AIIMS Recruitment: ఎయిమ్స్‌, రిషికేశ్‌లో 62 సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు, వివరాలు ఇలా!

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 62 సీనియర్‌ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Continues below advertisement

రిషికేశ్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 62 సీనియర్‌ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ/ డీఎం/ ఎంసీహెచ్/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 22లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Continues below advertisement

వివరాలు..

* సీనియర్ రెసిడెంట్(నాన్-అకడమిక్) పోస్టులు

మొత్తం ఖాళీలు: 62(యూఆర్: 17, ఈడభ్ల్యూఎస్: 04, ఓబీసీ: 22,  ఎస్సీ: 13, ఎస్టీ: 06)

1. అనస్థీషియాలజీ: 04

2. అనాటమీ: 01

3. బయోకెమిస్ట్రీ: 03

4. కాలిన గాయాలు & ప్లాస్టిక్ సర్జరీ: 01

5. సీటీవీఎస్: 02

6. ఈఎన్‌టీ: 01

7. ఫోరెన్సిక్ మెడిసిన్ & టాక్సికాలజీ: 03

8. జనరల్ మెడిసిన్(జెరియాట్రిక్ మెడిసిన్): 02

9. జనరల్ సర్జరీ: 08

10. మైక్రోబయాలజీ: 01

11. న్యూక్లియర్ మెడిసిన్: 04

12. అబ్స్. & గైనే: 05

13. ఆప్తమాలజీ: 01

14. ఆర్థోపెడిక్స్: 01

15. పీడియాట్రిక్స్: 06

16. పాథాలజీ / ల్యాబ్ మెడిసిన్: 02

17. పీడియాట్రిక్ సర్జరీ: 01

18. ఫార్మకాలజీ: 01

19. ఫిజియాలజీ: 01

20. సైకియాట్రీ: 01

21. రేడియో నిర్ధారణ: 03

22. రేడియో థెరపీ: 01

23. ట్రాన్స్‌ఫ్యూజన్ మెడ్. & బ్లడ్ బ్యాంక్: 03

24. ట్రామా & ఎమర్జెన్సీ(ఎమర్జెన్సీ మెడిసిన్): 04

25. ట్రామా & ఎమర్జెన్సీ(ట్రామా సర్జరీ): 02

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ/ డీఎం/ ఎంసీహెచ్/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: యూఆర్, ఈడభ్ల్యూఎస్ & ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు రూ.1200. ఎస్సీ & ఎస్టీ అభ్యర్థులకు రూ.500. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు చివరి తేది: 22.02.2023.

Notification 

Website 

Also Read:

SSC Exams: సీజీఎల్‌, సీహెచ్‌ఎస్‌ఎల్‌ పరీక్షల తేదీలు ఖరారు! షెడ్యూలు ఇదే!
సీజీఎల్ టైర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించిన టైర్-2 పరీక్ష తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫిబ్రవరి 6న ప్రకటించింది. వీటిలో గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి టైర్-2 పరీక్షను మార్చి 2 నుంచి 7 వరకు నిర్వహించనున్నట్లు ఎస్‌ఎస్‌సీ ఫిబ్రవరి 6న ప్రకటించింది. అలాగే, 4500 లోయర్ డివిజన్ క్లర్కులు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితర ఉద్యోగాలను భర్తీకి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ పరీక్ష టైర్-1ను మార్చి 9 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది.
పరీక్ష పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి.. 

SSC MTS: మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు 12,523 - రీజయన్ల వారీగా ఖాళీలు ఇలా!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో మల్టీటాస్కింగ్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనవరి 18న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మల్టీ టాస్కింగ్ పోస్టులకు సంబంధించి మొదట 11,409 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో ప్రకటించింది, అయితే 12,523 ఖాళీలు ఉన్నట్లు ఖరారు చేస్తూ సవరించిన పోస్టుల వివరాలను జనవరి 20న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. వీటిలో రీజియన్ల (18-25 వయసు) వారీగా 9,329 పోస్టులు ఉండగా.. 18-27 వయసు వారీగా 2665 పోస్టులు, ఇక  హవిల్దార్ పోస్టులు 529 ఉన్నాయి. అంటే మొత్తం 12,523 ఉద్యోగాల్లో 11,994 మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉండగా, 529 హవిల్దార్ పోస్టులున్నాయన్నమాట.
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement
Sponsored Links by Taboola