ఒత్తిడి.. ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య. ఉద్యోగం, కుటుంబం, వ్యాపారం ఇలా ప్రతి ఒక్కచోట ఒత్తిడి లేని జీవితం లేకుండా పోతుంది. దైనందిన జీవితంలో ఇది ఒక భాగంగా మారిపోతుంది. ఒత్తిడి టైమ్ లో ఏ నిర్ణయం తీసుకున్నా అది అనాలోచితంగా తీసుకునేదే. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ధ్యానం, యోగా వంటివి చేసి మనసు అదుపులో ఉంచుకోవాలి. లేదంటే బర్న్ అవుట్ కి దారి తీస్తుంది. దీన్ని ఎదుర్కోవడం కోసం డాక్టర్ ని సంప్రదించి వీలైనంత త్వరగా నివారణ చర్యలు తీసుకోవాలి. ఒత్తిడి మెదడుని స్తంభింపజేసి ఆలోచించకుండా చేస్తుంది. అందుకే ఒత్తిడిలో ఉన్నప్పుడు ఈ టిప్స్ పాటించారంటే త్వరగా దాని నుంచి బయట పడొచ్చు.


⦿ కాసేపు విశ్రాంతి తీసుకోవాలి


⦿ చేస్తున్న పనికి పూర్తిగా భిన్నంగా ఏదైనా చేయండి


⦿ మనసుకి నచ్చిన వారితో మాట్లాడండి


⦿ ఏదైనా మంచి పుస్తకం చదవచ్చు


⦿ ప్రాణాయామం, యోగా, నిద్ర, ధ్యానం చేయవచ్చు


⦿ మంచి మ్యూజిక్ వినడం


⦿ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయవచ్చు


ఒత్తిడికి గురైనప్పుడు కార్టిసాల్ రక్తప్రవాహంలోకి ఎక్కువగా విడుదల అవుతుంది. అది మెదడు ఆలోచన, దృష్టి మీద ప్రభావం చూపిస్తుంది. అటువంటి టైమ్ లో మనం చదువుతున్నా, ఏదైనా పని చేస్తున్నా దాని మీద దృష్టి తక్కువగా ఉంటుంది. ఒత్తిడిలో ఒక్కోసారి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అటువంటి సమయంలో చేసిన పని సరిగా రాక మళ్ళీ చేయవలసి వస్తుంది.


యోగా లేదా శ్వాస వ్యాయామాలు వంటి మనసుకి విశ్రాంతిని కలిగించే పద్ధతులు పాటించాలని సైకాలజిస్ట్ నిపుణులు సూచిస్తున్నారు. శరీరాక శ్రమలో పాల్గొనడం మంచిది. తగినంత నిద్ర పోవాలి. అప్పుడే ఒత్తిడిని అధిగమించగలుగుతారు. ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. స్టెస్ట్ పెంచే ఆహారాలు కొన్ని ఉంటాయి. వాటిని ఆ టైమ్ లో తీసుకోకపోవడమే ఉత్తమం. అవి ఒత్తిడిని మరింత పెంచే ప్రమాదం ఉంది. స్నేహితులు, మనసుకి నచ్చిన వారితో కాసేపు ప్రశాంతంగా మాట్లాడితే ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది.


ఒత్తిడి దీర్ఘకాలం పాటు కొనసాగితే మానసిక సమస్యలు కూడా వస్తాయి. అది మాత్రమే కాదు బరువు పెరిగేందుకు దోహదపడుతుంది. ఒత్తిడిగా ఉన్నప్పుడు ఆకలిని ప్రేరేపిస్తుంది. ఇది అతిగా తినేలా చేస్తుంది. ఒత్తిడి హార్మోను తగ్గించే ఆహారాలను ప్రత్యేకంగా తినాలి. ఒత్తిడి తగ్గాలంటే సెరోటోనిన్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేసే ఆహారాలను కచ్చితంగా తినాలి. ముఖ్యంగా రోజూ అరటి పండ్లు, బాదం పప్పులు, పాలు, కోడి గుడ్లు, పప్పు ధాన్యాలు వంటివి అధికంగా తినాలి. ఆనంద హార్మోన్ అయిన ఎండార్ఫిన్ స్థాయిలను పెంచే ఆహారాలను కూడా తినాలి. ఇందుకోసం డార్క్ చాకొలెట్ రోజూ చిన్న ముక్క తినాలి. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: నెలరోజులు నూనె వాడటం మానేస్తే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?