Salaar Movie: 2023లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముఖ్యంగా డిసెంబర్‌లో విడుదలయిన ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకుల ఆదరణను అందుకున్నాయి. తాజాగా విడుదలయిన ‘సలార్’, ‘డంకీ’ కూడా ఆ లిస్ట్‌లోనే యాడ్ అయ్యాయి. ఒకేరోజు తేడాలో విడుదలయిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్నాయి. కానీ ఒక నటికి మాత్రం ఆ సినిమాలు చాలా చెత్తగా అనిపించాయంటూ ట్విటర్‌లో షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. వీటితో పాటు ఈ ఏడాదిలో విడుదలయిన అన్ని సినిమాలు చెత్త అంటూ కామెంట్ చేసింది. తను మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ, ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’ మూవీ నటి పాయల్ ఘోష్.


ఒక్కటి కూడా బాలేదు..
బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించిన పాయల్ ఘోష్.. తెలుగు తెరపై కూడా అప్పుడప్పుడు మెరిసింది. కానీ తను సినిమాలకంటే ఎక్కువగా కాంట్రవర్సీల వల్లే ఫేమస్ అయ్యింది. స్టార్ హీరోలపై కామెంట్స్ చేయడం, వారి ఫ్యాన్స్‌కు కోపం తెప్పించడం, తిరిగి వాళ్లతో గొడవపడడం.. ఇవన్నీ పాయల్‌కు కామన్. అదే విధంగా తాజాగా ‘సలార్’, ‘డంకీ’ చిత్రాలపై చేసిన కామెంట్స్‌కు ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు షారుఖ్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. ‘2023లో విడుదలయిన సినిమాలన్నీ చెత్తలా ఉన్నాయి. ఒక్కటి కూడా బాలేదు. డంకీ, సలార్ కూడా అస్సలు బాలేవు’ అంటూ తాజాగా ట్విటర్‌లో తన అభిప్రాయాన్ని బయటపెట్టింది పాయల్.


అన్నీ చెత్త సినిమాలే..


‘సలార్’, ‘డంకీ’ అస్సలు బాలేవు అని చెప్పిన పాయల్.. అక్కడితో ఆగకుండా ఇంకా కామెంట్స్ చేస్తూ వెళ్లింది. ‘‘రాజ్‌కుమార్ హిరానీ తన కెరీర్‌లో మొదటిసారి ‘డంకీ’ అనే ఫ్లాప్ సినిమాను తెరకెక్కించాడు. డంకీ, సలార్ రెండూ చెత్త సినిమాలు. కానీ ‘సలార్‌’కు భారీ కలెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ పర్సన్. తనకు దేశవ్యాప్తంగా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది’’ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది పాయల్ ఘోష్. వీటితో మరికొన్ని సినిమాలను కూడా తను విమర్శించింది. ‘‘పఠాన్, జవాన్, యానిమల్.. సినిమాలు కూడా బాలేవు. అన్ని సినిమాలు ప్రేక్షకులను పిచ్చివాళ్లుగా మార్చేస్తున్నాయి’’ అని ట్వీట్ చేసింది.


ప్లేటు ఫిరాయించిన పాయల్


ప్రస్తుతం పాయల్ ఘోష్ చేసిన ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ‘యానిమల్’ సినిమా విడుదలకు ముందు టీజర్, ట్రైలర్లు చూశానని, ఈ సినిమా క్రియేట్ చేసే మ్యాజిక్‌ను థియేటర్లలో చూడడానికి ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేసింది పాయల్. కానీ విడుదలయిన తర్వాత తన మాట మార్చేసింది. ‘సలార్’పై చేసిన కామెంట్స్‌కు ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాను సినిమా బాలేదని అన్నానని, ప్రభాస్ మాత్రం మంచి నటుడు అంటూ ప్లేటు ఫిరాయించింది. తనకు ప్రభాస్ అంటే ఇష్టమని ఫ్యాన్స్‌ను కూల్ చేయబోయింది. అవకాశాలు లేకపోవడంతో కావాలనే కాంట్రవర్సీలు క్రియేట్ చేసి ప్రేక్షకుల అటెన్షన్‌ను తనవైపు తిప్పుకుందామని పాయల్ ఘోష్ ప్రయత్నిస్తోందని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు.






Also Read: ‘యానిమల్’ ఓటీటీ వెర్షన్‌లో అదనంగా ఆ 9 నిమిషాల సీన్స్ - క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా