Tips to Sleep Better at Night : రాత్రుళ్లు మీరు మంచిగా నిద్రపోతే.. ఆ రోజు మీకు చాలా యాక్టివ్​గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలామంచిది. కొందరు సరైన నిద్రలేక శారీరక, మానసిక అనారోగ్యాల బారిన పడతారు. మంచి నిద్ర అనేది ప్రతి వ్యక్తికి అవసరమైనది. ఇది మెదడు కణాలను తిరిగి శక్తివంతం చేయడానికి హెల్ప్ చేస్తుంది. చర్మాన్ని మరమ్మత్తు చేస్తుంది. దీర్ఘకాలిక సమస్యలకు మంచి నిద్ర ఉపశమనం ఇస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరచడంలో కూడా ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది.


వివిధ పనులు, అవసరాల కోసం చాలామంది నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. కానీ అదే అలవాటు అయితే కొన్నిరోజులకు మీకు నిద్ర దూరమవుతుంది. ఇది శారీరకంగా, మానసికంగా కూడా మిమ్మల్ని కృంగదీస్తుంది. అయితే మీ న్యూ ఇయర్​ రెజుల్యేషన్​లో భాగంగా మీరు నిద్రకు ప్రాధన్యతనివ్వండి. నిద్రలేమి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతుంటే మీరు కొన్ని చిట్కాలను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కొత్త సంవత్సరం నుంచి మీరు వీటిని ఫాలో అవ్వండి. 


అతిగా ఆలోచించకండి..


నిద్ర నాణ్యతను మెరుగుపరచుకోవడం కోసం చాలామంది మునుపెన్నడూ లేనంతగా ట్రై చేస్తున్నారు. ఉద్దేశం మంచిదే అయినా.. తగినంత నిద్ర అనేది మీకు తెలిస్తే చాలు. మీరు మంచిగా పడుకున్నారా? లేదా అనేది ట్రాక్ చేసుకుంటూ పోతే.. మీ మీద అనవసరమైన స్ట్రెస్ పడుతుంది. పొరపాటునా కొంచెం పడుకోకపోయినా అది మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది. శరీరంలో కార్టిసాల్ స్థాయిలను పెంచి.. ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ టైమ్​కి పడుకోవాలి అనేది చూస్తే మీకు నిద్ర రాకపోవచ్చు. నిద్ర దానంతటా అదే వచ్చే మార్గాలను వెతుక్కోండి. వచ్చినప్పుడు ఇతర పనులు పెట్టుకోకుండా వెళ్లి ప్రశాంతంగా నిద్రపోండి. 


ధ్వని నియంత్రణ


మీరు పడుకునే రూమ్​లోకి సౌండ్స్ తక్కువగా వచ్చేలా చూసుకోండి. అటానమస్ సెన్సరీ మెరిడియన్ రెస్పాన్స్ సెట్ చేసుకుంటే మీరు సులభంగా నిద్రపోవడంలో హెల్ప్ చేస్తుంది. ఇది శబ్దానికి మన సొంత ప్రతిస్పందనను ఇస్తుంది. అయినప్పటీకి.. కాస్త ఓదార్పుగా, హిప్నోటిక్​గా మిమ్మల్ని నిద్రలోకి తీసుకెళ్తుంది. మానసికంగా రిలీఫ్ ఇచ్చి.. శరీరంలో ఆక్సిటోసిన్​, డోపమైన రసాయనాల విడుదలను ప్రేరేపించి.. విశ్రాంతిని ఇస్తుంది. 


ఒత్తిడిని తగ్గించుకోండి..


మీరు ఎంత ఒత్తిడికి గురైతే.. మీకు ఆరోగ్యం, నిద్ర అంత దూరమవుతాయి. కాబట్టి మీకు ఒత్తిడినిచ్చే వాటి గురించి ఎక్కువ ఆలోచించకపోవడమే మంచిది. అలాగే పడుకునేప్పుడు మీరు కంఫర్ట్​ ఉండే దుస్తులను వేసుకోవాలి. ఇవి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిద్రనివ్వడంలో హెల్ప్ చేస్తాయి. కొన్నిసార్లు మంచి దుస్తులు ధరించకపోవడం వల్ల కూడా నిద్ర రాదు. పడుకునేముందు చిన్న చిన్న స్ట్రెచ్​లు చేయండి. మంచి మ్యూజిక్​ లేదా పాటను వినడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇది సెరోటోనిన్​ ఉత్తేజపరిచి.. ప్రశాంతతను ఇస్తుంది. 


మీ శరీరాన్ని వీలైనంత రిలాక్స్ చేయండి. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి బ్రీత్​ తీసుకుంటూ హమ్ చేయవచ్చు. లేదంటే కాలి వేళ్లను బిగించవచ్చు. కాలివేళ్లను బిగించి వాటిని విడుదల చేయడం వల్ల ప్రతికూల ఆలోచనల నుంచి మనసును మరల్చవచ్చు. ఇది మీకు ప్రశాంతతను అందిస్తుంది. ఇది నిజంగా పనిచేస్తుందని ఓ అధ్యయనం తెలిపింది. శరీరంలోని ఇతర భాగాల ద్వారా కూడా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. తద్వార మీకు సులభంగా నిద్రపడుతుంది. 


వ్యాయామం..


నిద్ర, వ్యాయామం పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి. ఇవి ఒకదానిపై మరొకటి ప్రభావం చూపిస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే శరీరంలో కార్టిసాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. వర్కవుట్ చేయడం వల్ల మెలటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. మీ శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో హెల్ప్ చేస్తాయి. అయితే మీరు పడుకునే ముందు బాలాసానం వంటి యోగా ఆసనాలు చేయవచ్చు. ఇవి మీకు ఒత్తిడినుంచి రిలీఫ్​ ఇస్తాయి. 


బాగా నిద్రించలంటే.. బాగా తినాలి..


నిద్రవేళ దగ్గరవుతున్న సమయంలో ఆల్కహాల్, కాఫీ వంటి వాటికి దూరంగా ఉండండి. అంతేకాకుండా చక్కెర, కొవ్వు ఎక్కువ కలిగిన ఫుడ్స్​ ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. తద్వార నిద్రకు అంతరాయం కలిగిస్తాయి. ప్రోటీన్ రిచ్​ ఫుడ్​లు, స్వీట్​ పొటాటో వంటి సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్ ఫుడ్స్ మీ డైట్​లో ఉండేలా చూసుకోండి. రాత్రి నిద్రకు ఆరోగ్యకరమైన గట్​ చాలా కీలకం. ఆకుకూరలు, చిక్కుళ్లు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. 


సూర్యకాంతి పడాలి.. 


మీరు రోజంతా గదిలో ఉండి పనిచేసుకోవాల్సి వస్తే దానిని నుంచి బ్రేక్​ తీసుకుని కాస్త సూర్యరశ్మి మీపై పడేలా చూసుకోండి. ఇది వినేందుకు వింతగా ఉన్నా.. రాత్రి నిద్రలో కీలకంగా ఉంటుంది. శరీరం సూర్యరశ్మికి గురికావడం వల్ల సెరోటోనిన్ ఉత్పత్తి అవుతుంది. ఇది ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉండేలా చేస్తుంది. 


Also Read : మీరు ఎంత తిన్నా ఆకలిగానే ఉంటుందా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే..