నెయ్యి తింటే లావై పోతాం అనుకుంటారు చాలా మంది. కానీ నెయ్యి తినడం కూడా అవసరమే. కాకపోతే మితంగా తినాలి. ఆయుర్వేదం ప్రకారం రోజుకి ఒక స్పూను నెయ్యిని ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఇలా నెయ్యి తినడం వల్ల చాలా సమస్యలు రావు. నెయ్యి తినడం వల్ల ముఖంలో తేజస్సు పెరగుతుంది. చర్మం మృదువుగా మారుతుంది. దీనిలో యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ ఫంగల్ గుణాలు అధికం. పిల్లలకు ఆహారంలో కలిపి కనీసం అర స్పూను నెయ్యి అయినా పెట్టేందుకు ప్రయత్నించండి. సీజనల్ వ్యాధులను ఇది అడ్డుకుంటుంది. భోజనం చేసేటప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి కలిపి పిల్లలకు తినిపించినా మంచిదే. ముఖ్యంగా శీతాకాలం, వానాకాలంలో శరీరంలో వేడి తగ్గిపోకుండా ఉండేందుకు నెయ్యి సహాయపడతుంది.
కావాల్సిన పదార్థాలుబాస్మతి బియ్యం - ఒక కప్పునెయ్యి - రెండు స్పూనులువెల్లుల్లి రెబ్బలు - ఆరుఉల్లిపాయ తరుగు - పావు కప్పు (నిలువుగా తరగాలి)పచ్చి మిర్చి - రెండుఅల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూనుజీడిపప్పులు - గుప్పెడుబిర్యానీ ఆకు - ఒకటి లవంగాలు - మూడుయాలకులు - ఒకటిదాల్చిన చెక్క - ఒక ముక్కఅనాస పువ్వు - ఒకటిషాజీరా - అర టీస్పూనుకొత్తీమీర తరుగు - రెండు స్పూనులుఉప్పు - తగినంతనీళ్లు - రెండు గ్లాసులు
తయారీ ఇలా...1. కళాయిలో నెయ్యి వేసి జీడి పప్పును వేయించి తీసి పక్కనపెట్టుకోవాలి. బాస్మతి బియ్యాన్ని అరగంట ముందే నీళ్లలో నానబెట్టుకోవాలి.2. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో మసాలా దినుసులు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.3. అవి వేగాక నిలువుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. 4. అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి. ఈ మిశ్రమమంతా బాగా వేగితే సువాసన వస్తుంది. 5. అందులో ఉప్పు, నీళ్లు కూడా వేయాలి. 6. నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి మూతపెట్టాలి. 7. పావుగంట సేపు సిమ్ లో ఉడికించాలి. 8 . దించడానికి అయిదు నిమిషాల ముందు స్పూను నెయ్యి పైన చల్లాలి. అలాగే ముందు వేయించిపెట్టుకున్న జీడిపప్పులు వేయాలి. 9. చివరన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. 10. ఈ నెయ్యి అన్నం చాలా రుచిగా ఉంటుంది. చేయడం కూడా చాలా సులువు.11. వారానికోసారైతనా పిల్లలకు లంచ్ బాక్సు రెసిపీగా పెడితే బావుంటుంది.
Also read: తరచూ పండ్లు తినే వారిలో డిప్రెషన్ వచ్చే అవకాశం తక్కువ, చెబుతున్న కొత్త అధ్యయనం
Also read: చల్ల మిరపకాయలు ఇలా చేసుకుంటే కారం కారంగా భలేగుంటాయ్