AP SAP Godava :   స్పోర్ట్స్ అధారటి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) లో విభేదాలు రోడ్డున పడ్డాయి.  శాప్ ఎండీ ప్రభాకర్ రెడ్డి పై నలుగురు బోర్డ్ డైరెక్టర్లు బహిరంగంగా ఆరోపణలు చేశారు.ఎండీ ప్రభాకర్ రెడ్డి భారీగా అవినీతి పాల్పడ్డారని ఆరోపణలు గుప్పించారు. ఆరోపణలు చేసిన వారిని శాప్ కార్యాలయంలోకి రానివ్వకపోవడంతో బయటే ప్రెస్ మీట్ పెట్టిన డైరెక్టర్లు ఎండీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఎండీ వైఖరి వల్ల క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారని, స్పోర్ట్స్ కోచ్ ల జీతాలు పెంచాలని కోరినా ప్రయోజనం లేదని   శాప్ డైరెక్టర్లలో ఒకరయిన డానియేలు ఆరోపించారు.  ఎండీ ప్రభాకర్ రెడ్డి బోర్డు సభ్యుల నిర్ణయాలను పట్టించుకోవడం లేదని.. రూ. 5 కోట్లు నిధులు ఉన్నా.. సీఎం చెప్పినా ఏమీ అభివృద్ధి చేయడం లేదంటున్నారు.


శాప్ టెండర్లలో ఎండీ అవినీతికి పాల్పడుతున్నారని ..అర్హత లేనివారికి స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ వన్ ఉద్యోగాలకు సర్టిఫికెట్లు ఇచ్చారని డైరక్టర్లు ఆరోపిస్తున్నారు.  కాంట్రాక్టర్లకు కమీషన్ల కోసం ఎక్కువ రేటుకు టెండర్లు అప్పగిస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులను, క్రీడాకారులని పట్టించుకోవడం లేదని,ఛైర్మన్ సిద్దార్ధ్ రెడ్డికి ఈ విషయాలన్నీ చెప్పామని తెలిపారు.శాప్ ఎండీ  అక్రమాలపై మంత్రి రోజాను కలిసే ప్రయత్నం చేశామని, కానీ ఆమె అప్పాయింట్మెంట్ లభించ లేదన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు దుర్వినియోగం అయ్యాయని,సీఎం కప్ పెట్టమని చెప్పినా పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు.క్రీడాకారులకు ఒక్క జెర్సీ కూడా ఇవ్వలేదని, రూ. 65 లక్షలకు టెండర్ వేస్తే.. అందులో పది రెట్లు అధికంగా ధరలు కోట్ చేశారుని,150 హాకీ స్టిక్స్ 750 కి ఇవ్వమంటే,ఒక్కో స్టిక్ కు రూ. 10,020కి బిల్ పెట్టారనిన విమర్శించారు.ఏదడిగినా డబ్బు లేదని శాప్ ఎండి ప్రభాకర్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని అన్నారు.81 బోర్డు సమావేశాలు జరిగితే... కనీసం పూర్తి వివరాలు మాకు ఇవ్వలేదని,శాప్ ఛైర్మన్ అడిగినా కూడా స్పందించరని ఆవేదన వ్యక్తం చేశారు.


శాప్ బోర్డు మీటింగులో కూడా ఎండీ వైఖరిని పై డైరెక్టర్లు అభ్యంతరం తెలపటంతో,సమావేశం రసాభాస గా మారింది.బోర్డు డైరెక్టర్లు ఎండీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా మీడియా మందుకు రావడంపై బోర్డు మీటింగులో ప్రస్తావనకు వచ్చింది.ఎండీ ప్రభాకర్ రెడ్డి తీరు పై శాప్ ఛైర్మెన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డితో సహా డైరెక్టర్ల అంతృప్తి వెలిబుచ్చారు. డైరెక్టర్లు ప్రస్తావించే చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కారం చేయడంలేదని ఎండీ ప్రభాకర్ రెడ్డిని బైరెడ్డి సిద్దార్థరెడ్డి ప్రశ్నించారు.అయితే ఆయన నుండి ఎటువంటి స్పందన లభించకపోవటంతో  బోర్డు మీటింగ్ ను మధ్యలోనే ఆపేసి సిద్దార్థరెడ్డి వెళ్లిపోయారు. దీంతో ఆయన వెనకే డైరెక్టర్లు కూడా సమావేశం నుండి బయటకు వెళ్లిపోవాల్సి  వచ్చింది.


తాను విదేశీ పర్యటన వెళ్లిన సమయంలో కొంతమంది రూమర్స్ మొదలు పెట్టారని .. ఆధారాలు,ఫిర్యాదు లేకుండా ప్రచారం చేశారని ఎండీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.  ఎటువంటి ఆధారాలు ఉన్నా ... ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.తన పై   అసత్యాలు ప్రచారం చేసే వారి పై న్యాయ పోరాటం చేస్తనని అన్నారు.సిఎం కప్ ప్రభుత్వం ఇచ్చే తేదీలను బట్టి టోర్నమెంట్ నిర్వహిస్తామని తెలిపారు. ఒక‌ బోర్డు మెంబర్ అర్ధం చేసుకోకుండా వివాదం చేశారని, జిల్లాల నుంచి వచ్చే ప్రతిపాదనలు పరిశీలించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు.అవగాహన లేకుండా కొంతమంది మమ్మలను ప్రశ్నిస్తున్నారని,శాప్ లీగ్ లను అమల్లోకి తెచ్చి‌ 39వేల మంది పిల్లలను భాగస్వామ్యం చేయడం ఒక రికార్డని చెబుతున్నారు. 


మెమోలు ఇస్తే.. లైంగిక ఆరోపణలు చేస్తున్నారి మండిపడ్డారు. శాప్ కార్యాలయం మొత్తం సిసి కెమెరా పర్యవేక్షణలో ‌ఉందని,ఆరోపణలు చేసే వారు ఆధారాలు‌ చూపితే సమాధానం చెబుతానన్నారు.పూర్తి పారదర్శకంగా, ప్రశ్నించే విధంగా వ్యవస్థ ను అమలు చేస్తున్నామని,నిబంధనల ప్రకారం పని‌ చేయమంటే కొంతమంది కి‌ బాధ కలుగుతుందన్నారు. ఒక ప్లాన్ ప్రకారం చేశారని నాకు అర్ధం అవుతుందని,చట్టప్రకారం తాను ముందుకు వెళతానన్నారు. డైరెక్టర్లు,ఎండీ కి మద్య జరిగిన వివాదం పై ఛైర్మన్ బైరెడ్డి కూడ స్పందించారు.శాప్ లో అవినీతి జరిగిందనే మాటకి ఆధారాలు లేవన్నారు.శాప్ ఒక లాభాపేక్ష లేకుండా క్రీడాకారుల కోసం పని‌ చేస్తుందని,క్రీడా పరికరాల కొనుగోలులో  అవినీతి జరగడానికి ఆస్కారం లేదని,కొన్ని పరికరాలు ఎక్కువ ధరకు కొటేషన్ ఇస్తే... వెనక్కి పంపామని అన్నారు.