అనుబంధానికైనా పునాది స్నేహమే. ముందు మనసులో స్నేహ భావం ఉంటే వారి పట్ల మనుకుండే ఫీలింగ్‌ను బట్టి రిలేషన్ షిప్ డిఫైన్ అవుతుంది. స్నేహం ఒక గొప్ప సెక్యూర్డ్ ఫీలింగ్ ను ఇస్తుందని శాస్త్రవేత్తలు కూడా అంటున్నారు. జీవితంలో ఎదురైన ఒత్తిడి నుంచి బయటపడేందుకు స్నేహితులతో సంభాషణ లేదా వారి నుంచి వచ్చే ఒక్క టెక్ట్స్ మెసేజ్‌ చాలని అంటున్నారు. దాని వల్ల అనేక వ్యాధులకు కారణమయ్యే ఒత్తిడి దూరమై.. చక్కగా జీవించగలగుతారని నిపుణులు చెబుతున్నారు. 


సంభాషణలు ఫీల్ గుడ్ హార్మోన్ల విడుదలకు సహకరిస్తాయట. కానీ మనలో చాలా మంది వారంలో ఒక రోజు మాత్రమే ఇష్టమైన వ్యక్తులతో సమయం గడిపేందుకు కేటాయించగలుగుతున్నారట. కొంత మందికైతే అది కూడా సాధ్యపడటం లేదట. దీనిపై జరిగిన పోల్‌లో ఇలాంటి విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి.


అమెరికాలో జరిగిన ఒక అధ్యయనంలో దీనిపై చర్చిస్తూ.. తమాషాగా జరిగే సంభాషణల ఫలితంగా రోజులో ఎదురయ్యే ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారని నిర్థారణ జరిగింది. ఈ అధ్యయనం నిర్వహించిన ఫ్రొపెసర్ జెఫ్రీ హాల్ ‘‘కేవలం మాట్లాడడం కాదు, ఎవరితో మాట్లాడుతున్నారనేది ముఖ్యం. అపరిచితులకంటే మీకు ఇష్టమైన, ఆత్మీయులతో మాట్లాడినపుడు మీ మానసిక స్థితి మెరుగవుతుంది’’ అని అంటున్నారు. ఈ అధ్యయనం కోసం 907 విషయాల మీద రకరకాల సోషలైజింగ్ టాస్క్ లను ఉపయోగించారు. ప్రతి ఒక్కరిని పగటి వేళల్లో తమకు నచ్చిన స్నేహితులతో మాట్లాడాల్సిందిగా అడిగారు. సాయంత్రం వారి దగ్గర రిపోర్ట్ తీసుకున్నారు. ఇలా రకరకాల వ్యక్తుల దగ్గర నుంచి రెండు సంవత్సరాలలో మూడు సార్లు డేటా సేకరించారు.


ఈ చాటింగ్‌లలో లోతైన గంభీరమైన సంభాషణల నుంచి పిచ్చాపాటి, పరిహాసాల వంటివన్నీ ఉన్నాయి. ఇలా ఆత్మీయులతో సంభాషించిన వారిలో 60 శాతం కంటే ఎక్కువ మంది తమలో స్ట్రెస్ చాలా తగ్గిందని చెప్పారు. ఇలాంటి అవుట్ లేట్ లేని వారు ఒక్కువ ఒత్తిడిలో సమయం గడుపుతున్నారట.


ముఖాముఖి సంభాషణల వల్ల మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అంటున్నారు అధ్యయనకారులు. అయితే చిన్న ఆన్ లైన్ చాట్ లేదా ఒక ఫోన్ కాల్ కూడా మంచి ప్రభావాన్నే చూపుతుందని కూడా అంటున్నారు. కాన్సస్ యూనివర్సిటికి చెందిన ఫ్రోఫెసర్ హాల్ టెక్ట్సింగ్, సోషల్ మీడియా ఇంటరాక్షన్ కంటే కూడా నేరుగా సంభాషించడం ఎక్కువ ప్రభావం చూపుతోందని అంటున్నారు. అయితే ఒంటరిగా ఉండడం కంటే టెక్ట్స్ ఎక్సెంజ్ మంచిదే. కానీ ఇది నేరుగా జరిపే ఫోన్ సంభాషణ లేదా ముఖాముఖి కలిసి మాట్లాడుకోవడమనేది ఉత్తమం అనే అభిప్రాయం వెలిబుచ్చారు.


మనం మన స్నేహాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వం. ఎందుకంటే అవి పెద్ద ప్రయత్నం లేకుండానే మనకు ఏర్పడిపోతాయి. కాబట్టి అవి గొప్ప విలువైనవిగా అనిపించవు. నిజానికి స్నేహం మానసిక ఆరోగ్యానికి అవసరమైన గొప్ప ఔషధంగా చెప్పుకోవాలి. స్నేహితులతో గడపడం కంటే కూడా రకరకాల కారణాలతో సులభైమన ఎంటర్టైన్ మెంట్ విధానాలను ఎంచుకుంటూ ఉంటాం. అలాంటి ఆలోచనా ధోరణి మానసిక ఆరోగ్యం మీద నెగెటివ్ ప్రభావాన్ని చూపుతుంది. పనికి, ఎంటర్టైన్‌మెంట్‌కి, ఇంకా చాలా పనులకు గాడ్జెట్స్ మీద ఆధారపడడం వల్ల స్నేహితులతో, ఇతర ఆత్మీయులతో ఇంటారాక్షన్ తగ్గిపోతోంది. కనుక తప్పనిసరిగా స్నేహానికి ప్రాధాన్యతను ఇవ్వడం ఆరోగ్యానికి అవసరమైన విషయమని నిపుణులు చెబుతున్న విషయాలను తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. మరి, మీరు ఒత్తిడిలో ఉన్నా.. లేదా మీ స్నేహితులు ఒత్తిడిలో ఉన్నట్లు గుర్తించినా.. తప్పకుండా వారితో మనసు విప్పి మాట్లాడండి. ‘ఒత్తిడి’ని తరిమి కొట్టండి. 


Also read: ఆయుష్షు కావాలా? ఆయుర్వేదం చెప్పిన ‘70-30’ ఫార్ములా ఫాలో అయిపోండి