Mangala Aditya Raja Yoga Effect: 2023 చివర్లో కుజుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు. అంగారకుడు డిసెంబర్ 27న ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే డిసెంబర్ 16 నుంచి సూర్యుడు ధనుస్సు రాశిలోనే సంచరిస్తున్నాడు. కుజుడు కూడా ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం వల్ల ఆదిత్య మంగళ రాజయోగం ఏర్పడబోతోంది. ఈ ప్రభావం అన్ని రాశులపైనా ఉన్నప్పటికీ కొన్ని రాశులవారికి అత్యంత శుభఫలితాలను అందిస్తోంది. జ్యోతిషశాస్త్రంలో  అంగారక గ్రహాన్ని గ్రహాల కమాండర్ అని పిలుస్తారు. కుజుడు ధైర్యం, విశ్వాసం, శౌర్యం, భూమి, శక్తి, ధైర్యసాహసాలకు కారకంగా పరిగణిస్తారు. కుజుడు ధనుస్సు రాశిలో సంచరిస్తున్న కాలంలో ఈ 5 రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది. చేపట్టిన పనిలో అడ్డంకులు తొలగిపోతాయి. మరి ఆదిత్య మంగళ రాజయోగం వల్ల ఏఏ రాశులవారికి అదృష్టం కలిసొస్తుందో చూద్దాం..


మిథున రాశి (Gemini)


ఆదిత్య మంగళ రాజయోగం వల్ల మిథున రాశివారికి వృత్తిలో ఎదుగుదలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపారంలో ఊహించనంతగా విస్తరిస్తారు.  ధన వృద్ధి ఉంటుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. 


Also Read: రాశిమారిన బుధుడు ఈ 5 రాశులవారి ఫేట్ మార్చేస్తాడు!


సింహ రాశి (Leo)


సింహరాశివారికి వ్యాపారంలో లాభం ఉంటుంది. ఖర్చుల భారం తగ్గుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రణాళిక ప్రకారం ఖర్చులు చేస్తే మంచిది. స్నేహితుల నుంచి ధనలాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 


తులా రాశి (Libra)


ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. చేపట్టిన పనుల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతికి అవకాశాలు ఉంటాయి. కొత్త వనరుల ద్వారా సంపద పెరుగుతుంది. 


ధనుస్సు రాశి (Sagittarius)


ఆదిత్య మంగళ రాజయోగం వల్ల వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.పిల్లల పక్షం మీకు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం ఉంది. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.


Also Read: డిసెంబర్ 25 నుంచి ఈ 5 రాశుల వారికి మంచిరోజులొస్తున్నాయ్!


మీన రాశి (Pisces)


సూర్యుడు-కుజుడు ధనస్సు రాశిలో సంచరించే సమయంలో ఈ రాశివారు కొత్త విజయాలు సాధిస్తారు. వృత్తి జీవితం బావుంటుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆదాయం మెరుగుపడుతుంది. ఖర్చులు తగ్గుతాయి. కుటుంబ జీవితం బావుంటుంది. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. 


డిసెంబరు 16న ధనస్సు రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు జనవరి 15 మకర రాశిలోకి మారనున్నాడు. సూర్యుడు మకర రాశిలో సంచరిస్తే ఆ రోజే మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. ఇక డిసెంబరు 27 ధనస్సు రాశిలో ప్రవేశించిన కుజుడు  ఫిబ్రవరి 5 వరకూ  అదే రాశిలో ఉంటాడు. అంటే దాదాపు 40 రోజుల పాటూ కుజుడు ధనస్సు రాశిలోనే ఉంటాడు. ఇక సూర్యుడు - కుజుడు 20 రోజుల పాటూ ఒకే రాశిలో ఉంటారు. ఈ సమయంలో పైన పేర్కొన్న రాశులవారికి శుభసమయం నడుస్తుంది.  


Also Read: ఈ రాశులవారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి,డిసెంబరు 27 రాశిఫలాలు


గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం


2024 మిథున రాశిఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 


2024 కర్కాటక రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


2024 సింహ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి