Salman Khan: తెలుగులో బిగ్ బాస్ సీజన్ 7 పూర్తయ్యింది. అందులో పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. ఇక ఈ రియాలిటీ షో ఫ్యాన్స్ అంతా ప్రస్తుతం హిందీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 17పై దృష్టిపెట్టారు. ఈ షోలో ముందు నుండే కంటెస్టెంట్స్ మధ్య జరిగే గొడవలు, వాగ్వాదాలు ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నాయి. అంతే కాకుండా ఈసారి బిగ్ బాస్‌లోకి కపుల్స్‌ను కూడా కంటెస్టెంట్స్‌గా పంపించడంతో వారి గొడవల వల్ల కూడా చాలా కంటెంట్ వస్తోంది. తాజాగా ఒక కంటెస్టెంట్.. తన పర్సనల్ లైఫ్ గురించి చేసిన వ్యాఖ్యలు మరొక కంటెస్టెంట్‌కు నచ్చక హౌజ్‌లోని ఫ్లవర్ వాజ్‌ను పగలగొట్టాడు.
ఆయేషా, మన్నారా మధ్యలో మునావర్..
బిగ్ బాస్ సీజన్ 17లోకి కంటెస్టెంట్స్‌గా ఎంటర్ అయిన మునావర్ ఫరూఖి, మన్నారా చోప్రా.. మొదట్లో మంచి ఫ్రెండ్స్‌గా ఉండేవారు. ఇప్పుడు బద్ద శత్రువుల్లాగా మారిపోయారు. తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇందులో మన్నారా.. తన తోటి కంటెస్టెంట్ అయిన విక్కీ జైన్‌తో మాట్లాడుతూ.. ‘‘నేను హౌజ్‌లోకి వచ్చినప్పటి మన్నారాలాగా లేను. బికారీ అయిపోయాను’’ అంటూ వ్యాఖ్యలు చేసింది. ఆ సమయంలో అక్కడ విక్కీ జైన్‌తో పాటు ఆయేషా ఖాన్. మునావర్ ఫరూఖి కూడా ఉన్నారు. ‘‘ఇది క్లాస్సీ అనుకుంటున్నావా’’ అని మునావర్.. మన్నారాను అడిగాడు. ‘‘లేదు ఇది చాలా చెత్త విషయం’’ అని మన్నారా నవ్వుతూ సమాధానమిచ్చింది. అప్పటివరకు అంతా బాగానే ఉన్నా.. ఉన్నట్టుండి ఆయేషా ఖాన్‌కు, మన్నారా చోప్రాకు మధ్య గొడవ మొదలయ్యింది.
నేనేం తప్పుగా మాట్లాడలేదు..
ఆయేషా ఖాన్.. ఇతర కంటెస్టెంట్స్ సాయంతో గేమ్ ఆడుతుందని మన్నారా కామెంట్స్ చేసింది. అంటే తను ఇన్‌డైరెక్ట్‌గా మునావర్ సాయంతో ఆయేషా ఆడుతుందని అర్థం వచ్చేలా మాట్లాడింది. అంతే కాకుండా ‘‘వచ్చే ఏడాది ఒక్కదానివే ఆడడానికి రా. నీ బయట ఫ్రెండ్ కూడా వచ్చే ఏడాది వ్యక్తిగతంగానే ఆడడానికి వస్తాడేమో’’ అని ఆయేషా, మునావర్ ఫ్రెండ్‌షిప్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది మన్నారా. ఈ విషయం మునావర్‌కు నచ్చక.. ‘‘ఎవరిని బయట ఫ్రెండ్ అంటున్నావు?’’ అంటూ సీరియస్ అయ్యాడు. అంతే కాకుండా అదే సమయంలో పక్కన ఉన్న ఫ్లవర్ వాజ్‌ను పగలగొట్టాడు. తనను మధ్యలోకి తీసుకురావద్దు అని వార్నింగ్ ఇచ్చాడు. అయినా వినని మన్నారా.. ‘‘నేను కచ్చితంగా మధ్యలోకి తీసుకొస్తాను. నేనేం తప్పుగా మాట్లాడలేదు’’ అని రివర్స్ అయ్యింది.
మునావర్‌ను మందలించిన సల్మాన్..
వీకెండ్ ఎపిసోడ్‌లో మన్నారా, మునావర్‌కు జరిగిన గొడవ గురించి సల్మాన్ ప్రస్తావించాడు. మునావర్ అలా చేయడం కరెక్ట్ కాదని మందలిచాడు. మునావర్ ఎప్పుడూ మన్నారాను ఒంటరిగా గేమ్ ఆడమని విమర్శిస్తుంటాడని, సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదని ఎగతాలి చేస్తుంటాడని గుర్తుచేశాడు సల్మాన్. ఓవైపు మన్నారా, మునావర్ మధ్య వాగ్వాదాలు జరుగుతుండగా.. మరోవైపు నీల్ భట్, ఇషా మాల్వియా మధ్య కూడా మనస్పర్థలు పెరిగిపోతున్నాయి. నీల్ భట్ భార్య ఐశ్వర్య శర్మ ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోవడానికి ఇషా మాల్వియానే కారణమని నీల్ మాత్రమే కాకుండా చాలామంది ఇతర కంటెస్టెంట్స్ కూడా భావిస్తున్నారు. దీంతో హౌజ్‌లో ఇషాపై నెగిటివిటీ పెరిగిపోయింది.
Also Read: ‘సలార్’, ‘డంకీ’ చెత్త సినిమాలు, ప్రేక్షకులను పిచ్చివాళ్లని చేస్తున్నారు - ‘ఊసరవెల్లి’ బ్యూటీ