Happy New Year 2023: కొత్త ఏడాది రావడానికి ఇంకా కొన్ని గంటలే ఉంది. ఇప్పటికే అందరూ కొత్త సంవత్సరాన్ని స్వాగతం పలికేందుకు వేడుకలకు సిద్ధమైపోయుంటారు. అలాగే వాట్సాప్‌లో తన స్నేహితులను, బంధువులను విష్ చేయడానికి తెలుగులోనే శుభాకాంక్సలు చెప్పండి. ఇక్కడ మేం కొన్ని తెలుగు విషెస్ ఇచ్చాం. వీటిని మీ బంధువులకు, సన్నిహితులకు పంపండి.
1. నిండు మనసుతో ఈ నూతన ఏడాదిలో మీరు మీ కుటుంబంతో సంతోషాలను పంచుకోవాలని కోరుకుంటూ మీకు కొత్త ఏడాది శుభాకాంక్షలు.
2. ఈ కొత్త సంవత్సరం మీకు మరిన్ని ఆనందాలుసంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు
3. కాలం పరుగులో మరో మైలురాయిఈ కొత్త సంవత్సరం...ఈ సంవత్సరమంతా జయాలు కలగాలిసంతోషాలు కలగాలని కోరుకుంటూమీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
4. ఉప్పొంగే ఉత్సాహంతో,అవధులు లేని ఆనందంతోఅంబరాన్నంటే వేడుకలతోనూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాంమీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
5. సంబరాలు మిన్నంటే వేళనింగి నేల కాంతుల హేళకావాలి మీ జీవితాలు వెలుగులు ఈ వేళఅందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
6. కొత్త ఏడాదిలో మీ కలల నిజం అవ్వాలి.మీ ఆశయాలు సిద్ధించాలిమీ ప్రతి అడుగూ విజయమనే గమ్యం వైపు సాగాలనిఆశిస్తూ మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
7. తీపి, చేదు కలిసిందే జీవితం..కష్టం, సుఖం తెలిసిందే జీవితం...ఆ జీవితంలో ఆనందోత్సహాలుపూయించేందుకు వస్తుందికొత్త ఏడాది...నూతన సంవత్సర శుభాకాంక్షలు
8. కరోనా కాలానికి గుడ్ బై చెబుదాంమనోబలంతో ముందుకు సాగుదాంకష్టాలతో పోరాడి జీవితాలను సరిదిద్దుకుందాంమీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
9. చేసిన తప్పులను మరిచిపోవాటిని సరిదిద్దుకుని ముందుకు సాగిపోకొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకోకొత్త ఆశలు మదిలో చిగురింపజేసుకో మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
10. నవీన ఆశలతోనూతన ఆశయాలతోవినూత్న ఆరంభాలతోసరికొత్త ఆలోచనలతోగతం మిగిల్చిన జ్ఞాపకాలు సంతోషాలను పంచిన క్షణాలతోచేదు అనుభవాల పాఠాలతోమరో మజిలీని స్వాగతిస్తూమీ కలలు సాకారం కావాలని ఆశిస్తూనూతన సంవత్సర శుభాకాంక్షలు
11. మీకు 2023 అద్భుతమైన,సంతోషకరమైన సంవత్సరంగా మారాలని ప్రార్థిస్తున్నానుమీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
12. కష్టాలెన్నైనా సరే రానీ...సవాళ్లెన్నయినా సరే ఎదురవనీ...కలిసి నిలుద్దాం, కలబడదాం, గెలుద్దాం...ఈ ఏడాది మీకు గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ...మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
13. గత సంవత్సరం ఇచ్చిన అనుభవాల స్పూర్తితో...ఈ సంవత్సరం మరెన్నో విజయాలను సాధించాలని..మీరు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ...మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
14. గడిచిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ...చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ..దూరం అయిన బంధాలను తిరిగి కలుపుకుంటూ...ఆగిపోయిన కలలకు ఆశలు కల్పిస్తూ...చేయాల్సిన పనులను నిర్ధేశించుకుంటూ...మన జీవితాలలో వెలుగుల కోసం ప్రార్థిస్తూ...లక్ష్య సాధనకు పోరాటాన్ని ప్రారంభిస్తూ...నూతన సంవత్సరంలోకి అడుగుపెడదాం...మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
Also read: కొత్త ఏడాదిలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? ఈ పనులు చేస్తామని ప్రమాణం చేయండి