Always Feeling Hungry : రోజూలాగే మీరు మీకు నచ్చిన ఫుడ్‌ని కడుపు నిండా తిన్నారు. మళ్లీ గంట తర్వాత మీకు అంతే ఆకలి వేస్తుందా? అయితే మీ శరీరంలో ఏదో తప్పు జరుగుతుంది. దానిని గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం. దీనికి కారణం బ్లడ్ షుగర్ డిప్స్ అంటున్నారు నిపుణులు. మీ రక్తంలో చక్కెర స్థాయిల్లో లోపాలే దీనికి కారణం అని గుర్తించాలి. కడుపు నిండా ఏదైనా తిన్న రెండు, మూడు గంటల తర్వాత ఆకలి వేస్తుందంటే పర్లేదు.
ఎంత తిన్నా.. మళ్లీ ఏదో తినాలనే ఫీల్ వస్తుందంటే మీరు కచ్చితంగా ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి. ఇలా అనిపించడానికి రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడమే కారణం. శుద్ధి చేసిన, కార్బోహైడ్రేట్, చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఇలాంటింది జరుగుతుంది. ఇది మన రక్తంలో చక్కెరను పెంచుతుంది. తాజాగా వెయ్యి మందిపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెళ్లడైంది. ప్రతి ముగ్గురిలో ఒకరు దీనితో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. ఈ సమస్య మానసిక, శారీరకంగా కూడా సంబంధం కలిగి ఉంది. ఇలాంటి వారు రోజుకు 300 కేలరీలు అదనంగా ఫుడ్ తింటారు. ఇది ఆరోగ్యకరమైనది కాదు. అయితే మీరు కొన్ని చిట్కాలతో ఈ సమస్యను అధిగమించవచ్చు. వాటిలో మూడు కచ్చితంగా ఫాలో అయితే దీనికి పూర్తిగా చెక్ పెట్టవచ్చు.
సమతుల్యమైన బ్రేక్‌ఫాస్ట్
బ్రేక్‌ఫాస్ట్‌పై చాలామంది శ్రద్ధ చూపరు కానీ.. అది రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం. కాబట్టి కచ్చితంగా దానిపై శ్రద్ధ వహించాలి. సమతుల్యమైన ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుంతిది. కాబట్టి రెగ్యూలర్ టైమ్‌కి ఆకలి వేస్తుంది. నట్స్, ప్రూట్స్ వంటి ఫుడ్‌ను మీ బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకోండి. ఇది భోజనం వరకు ఎలాంటి స్నాక్స్ లేకుండా మిమ్మల్ని ఉంచుతుంది. కేవలం బ్రేక్‌ఫాస్ట్‌లోనే కాదు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుకోవడానికి మీరు ప్రతి భోజనంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి.
వ్యాయామం
రోజులో ఏదొక సమయంలో కుదిరితే ఉదయాన్నే వ్యాయామం చేయండి. ఇది మీ రోటీన్లో భాగమైపోవాలి. ఇది మీ కండరాలను బలంగా చేస్తుంది. కండరాలు శరీరంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. మనకు సరైన కండర ద్రవ్యరాశి లేనప్పుడు రక్తంలోని చక్కెరను తగ్గించుకోవడం కష్టమవుతుంది. ఇది ఇన్సులిన్, రక్తంలో చక్కెర పెరిగేలా చేస్తుంది.
ఎలక్ట్రోలైట్లు తీసుకోవాలి..
రోజూవారీ జీవితంలో మీరు తగినంత ఎలక్ట్రోలైట్‌లను పొందుతున్నారో లేదో తెలుసుకోండి. ఇది ఆకలిని దూరం చేయడంలో చాలా ఉత్తమంగా పనిచేస్తుంది. శరీరం సరిగ్గా పనిచేయడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా జ్ఞానం, మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. ఇది ఆకలిని కూడా ప్రభావం చేస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్లు అసమతుల్యమైనప్పుడు శరీరంలో తనకు అవసరమైన పోషకాలను తిరిగి నింపుకోవడం ఆకలిని ప్రేరేపిస్తుంది. తద్వారా మీకు తెలియకుండానే ఎక్కువగా తినేస్తారు. కాబట్టి మీరు రోజూవారీ జీవితంలో ఎలక్ట్రోలైట్‌లను తీసుకోండి. ఎనర్జీ డ్రింక్స్ లాంటి వాటికి దూరంగా ఉండండి. తగినంత నీటిని తీసుకోవడం చాలా మంచిది.
Also Read : పనీర్ బేసిన్ దోశ.. సింపుల్, టేస్టీ రెసిపీ ఇదే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.