనుమానిస్తుంది.

ధాత్రి: వదిన ఎందుకు అలా ఊగిపోతున్నారు..

నిషిక: ఎందుకంటే.. అది నేనిచ్చిన మందు తాగింది కాబట్టి ( అని మనసులో అనుకుంటుంది)

కౌషికి: ఏయ్‌ నేను అడతాను..

కేదార్‌: అక్కా మనం పక్కకు వెళ్లి ఆడుకుందాం..

కౌషికి: ఏయ్‌ పక్కకా నేను పక్కకు ఎందుకు వస్తాను ఇది మన ఇల్లు. ఏయ్‌ అందరూ పోండి..

నిషిక: వదిన చేసిన రచ్చ చాలు.. పోయిన పరువు చాలు.. అయినా కొత్తగా ఈ తాగుడు అలవాటు ఏంటి..? నలుగురిలో ఇలా అల్లరి చేయడం ఏంటి..? ఈ విషయం పది మందికి తెలిస్తే ఏమవుతుంది.

యువరాజ్‌: పరువు గురించి ఆలోచిస్తే ఇలా ఎందుకు చేస్తుంది నిషి.

నిషి: ఈ తాగుడు గురించి తెలిసి సురేష్‌ అన్నయ్యా వదినను వదిలేసి వెళ్లిపోయి విడిపించుకోవాలనుకుంటున్నాడు.

ధాత్రి: నిషి తప్పు తప్పుగా మాట్లాడకు..

నిషి: తప్పుగా మాట్లాడుతుంది. తప్పు చేస్తుంది ఆవిడ.

కేదార్: ఎక్కడో ఏదో తప్పు జరిగింది నిషి. లేకుంటే అక్క ఇలా ఎప్పుడూ చేయదు.

నిషి: నేను కూడా వదిన ఇలా దిగజారి పోయి ప్రవర్తిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.

అనగానే కౌషికి కోపంగా వెళ్లి నిషికను కొడుతుంది. వీడియో కాల్‌ చూస్తున్న దివ్యాంక ఇది కదా నాకు కావాల్సింది అనుకుంటుంది. ఇంతలో యువరాజ్‌ అడ్డుగా వెళితే యువరాజ్‌ను పక్కకు తోసేసిన కౌషికి ఈ మాత్రం ఫ్రూప్‌ సరిపోతుందా..? నిషిక. సరిపోలేదంటే చెప్పండి ఇంకొంచెం ఎక్కువ యాక్ట్‌ చేస్తాను అంటుంది. దీంతో యువరాజ్‌, నిషిక షాక్ అవుతారు. అందరూ షాక్‌ అయ్యారేంటి..? నేను ఇలా చేస్తే మీరు రికార్డ్‌ చేసి దివ్యాంకకు పంపిస్తే అది కోర్టులో చూపించి నాకు సురేష్‌కు డైవర్స్‌ వచ్చేలా చేస్తుంది అదే మీకు కావాల్సింది అనగానే ధాత్రి, నిషిక దగ్గరకు వెళ్లి మీ ప్లాన్‌ మాకు ఎలా తెలిసింది అనుకుంటున్నారా..? అంటూ నిజం చెప్తుంది. తాము కౌషికితో కలిసి ఆడిన నాటకం గురించి చెప్తుంది. నువ్వు తీసుకొచ్చిన మందు బాటిల్‌ లో మందు తీసేసి నీళ్లు నింపేసి పెట్టాము అని ధాత్రి చెప్పగానే నిషిక షాక్‌ అవుతుంది. కౌషికి అందరినీ తిట్టి వెళ్లిపోతుంది. దీంతో  ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!