ఆరెంజ్ - బ్రౌన్ కలర్ కలిసిన తీపి పదార్థం జిలేబి. ఎన్నో వందల ఏళ్లుగా అది మన ఆహారంలో భాగమైపోయింది. ఎక్కడైనా జిలేబి ఈ రంగులోనే ఉంటుంది. కానీ ఆకుపచ్చ రంగులో ఉన్న జిలేబి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఎంతో ప్రత్యేకమైనది. ఈ జిలేబిని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ ఖాతా foodie_incarnate పేరుతో ఉన్న ఫుడ్ వ్లాగర్ అమర్ సోహి ఈ ఆకుపచ్చ రంగు జిలేబి వీడియోను పోస్ట్ చేశారు. దీన్ని ‘మౌంటెన్ డ్యూ జిలేబి’ అంటారు. ఇవి బెంగళూరులో అమ్ముతున్నట్టు చెప్పారు అమర్ సోహి. వీటిని అక్కడ ‘అవెరాబెల్ జిలేబి’ అంటారని చెబుతున్నారు ఆయన. 


కర్ణాటకలో అవేరేబెలే అని పిలిచే  కూరగాయ ఉంటుంది. వీటిని హైసింత్ బీన్స్ అంటారు. ఇవి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. చిక్కుడు జాతికి చెందినవి. చిక్కుళ్లలా తొక్క ఒలిస్తే లోపల ఆకుపచ్చని బీన్స్ ఉంటాయి. మన దేశంలో ఇవి ఎక్కువ ప్రాంతాల్లోనే వినియోగిస్తారు. ఆ బీన్స్ తోనే ఈ జిలేబిని తయారు చేస్తారు. హైసింత్ బీన్స్‌ను పిండిలా చేసి.. ఆ పిండితో ఈ జిలేబిలను వేస్తారు. చక్కెర, తేనె వంటి సిరప్ లలో ముంచుతారు. అందుకే ఇవి ఆకుపచ్చగా ఉంటాయి. అవేరేబలే పేరు మీద ఒక ఉత్సవం కూడా ఉంది. దీన్ని అవెరకై మేళా అని పిలుస్తారు. ఆ రోజున ప్రజలు వివిధ రకాల జిలేబిలను తీసుకువచ్చి నివేదిస్తారు.


ఈ హైసింత్ బీన్స్ లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.ఈ ప్రొటీన్లు అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతాయి. ఈ బీన్స్ ను తినడం వల్ల మానసిక స్థితి నియంత్రణలో ఉంటుంది. యాంగ్జయిటీ వంటివి తగ్గుతాయి. ఇందులో ఉండే ప్రొటీన్ మెదడులోని న్యూరో ట్రాన్స్ మీటర్ల పనితీరుకు సహాయపడుతుంది. ఇవి సెరోటోనిన్, డోపమైన్ వంటి హార్మోన్లను సమన్వయం చేయడానికి ఉపయోగపడతాయి. ఈ బీన్స్ ను తినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. 


జిలేబి పుట్టిల్లు ఆఫ్టనిస్తాన్ అని చెప్పుకుంటారు. పదో శతబ్ధంలోనే ఈ వంటకం ఉండేదని కొన్ని పుస్తకాల ద్వారా తెలుస్తోంది. జలేబి అనే పదం అరబిక్ పదమైన జులాబియా లేదా పర్షియన్ పదమైన జోల్భియా అనే పదం నుంచి పుట్టింది. ఈజిప్టు, ఇథియోపియా, బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్, నేపాత్, పాకిస్తాన్,  శ్రీలం, టర్కీ... ఇలా ఎన్నో దేశాల్లో జిలేబిని తింటారు.  దీన్ని మైదాపిండితో తయారుచేస్తారు. ఈ తీపి వంటకం అంటే చెవి కోసుకునేవారు ఎంతోమంది.



Also read: ఆవులింతలు అధికంగా వస్తున్నాయా? అయితే ఈ ఐదు ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం




Also read: ప్రపంచంలోనే ప్రమాదకరమైన చెట్లు ఇవి, వీటి కింద నిలుచున్నా ప్రాణాపాయమే