Gruhalakshmi  Telugu Serial Today Episode:  తులసి వెళ్లి కాఫీ పెట్టుకొస్తానని చెప్పగానే పరంధామయ్య నువ్వెందుకు పెడతావు. ఈ ఇంటి కోడలు ఉంది కదా కోడలు పిల్లను పెట్టుకురమ్మను అంటాడు. అనసూయ తిడుతూ ఉంటే తులసి ఆపి మీరు అడిగేది. ఈ ఇంటి కోడలు లాస్య గురించే కదా తను గుడికి వెళ్లింది. అందుకే కాఫీ నేను పెట్టుకొస్తాను అంటుంది తులసి. అవసరం లేదు లాస్య వచ్చాకే నేను కాఫీ తాగుతాను తాను ఇంటికి రాగానే నన్ను కలవమనండి అని ఆర్డర్‌ వేసి బెడ్‌రూంలోకి వెళ్తాడు పరంధామయ్య. అందరూ షాకింగ్‌గా చూస్తూ ఉండిపోతారు. మరోవైపు రాజ్యలక్ష్మీ, బసవయ్య, ప్రసూనాంబ హాల్లో కూర్చొని ఇంకా ఎటువంటి అరుపులు, హాహాకారాలు వినిపించడం లేదని చూస్తూ ఉంటారు. ఇంతలో విక్రమ్‌ కిందకు వచ్చి దివ్యను పిలుస్తూ కాఫీ ఇవ్వమని పిలుస్తాడు.


రాజ్యలక్ష్మీ: కాఫీ కావాలా బాబు నేను పెట్టకురానా?


బసవయ్య: అదేంటి వదిన నేనున్నాను కదా?


రాజ్యలక్ష్మీ: అది కాదు మా వాడికి నేను కాఫీ పెట్టి చాలా రోజులైంది.


విక్రమ్‌: ఎవరో ఒకరు దివ్య పెట్టిస్తుందిలే అమ్మా.   దివ్యా దివ్యా..


రాజ్యలక్ష్మీ: దివ్య పైనే ఉంది కదా?


విక్రమ్‌: లేదే నిద్రలేచిప్పటి నుంచి నాకు కనిపించలేదు. ఎర్లీగా లేచి పనిలో పడింది అనుకున్నాను.


ప్రసూనాంబ: అదేం లేదు అల్లుడు మాకు పొద్దటి నుంచి కనిపించనే లేదు.


బసవయ్య: మనమే రావొద్దు అన్నాంగా అందుకే పైనే రెస్ట్‌ తీసుకుంటుందేమో? ఎందుకైనా మంచిది ఒకసారి పైకెళ్లి మంచం కింద టేబుల్‌ కింద చూద్దాం. అంటే జస్ట్ నా అనుమానం అంతే పాపం తన పరిస్థితి అలాంటిది కదా?


రాజ్యలక్ష్మీ: అది సరే తమ్ముడు పైన లేక కింద లేకా ఎక్కడికి వెళ్లినట్లు?


  అనగానే విక్రమ్‌, దివ్యకు ఫోన్‌ చేస్తాడు. ఫోన్‌ పైన మోగుతుందని బసవయ్య చెప్తాడు. దీంతో ఇంతకీ దివ్య ఎక్కడికి వెళ్లినట్లు అంటూ అందరూ ఆలోచిస్తుండగా విక్రమ్‌కు ఫోన్‌ వస్తుంది. రాంనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఎస్పై ని మాట్లాడుతున్నానని దివ్యను అరెస్ట్‌ చేశామని చెప్పడంతో విక్రమ్‌ తనకేం తెలియదని చెప్పడంతో ఆవిడేమో తనే యాక్సిడెంట్‌ చేశానని అర్ధరాత్రి వచ్చి స్టేషన్ లో లొంగిపోయింది. మీరేమో తనకేం తెలియదని చెప్తున్నారు. అందరూ కలిసి తమాషా చేస్తున్నారా? అంటూ స్టేషన్‌కు రమ్మని ఫోన్‌ పెట్టేస్తాడు. దీంతో అందరూ స్టేషన్‌కు వెళ్తారు.


రాజ్యలక్ష్మీ: ఎక్కడ మా దివ్య ఎక్కడ వెంటనే మా దివ్యను వదిలిపెట్టండి.


ఎస్సై: ఏంటమ్మా ఇది అర్దరాత్రి ఆవిడ వచ్చి వెంటనే అరెస్ట్‌ చేయమంటది. తెల్లవారగానే మీరొచ్చి వెంటనే రిలీజ్‌ చేయమంటారు. అసలేం జరుగుతుంది. పోలీసులు అంటే మీ ఇంటి నౌకర్లు అనుకుంటున్నారా?


బసవయ్య: ఎదో తెలియక అర్దరాత్రి పూట నడుచుకుంటూ మీ స్టేషన్‌కు వచ్చింది సార్‌ మా దివ్యను క్షమించి వదిలేయండి సార్‌.


ఎస్సై: నిద్రలో నడుచుకుంటూ వచ్చిందా?


బసవయ్య: దాదాపు అంతే సార్‌


ఎస్సై: యాక్సిడెంట్‌ చేసి ఆ అమ్మాయిని చంపింది అని చెప్పింది. అది కూడా నిద్రలోనే చెప్పిందా?


  అనగానే రాజ్యలక్ష్మీ ఫోన్‌ ఎస్సైకి ఇస్తూ కమిషనర్‌ గారు మీతో మాట్లాడతారంటా అంటూ చెప్తుంది. కమీషనర్‌తో ఫోన్‌ మాట్లాడిన తర్వాత దివ్యను వదిలేయమని కానిస్టేబుల్‌కు చెప్పి ఇకపై మీ కోడలును జాగ్రత్తగా చూసుకోండని చెప్తాడు. ఇంతలో దివ్య ఎస్సై దగ్గరకు వచ్చి మా వాళ్లు అబద్దం చెప్తున్నారని నేను యాక్సిడెంట్‌ చేశానని చెప్తుంది. దీంతో విక్రమ్‌, దివ్యను తీసుకుని అక్కడి  నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు పరంధామయ్య బెడ్‌రూంలో ఆలోచిస్తూ కూర్చుని ఉంటాడు. బయట హాల్లో నంద, తులసి, అనసూయ బాధపడుతూ ఉంటారు. ఇంతలో డాక్టర్‌ వస్తాడు. ఎంటి అందరూ అలా ఉన్నారని అడుగుతాడు. పరంధామయ్యకు నిజం చెబుదామనుకుంటున్నట్లు చెప్తారు. అలా చేస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్‌ పరంధామయ్య రూంలోకి వెళ్తాడు. ఎలా ఉన్నావని డాక్టర్‌ పలకరించగానే బాగా లేనని మా వాళ్లందరూ తనను చీట్‌ చేస్తున్నారని నేను వాళ్లపై పోలీసులకు కంప్లైట్‌ చేస్తానని అంటాడు పరంధామయ్య. మీరంతా బయటకు వెళ్లండి పేషెంట్‌తో నేను పర్సనల్‌గా మాట్లాడాలి అని డాక్టర్‌ చెప్పగానే నంద, తులసి, అనసూయ బయటకు వెళ్తారు. ఇంతలో లాస్య డాక్టర్‌కు ఫోన్‌ చేస్తుంది.


లాస్య: ఎక్కడున్నావ్‌ ఆ ముసలోడి దగ్గరేనా..? ఏమంటున్నాడు..?


డాక్టర్‌: ఇప్పటి వరకు నేను చెప్పినట్లే వింటున్నాడు.


లాస్య: నా గురించి కలవరిస్తున్నాడా?


డాక్టర్‌: అలుగుతున్నాడు కూడా


   అనగానే ఇకపై నీ డోస్‌ పెంచు అంటూ డాక్టర్‌కు లాస్య చెప్తుంది. ఏమని చెప్పాలి అని అడుగుతాడు డాక్టర్‌. ఇక నుంచి లాస్య చాలా మంచిదని ఇంట్లో వాళ్లే కావాలని లాస్యను ఇంట్లోంచి బయటకు గెంటివేశారని చెప్పు అని లాస్య చెప్పడంతో అలాగేనని డాక్టర్‌ పరంధామయ్యకు హిప్నటైజ్‌ చేస్తాడు. ఈపాటికి డాక్టర్‌ ట్రీట్‌మెంట్‌ అయిపోయి ఉంటుంది. దీంతో నన్ను ఇంటికి రమ్మని తులసి నా కాళ్లు పట్టుకోకతప్పదని హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు రాజ్యలక్ష్మీతో జరిగిందేదో జరిగిపోయింది ఆ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం అని విక్రమ్‌ అనగానే  ఆ విషయం దివ్యను చెప్పమను అంటుంది రాజ్యలక్ష్మీ. దీంతో విక్రమ్‌ దివ్యను అమ్మకు సారీ చెప్పమని అనడంతో దివ్య కోపంగా నన్నెందుకు అందరూ టార్గెట్‌ చేస్తున్నారు అంటూ బాధపడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


Read Also: ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ రిలీజ్‌ డేట్ ఫిక్స్, సుహాస్ హ్యాట్రిక్ హిట్ కొట్టేనా?