రిఫైన్డ్ ఆయిల్ అత్యధికులు ఆరోగ్యకరమనుకుని ఉపయోగించే వంట నూనె. శుద్ధి చేసింది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండవని అనుకుంటారు. ఫ్రైయింగ్, డ్రెస్సింగ్, బేకింగ్ సహ వివిధ రకాల వంతల కోసం ఎక్కువగా వినియోగిస్తారు. అధిక స్మోక్ పాయింట్ ఉన్న ఈ నూనె వంటలకి మంచి రుచిని ఇస్తుంది. కానీ వీటిలో అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. బరువు పెరగడం, గుండె జబ్బుల ప్రమాదాన్ని ఇవి పెంచుతాయి. శుద్ది చేసిన నూనె ఉపయోగించడం మానేస్తే గుదే ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గుతారు. ఒక నెల రోజుల పాటు శుద్ది చేసిన నూనె తీసుకోవడం మానేస్తే శరీరంలో అనేక ఆరోగ్యకరమైన మార్పులు చోటు చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.


⦿బరువు తగ్గుతారు. శుద్ధి చేసిన నూనెలు కేలరీలని పెంచుతాయి. వాటి వినియోగం తగ్గిస్తే కేలరీలు తీసుకోవడం తగ్గించినట్టే. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.


⦿రిఫైన్డ్ ఆయిల్ ఇన్సులిన్ సెన్సిటివిటీని ప్రభావితం చేస్తాయి. వీటిని తగ్గిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి.


⦿అధికంగా ప్రాసెస్ చేసిన నూనెలు కొంతమందిలో జీర్ణ అసౌకర్యాన్ని కలిగిస్తాయి. నూనె తీసుకోవడం ఆపేస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.


నెలపాటు శుద్ది చేసిన నూనె తీసుకోకపోతే అనారోగ్య కొవ్వులు తీసుకోవడం తగ్గించినట్టే. అయితే మీరు నూనె మార్చుకునే ముందు నిపుణులని సంప్రదించడం ముఖ్యం. శరీరానికి అవసరమైన ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు అవసరం. వాటి కోసం అవకాడో, గింజలు, నట్స్, కొవ్వు చేపలు తీసుకోవడం మంచిది. శారీరక విధులకు కొవ్వులు అవసరమే. అందుకే శుద్ది చేసిన నూనెలు భర్తీ చేసే ముందు వాటికి ప్రత్యామ్నాయాలు కూడా చూసుకోవాలి.


ఆలివ్ ఆయిల్: ఎక్స్ ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ లో మోనోఅన్ శాచురేటెడ్ కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. గుండెకి మేలు చేసే నూనెలో ఆలివ్ ఆయిల్ మొదటి స్థానంలో ఉంటుంది.


అవకాడో నూనె:  దీని అధిక స్మోక్ పాయింట్ కారణంగా అధిక ఉష్ణోగ్రత వద్ద వంట చేయడానికి అనుకూలంగా ఉంటాయి. ఇందులోని మోనోఅన్ శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి.


కొబ్బరి నూనె: పచ్చి కొబ్బరి నూనె మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ కలిగి ఉంటుంది. ప్రత్యేకమైన రుచిగా ఉంటుంది. మితమైన ఉష్ణోగ్రత వద్ద వంట చేయడం మంచిది.


నట్స్, సీడ్స్ ఆయిల్: వాల్ నట్, అవిసె గింజల నూనె, నువ్వుల నూనె మంచిది. వీటిలో కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. తక్కువ స్మోక్ పాయింట్ కలిగి ఉంటుంది. అందుకే దీన్ని వేడి చేయడం ఆరోగ్యానికి ఉత్తమం కాదు.


వెన్న లేదా నెయ్యి: పాల ఉత్పత్తులు ఇష్టపడే వారికి వెన్న లేదా నెయ్యి వంటలకు ఉపయోగించుకోవచ్చు. అయితే మితంగా వాడుకుంటేనే ఆరోగ్యకరం.


బటర్: బాదం, పీనట్ బటర్ వంటి గింజలతో చేసిన వెన్న వంటకాలకు స్ప్రెడ్ చేసుకుని తీసుకోవచ్చు.


ఆహారం నుంచి కొవ్వులను పూర్తిగా తొలగించుకోవడం కనటే సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం, ఆరోగ్యకరమైన కొవ్వులు చేర్చుకోవడం మంచిది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: మీకు డిమెన్షియా రాబోతుందని మీ కళ్ళు ముందే చెప్పేస్తాయ్