Mental Health Habits : శారీరకంగా, ఉద్యోగ విషయంలో, కుటుంబపరంగా బాగుండాలి అంటే మెంటల్ హెల్త్ చాలా ముఖ్యం. ఈ విషయాన్ని ఎక్కువమంది సీరియస్​గా తీసుకోరు. హెల్త్​ అంటే కేవలం శారీరకంగా ఏదైనా వస్తేనే అది ప్రాబ్లమ్​గా చూస్తారు. కానీ సైలెంట్ కిల్లర్​ అయిన మెంటల్​ హెల్త్​ని పట్టించుకోరు. దీనివల్లే శారీరకంగా అనేక ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. అందుకే దీనిని అస్సలు ఇగ్నోర్ చేయకూడదు. 

మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటే ఎన్నో సమస్యలకు చెక్​ పెట్టొచ్చు. అంతేనా.. మీ లైఫ్​ ఎంత పాజిటివ్​గా ముందుకు వెళ్తుందో కూడా మీరు ఊహించలేరు. ఇలా పాజిటివ్​గా లైఫ్​ని లీడ్​ చేస్తూ.. మెంటల్లీ పీస్​ఫుల్​గా ఉండాలంటే మీరు కొన్ని అలవాట్లను వదిలేయాలని సూచిస్తున్నారు నిపుణులు. వాటిని ఎంత త్వరగా వదిలేయగలిగితే అంత త్వరగా సమస్యలనుంచి బయటపడొచ్చని చెప్తున్నారు. ఇంతకీ ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

ఆ ఆలోచలు వద్దు..

చాలామంది చేసే అతి పెద్ద మిస్టేక్ ఏది అంటే నెగిటివ్​గా ఆలోచించడం. ఓ పని జరుగుతుందనే దాని కన్నా.. జరగకపోతే ఏమవుతుందని.. అవసరం లేని ఎన్నో ఆలోచనలు బ్రెయిన్​లో నింపేసుకుంటారు. కాబట్టి ఇలాంటి ఆలోచనలు దరిచేరనీయకండి. అలాగే ఎదురయ్యే, ఎదురుకానీ పరిస్థితుల గురించి ఆలోచించి గాబరా పడకండి. మరొక్క ముఖ్య విషయం ఏంటంటే.. ఆత్మ విమర్శ తగదు. మీరు పెట్టిన ఎఫర్ట్స్​ని మెచ్చుకోవడానికి ప్రయత్నించండి తప్పా మీ వల్లే మిస్టేక్ జరిగిందనేదాన్ని వీలైనంత త్వరగా ఓవర్​కామ్ చేయాలి. 

సోషల్ మీడియాలో.. 

ఒత్తిడి, భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడానికి చాలామంది ఫేక్ అకౌంట్​లతో లేదా పర్సనల్​గా abuse చేస్తూ ఉంటారు. అలాగే సోషల్ మీడియా వాడకాన్ని పరిమితం చేయాలి. ఆన్​లైన్​ ఫ్రెండ్స్ కాకుండా ఆఫ్​లైన్​లో ఉన్న ఫ్రెండ్స్​తో టైమ్ స్పెండ్ చేయండి. వాట్సాప్, ఇన్​స్టా, ఫేస్​ బుక్​ వంటి సోషల్​మీడియాలో మునిగి పనిని వాయిదా వేయడం మానేయండి. చిన్న చిన్న భాగాలుగా వర్క్ చేస్తే బెటర్. 

టాక్సిక్ రిలేషన్​షిప్స్

ప్రజలు మిమ్మల్నే ఎంచుకోవాలని చూడకండి. అలాగే ఏ రిలేషన్​లో ఉన్నా కొన్ని బౌండరీలు పెట్టుకోండి. అలాగే మీకు ఇబ్బంది కలిగించేవారి గురించి పట్టించుకోకండి. ఏ రిలేషన్​లో ఉన్నా.. మీ పర్సనల్ స్పేస్​లోకి ఎవరిని రానివ్వకపోవడమే మంచిది. ఎదుటివారు చేసిన తప్పులకు కూడా మీరే సారీ చెప్పేయకండి. అవతలి వ్యక్తులు వారు చేసిన తప్పులు రియలైజ్​ అయ్యే అవకాశం ఇవ్వండి. లేదంటే ప్రతిసారి మీరే వారి దగ్గర తగ్గాల్సి వస్తుంది. సెల్ప్​కేర్​ని తప్పుబట్టేవారితో రిలేషన్​ని బ్రేక్ చేసుకోవడమే మంచిది. 

ఆ అలవాట్లు మార్చుకోండి 

మానసిక ఆరోగ్యం బాగుండడంలో నిద్ర ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాబట్టి బెడ్​టైమ్​ రొటీన్​ని సెట్ చేసుకోండి. ఎవరికోసమే నిద్రను త్యాగం చేయవద్దు. మెరుగైన నిద్ర శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. అలాగే తీసుకుంటున్న ఆహారంపై ఫోకస్ చేయండి. శరీరానికి ఏమి అవసరం మీరేమి అందిస్తున్నారో తెలుసుకుంటే పూర్తి ఆరోగ్యానికి మంచిది. రోజులో కనీసం కాసేపు అయినా వ్యాయామం చేయండి. కనీసం వాకింగ్ చేస్తూ.. మీ పనులు మీరు చేసుకుంటే యాక్టివ్​గా, నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉంటారు. 

మైండ్​సెట్​ని మార్చుకోండిలా.. 

తప్పులు అందరూ చేస్తారు. కానీ జరిగిపోయినా తప్పుల గురించి ఆలోచిస్తూ ఉండిపోకుండా.. పనిని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చూడండి. ఇంకేమైనా పాజిబులిటీలు ఉన్నాయో చెక్ చేయండి. అలాగే ఒకరితో మీ జీవితాన్ని పోల్చుకోకండి. ప్రతి ఒక్కరి లైఫ్ డిఫరెంట్​గా ఉంటుంది. ఎదుటివారి సక్సెస్​ని సెలబ్రేట్ చేయండి. మీ జర్నీపై ఫోకస్ పెట్టుకోండి. ఓడిపోతామని భయంతో కాకుండా.. గెలిచేందుకు మరో అవకాశాన్ని వెతుక్కోండి. ఇది మీకు సక్సెస్ మంత్ర అవుతుంది. 

గుర్తించుకోవాల్సిన విషయం.. 

ఇతరుల మెప్పుకోసం ఎప్పుడూ ప్రయత్నించకండి. మీరు ఎంత చేసినా ఏదొక లోపాన్ని వెతికి చూసే సొసైటీ ఇది. మీకు నచ్చిన పనిచేయండి. ఎదుటివారికి ఇబ్బంది లేకుండా మీకు సంతోషాన్ని ఇచ్చే ఏ పని అయినా మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుందని గుర్తించుకోండి. 

Also Read : స్ట్రోక్ రావడానికి కారణాలు.. వీటిలోని రకాలు, ట్రిగరింగ్ పాయింట్స్, పక్షవాతం వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలివే