సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లు కష్టపడినా ఒక్కోసారి సరైన గుర్తింపు సమయం రాకపోవచ్చు. అయితే అలా ఎదురు చూస్తున్నప్పుడే ఒక్క డైలాగ్ తోనో లేదా ఒక్క సీన్‌తోనో లేదా ఒక్క సినిమాతోనో చాలా మంది నటీనటులకు మంచి గుర్తింపు వస్తుంటుంది. అలా గుర్తింపు తెచ్చుకున్న నటీనటులు ఇండస్ట్రీలో చాలా మందే కనిపిస్తుంటారు. అలాంటి వారిలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. సినిమాల మీద ఇంట్రస్ట్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న క్యారెక్టర్లు, సినిమాలు చేసినా సరైన గుర్తింపు రాలేదు. అయితే ‘గుంటూరు టాకీస్’ సినిమాతో నటుడిగా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారాయన. తర్వాత గతేడాది వచ్చిన ‘డీజే టిల్లు’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు సిద్దు. ఇప్పుడు తాజాగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (ఎస్వీసీసీ) బ్యానర్ లో మరో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఫిబ్రవరి 7న ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆ కొత్త మూవీ అప్డేట్‌ను అందించారు మేకర్స్. దీంతో టిల్లు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారట.


‘డీజే టిల్లు’ మూవీ సూపర్ హిట్ కావడంతో సిద్దు ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు. ఈ సినిమాతో ఆయనకు యూత్ లో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. దీంతో ఈ మూవీకు సీక్వెల్ ను సిద్దం చేశారు మూవీ మేకర్స్ అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్స్ కూడా చేశారు. ప్రస్తుతానికి ‘టిల్లు స్క్వేర్’ పేరుతో ఈ  మూవీ సీక్వెల్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా పట్టాల మీద ఉండగానే సిద్దు మరో మూవీకి రెడీ అయిపోయారు. తాజాగా ఆయనకు సుకుమార్ స్కూల్ నుంచి పిలుపు వచ్చింది. ‘టిల్లు స్క్వేర్’ సినిమా తర్వాత సుకుమార్ రైటింగ్స్ లో పనిచేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాతో వైష్ణవి అనే కొత్త దర్శకురాలు ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. 


సుకుమార్ రైటింగ్స్ లో ఎస్వీసీసీ బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కబోతుంది. త్వరలోనే ఈ మూవీకు సంబంధించిన అన్ని విషయాలను అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. మరి సుకుమార్ రైటింగ్స్ లో సిద్దు జొన్నలగడ్డ ఎలాంటి సినిమాలో కనిపిస్తారో చూడాలి. సిద్దు సినిమాలకు ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఆయన సినిమా కథలను తయారుచేసుకుని దర్శకులతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యం అయ్యాకే సినిమాను మొదలు పెడతారు. అందుకే ఆయన సినిమాలంటే మినిమమ్ గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోతారు ఆడియన్స్. అందుకే ఈ సినిమా పై కూడా ఆసక్తి నెలకొంది. ఇక ‘టిల్లు స్క్వేర్’ సినిమా కూడా  ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. మొదటి సినిమాలో రాధిక పాత్ర లో కనిపించిన నేహా శెట్టి యూత్ ను బాగా ఆకర్షించింది. దీంతో ఇప్పుడు సీక్వెల్ పై కూడా అంచనాలు బాగానే పెరిగాయి.  


Read Also: ఆరంభం అదిరింది - బ్లాక్ బస్టర్లతో మొదలైన 2023, బాలీవుడ్‌కూ మంచి రోజులు!