Daily Horoscope Today December 27th, 2023 ( డిసెంబరు 27 రాశిఫలాలు)


మేష రాశి (Aries Horoscope Today) 


ఈ రోజు ఈ రాశివారికి ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయి. కోపం తగ్గించుకోవడం మంచిది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అధిక కోపాన్ని నివారించండి. మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. ఇంట్లో మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చులు పెరుగుతాయి. 
కార్యాలయంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి 


వృషభ రాశి (Taurus  Horoscope Today)


ఈ రోజు మీకు సాధారణంగానే ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కొంత అసమ్మతి సంకేతాలు ఉన్నాయి. కొత్త ఆదాయ వనరుల నుంచి ఆర్థిక లాభం ఉంటుంది కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. విద్యా పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. తెలివిగా ఖర్చు చేయండి. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబంలో అనవసర వాదనలకు దూరంగా ఉండండి 


Also Read: రాశిమారిన బుధుడు ఈ 5 రాశులవారి ఫేట్ మార్చేస్తాడు!


మిథున రాశి (Gemini Horoscope Today) 


ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనసు ఆనందంగా ఉంటుంది. మీరు మీ తల్లి నుంచి మద్దతు పొందుతారు. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. స్నేహితుల సహకారంతో పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. కష్టపడి పని చేసిన తర్వాత మాత్రమే విజయం సాధించగలరని గుర్తుంచుకోవాలి. అతిథుల రాక వల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి 


కర్కాటక రాశి (Cancer Horoscope Today)  


ఈ రాశి నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. సామాజిక హోదా, ప్రతిష్ట , సంపద పెరుగుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. 


సింహ రాశి (Leo Horoscope Today)


ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రారంభించిన పనుల్లో జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. పూర్వీకుల ఆస్తి కలిసొస్తుంది. సంపద పెరుగుతుంది. ఉద్యోగరీత్యా ప్రయాణం చేయాల్సి రావొచ్చు. 


Also Read: 2024 లో ఈ 6 రాశులవారి దశ తిరిగిపోతుంది, కష్టాలు తీరిపోతాయ్!


కన్యా రాశి  (Virgo Horoscope Today) 


మీకు పని విషయంలో అదనపు బాధ్యతలు వస్తాయి. కార్యాలయంలో అనవసర వాదనలకు దూరంగా ఉండండి. వ్యాపారంలో విస్తరణ ప్రభావం ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబం, స్నేహితుల సహకారంతో పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. పాత మిత్రులతో సమావేశం ఉంటుంది


తులా రాశి (Libra Horoscope Today) 


విద్యా పనుల్లో విజయం సాధిస్తారు. మనసు ఆనందంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు  ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం పొందవచ్చు. ఖర్చులు తగ్గుతాయి. డబ్బును తెలివిగా ఖర్చు చేయండి.


వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 


వస్తు సంపద పెరుగుతుంది. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. స్నేహితుల సహకారంతో వ్యాపారంలో పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి . ధన ప్రవాహం పెరుగుతుంది. మాటలో మాధుర్యం ఉంటుంది. ఈరోజు అధిక ఖర్చులు ఉంటాయి తెలివిగా డబ్బు ఖర్చు చేయండి 


Also Read:  2024 లో ఈ రాశులవారికి శని యోగకారకుడు, అదృష్టం-లక్ష్మీకటాక్షం!


ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 


మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మేధోపరమైన పనిలో మంచి ఫలితాలను పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. మీ ప్రసంగంలో మాధుర్యం ఉంటుంది, కానీ మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.  కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.


మకర రాశి (Capricorn Horoscope Today) 


ఉద్యోగం , వ్యాపారంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. విద్యా పనులలో ఆటంకాలు ఉండవచ్చు. సంభాషణలో మితంగా ఉండండి, అధిక కోపానికి దూరంగా ఉండండి.


Also Read: డిసెంబర్ 25 నుంచి ఈ 5 రాశుల వారికి మంచిరోజులొస్తున్నాయ్!


కుంభ రాశి  (Aquarius Horoscope Today) 


సామాజిక స్థితి, ప్రతిష్టలు పెరుగుతాయి. మాటలో మాధుర్యం ఉంటుంది. ఉద్యోగులు పై అధికారుల మద్దతు పొందుతారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చదువుపై ఆసక్తి ఉంటుంది, కానీ జీవనశైలి అస్తవ్యస్తంగా మారవచ్చు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.


మీన రాశి (Pisces Horoscope Today) 


మానసిక ప్రశాంతతను కాపాడుకోండి. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. స్నేహితుల సహకారంతో ఉద్యోగంలో పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మేధోపరమైన పనిలో మంచి ఫలితాలు పొందుతారు. పూర్వీకుల ఆస్తి ద్వారా సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి.  వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. 


గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం


2024 మిథున రాశిఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 


2024 కర్కాటక రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


2024 సింహ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి