Naga Panchami Serial Today Episode : పంచమి తల్లి గౌరి నిద్రలో ఉండగా ఆమె దగ్గరకు పాము వచ్చి పక్కనే ఉంటుంది. దీంతో గౌరి ఉలిక్కి పడి లేస్తుంది. భయంతో చెమటలు పట్టేస్తుంది. తనని కాటేయకుండా తననే పాము అలా చూస్తుంది అంటే అది పంచమి ఏమో అనుకుంటుంది. అమ్మా పంచమి అని పిలుస్తుంది. పంచమి అని ఏడుస్తుంది. 


గౌరి: అమ్మా పంచమి నువ్వు పాము అయిపోయినా నా బిడ్డవే అమ్మా.. నిన్ను నేను కాపాడుకుంటాను. నువ్వు నా దగ్గరే ఉండు తల్లి అంటుంది. దీంతో పంచమి నాగకన్యగా ప్రత్యక్షమవుతుంది. గౌరి ఎమోషనల్ అవుతుంది. పాముగా నన్ను పరీక్షించడానికి వచ్చావా తల్లి. నువ్వు ఏ రూపంలో ఉన్నా నా బిడ్డవే తల్లి. నేను ప్రాణంతో ఉన్నంత వరకు నిన్ను నా ప్రాణంగా కాపాడుకుంటాను పంచమి. 
పంచమి: అమ్మా నేను నిన్ను వదిలిపెట్టి వెళ్లను అమ్మ. నాగలోకం వెళ్లను. నీ దగ్గరే ఉంటాను. నాకు నువ్వు అమ్మవి. నాగదేవత వచ్చి అడిగినా నన్ను పంపించకమ్మా.. నన్ను వదిలిపెట్టకు. 
గౌరి: నిన్ను వదిలిపెట్టను తల్లి అని ఏడుస్తూ పంచమిని కౌగిలించుకుంటుంది. ఇక చూస్తే అదంతా గౌరి కల. లేచి ఇదంతా నా భ్రమ అనుకొని.. దేవుడు దగ్గరకు వెళ్లి పంచమి పాములా మారకుండా చేయు అని దండం పెట్టుకుంటుంది. 


ఇక ఉదయం నాగసాధువు దగ్గరకు గౌరి వస్తుంది. నాగ సాధువు ఆమెతో కూతురి కోసం మీరు పడే తపన చూస్తుంటే సాధువు అయిన నాకే మనసు ధ్రవిస్తుంది అంటారు. పవిత్రమైన నాగకన్యతో అమ్మా అని పిలిపించుకుంటున్నావు నీ జన్మ ధన్యమైనట్లే అని నాగసాధువు గౌరితో చెప్తారు. 


గౌరి: స్వామి ఈ విపత్తు నుంచి బయటపడటానికి నా కూతురుకి, అల్లుడికి ఏ చిన్న అవకాశం ఉన్నా చెప్పండి స్వామి. నా అల్లుడిని కాపాడటానికి ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి స్వామి. మీరు ఏదో ఒక మార్గం చెప్తారు అన్న ఆశతో వచ్చాను స్వామి.
నాగసాధువు: ఇష్టరూప జాతి నాగు విషానికి ఈ భూలోకంలో విరుగుడు అనేదే దొరకదు అమ్మా. నాగలోకంలో అయితే నాగ చంద్రకాంత అనే మొక్క నీటి అడుగున పెరుగుతుంది అమ్మా. అదొక్కటే ఇష్టరూప నాగ జాతి విషానికి విరుగుడు. ఆ మొక్క భూలోకంలో దొరకదు. నాగలోకం నుంచి తీసుకురావాలి. మీ అల్లుడిని బతికించుకోవడానికి అదొక్కటే మార్గం తల్లి. వెతికితే ఈ విశ్వంలో దొరకనిదంటూ ఉండదు అమ్మా. 


మరోవైపు మేఘన మోక్ష ఇంట్లో తులసి కోటకు దీపం వెలిగించి పూజ చేస్తుంది. అది చూసిన శబరి ఫిదా అయిపోతుంది. తెగ పొగిడేస్తుంది. ఇక ఇంట్లో పనులు అన్నీ చేసి అందరి దగ్గర మంచి మార్కులు కొట్టేస్తుంది. ఇక ఇంట్లో పనులు అన్నీ దెయ్యాలు చేస్తున్నాయి అని జ్వాల, చిత్రలు చెప్తారు. ఇంట్లో వాళ్లు వారి మాటల్ని కట్టేయడంతో ఫ్రూప్స్‌తో చూపిస్తామని అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక మోక్ష దగ్గరకు పంచమి కాఫీ తీసుకొని వస్తుంది. 


పంచమి: మిమల్ని బతికించుకోవడంలో నా ప్రయత్నలోపం ఉండదు మోక్షాబాబు. నాగ దేవతతో యుద్ధం చేసి అయినా నేను మా నాగమణిని తీసుకొస్తాను. 
మోక్ష: నా మాట విననప్పుడు నేను నీ మాట నమ్మాల్సిన అవసరం లేదు. నీకు ఇచ్చిన గడువు అయిపోయింది. ఇప్పుడు మనం పేరుకే భార్యాభర్తలం ఇక మీద ఏం చేయాలి అన్నది నిర్ణయించుకోవాల్సింది నేను. నా దారికి నువ్వు రానప్పుడు ఇక నేను చేయగలిగేది ఏం లేదు. ఒక్క చావడం తప్ప.
పంచమి: మీరు నన్ను నమ్మడం లేదు అందుకే అలా మాట్లాడుతున్నారు. 
మోక్ష: ఆ మాట నేను అనాలి నువ్వు నా మాట వినకుండా ఎవరో ఫణేంద్ర చెప్పిన మాట వింటున్నావ్. నేను మిమల్ని నమ్మి నీతో కాటేయించుకోవడానికి సిద్ధమే. కానీ తర్వాత మీరు ఆ నాగమణిని తీసుకురాలేకపోతే ఏం చేయగలరు. నన్ను తిరగి బతికించగలరా.. అసలు ఆ నాగమణికి అలాంటి శక్తి ఉందని తెలుసా.. ఎప్పుడైనా ప్రత్యక్షంగా నాగమణిని చూశావా.. ఇవన్నీ గాలిలో దీపం లాంటి మాటలు. నీకు నన్ను బతికించాలి అని ఎంత తాపత్రయం ఉన్నా గాలికి దీపాన్ని ఆరిపోకుండా కాపాడలేవు. నీ ప్రయత్నం కూడా అలాంటిదే. 
పంచమి: నాగమణి గురించి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను.
మోక్ష: సరే అంత నమ్మకం ఉంటే ఆ ఫణేంద్రను ముందే ఆ నాగమణిని తీసుకురమ్మని చెప్పు. అప్పుడు నేను కూడా నమ్ముతాను. 
పంచమి: అలాంటి అవకాశం లేదు మోక్షబాబు. కచ్చితంగా నేను వెళ్లాల్సిందే. నాగలోకం యువరాణిగా నేను మాత్రమే ఆ నాగమణిని తీసుకురాగలను. 
మోక్ష: నాకు అభ్యంతరం లేదు పంచమి ఇప్పుడే నువ్వు నన్ను కాటేసి చంపి వెళ్లిపో. నువ్వు వెళ్లిపోయిన తర్వాత నువ్వు ఆ నాగమణిని తెచ్చినా తేలేకపోయినా నేను చూడగలిగేది ఏం లేదు. నేను నా ప్రాణం కోసం భయపడేవాడినే అయితే నేను ఇప్పుడే చనిపోతాను అని తెలిసి కూడా మనం కలవాలి అని కోరుకోను. ఎలాగో నేను పోయేవాడినే. కనీసం నిన్ను అయినా ఇక్కడ ఉంచాలి అన్న నా తాపత్రయాన్ని నువ్వు అర్థం చేసుకోవడం లేదు. 
పంచమి: నాకు అన్ని విషయాలు క్షుణ్నంగా తెలుసు మోక్షాబాబు. నేను తల్లిని అయితే భూలోకంలో ఉండిపోతాను కానీ. నాగలోకంలోకి కాలు పెట్టలేను. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read : మీ స్కిన్​ టోన్ డార్క్​ అవుతోందా? ఈ ఇంటి చిట్కాలతో టాన్​ రిమూవ్ చేసేయొచ్చు