Foods to Improve Romantic Life : శృంగార జీవితం మెరుగ్గా ఉంటే.. రిలేషన్ బాగుంటుందని అంటున్నారు నిపుణులు. దీనివల్ల భాగస్వామి మధ్య కెమిస్ట్రీ మెరుగ్గా ఉంటుందని.. వారికున్న సగం సమస్యలు తీరిపోతాయని అంటున్నారు. అంతేకాకుండా సరైన లైంగిక జీవితం లేకపోవడం చాలామంది విడిపోవాల్సి వస్తుందని చెప్తున్నారు. అందుకే దీనిపై దంపతుల కచ్చితంగా ఫోకస్ చేయాలని.. దానికి అనుగుణంగా జీవనశైలి మార్చుకోవాలని చెప్తున్నారు. అంతేకాకుండా ఫుడ్ విషయంలో కూడా కొన్ని మార్పులు చేయాలంటున్నారు. కొన్ని ఫుడ్స్ లైంగికంగా మీ జీవితం మెరుగుపడడంలో హెల్ప్ చేస్తాయని చెప్తున్నారు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏమిటంటే..
దానిమ్మతో..
దానిమ్మను సంతానోత్పత్తికి చిహ్నంగా చెప్తారు. ఇది శృంగార జీవితాన్ని మెరుగుపరుస్తుందని పలు అధ్యయనాలు కూడా తెలిపాయి. రెగ్యూలర్‌గా దానిమ్మ జ్యూస్ తాగితే స్ట్రెస్ తగ్గి.. రక్తప్రసరణ మెరుగవుతుంది. టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు.
డార్క్ చాక్లెట్స్
డార్క్ చాక్లెట్స్ వల్ల కలిగే లాభాల్లో ఇది కూడా ఒకటి. ఇది శరీరంలో సెరోటోనిన్‌ను విడుదల చేస్తుంది. అంతేకాకుండా మీ మూడ్‌ని బూస్ట్ చేస్తుంది. ప్రేమ, లైంగిక కోరికలను పెంచే ఫెనిలేథైలమైన్ అనే కెమికల్ దీనిలో పుష్కలంగా ఉంటుంది.
పాలకూర
పాల కూరలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా టెస్టోస్టిరాన్‌ను పెంచుతుంది. దీనిలోని ఐరన్ కోరక, ఉద్రేకం, ఉద్వేగాన్ని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. ఇది లైంగిక జీవితంలో స్త్రీలకు చాలా మంచిది అంటున్నారు.
పుచ్చకాయ
సమ్మర్లో దాహాన్నే.. లైంగికంగా తాపాన్ని తీర్చడంలో కూడా పుచ్చకాయ మంచిపాత్ర పోషిస్తుందట. పుచ్చకాయలో సిట్రులిన్ అనే అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మగవారిలో అంగస్తంభన సమస్య లేకుండా చేస్తుందని పలు అధ్యయనాలు నిరూపించాయి. వయాగ్రా వలె ప్రైవేట్ అవయవాల్లో రక్తాన్ని పంపింగ్ చేస్తుందట.
సీ ఫుడ్
దాదాపు సీ ఫుడ్స్ జింక్‌తో నిండి ఉంటాయి. ఇవి శరీరంలో టెస్టోస్టిరాన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది లైంగిక జీవితంలో అతిపెద్ద పాత్ర పోషిస్తుంది. పురుషుల్లో ఎక్కువ స్పెర్మ్‌ని ఉత్పత్తి చేయడానికి, స్పెర్మ్ కణాలు ఎక్కువగా కదలడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుందట. తృణధాన్యాలు, గుమ్మడి గింజలు, జీడిపప్పులు, పెరుగులో కూడా జింక్ ఎక్కువగా ఉంటుంది.
మరిన్ని ఫుడ్స్ లిస్ట్ ఇదే
ఇవే కాకుండా.. అవకాడోలోని హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్ కూడా మెరుగైన ఫలితాలు ఇస్తుందట. ముఖ్యంగా స్త్రీలకు వీటిని తీసుకుంటే మంచిది అంటున్నారు నిపుణులు. స్ట్రాబెర్రీలో రోమాన్స్కి చిహ్నాలుగా చెప్పవచ్చు. వీటిలోని విటమిన్ సి ఆ సామర్థ్యాన్ని పెంచుతుందట. అంతేకాకుండా స్ట్రెస్, ఆందోళనను తగ్గిస్తుందట. అవిసె గింజలు, చియాసీడ్స్, చేపలు, వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ లక్షణాలు కూడా లైంగిక జీవితాన్ని మెరుగుపరుస్తాయట.
Also Read : బుల్లెట్ ప్రూఫ్ కాఫీతో బరువుతో పాటు ఆ సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు.. కాకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయట
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.