Priaynka Shiv Wedding Announcement: బిగ్ బాస్ సీజన్ 7(Bigg Boss 7 Telugu)లో ఫైనల్స్ వరకు వెళ్లిన ఒకేఒక్క లేడీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్. బుల్లితెరపై పలు సీరియల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రియాంక.. తన సహ నటుడు శివ్‌తో ప్రేమలో ఉందని అందరికీ తెలిసిన విషయమే. అందుకే ప్రియాంక.. బిగ్ బాస్ హౌజ్‌లో కంటెస్టెంట్‌గా ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీ వీక్‌లో తనను కలవడానికి శివ్ స్వయంగా వచ్చాడు. అదే సమయంలో వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమను చూసి చాలామంది ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నలు మొదలయ్యాయి. తాజాగా ఒక వీడియోలో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేశాడు శివ్. క్లారిటీ ఇచ్చేశాం కాబట్టి ఇక తనను ఏమీ అడగొద్దు అని చెప్పేశాడు.


పెళ్లి ఎప్పుడు..?


ప్రియాంక, శివ్ కలిసి చాలాకాలం క్రితమే ఒక యూట్యూబ్ ఛానెల్‌ను మొదలుపెట్టారు. తాజాగా ఆ ఛానెల్‌లో అప్లోడ్ చేసిన ఒక వీడియోలో వీరిద్దరి పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా ఆ వీడియో మొదలవ్వగానే ప్రియాంకతో డ్యాన్స్ చేసుకుంటున్నట్టుగా ఊహించుకుంటూ.. అదే ఊహల్లో ఉండిపోతాడు శివ్. అప్పుడే ప్రియాంక.. తనను కదిలించి కెమెరా ఉంది అని చెప్పింది. ‘‘కెమెరా ఉంటే ఏంటి కొంచెం చూడనివ్వు నిన్ను’’ అని శివ్ అన్నాడు. శివ్ అన్న మాటలకు తెగ సిగ్గుపడిపోయిన ప్రియాంక ఆగు అంటూ క్యూట్‌గా నవ్వింది. ‘‘నీకు సిగ్గేస్తుందా? బిగ్ బాస్‌లో లక్షల, కోట్లమంది ముందు పెళ్లి ఎప్పుడు అని అడిగేశావు’’ అని గుర్తుచేశాడు శివ్. ‘‘ఏదో ఎమోషనల్‌లో అనేశాను’’ అని క్లారిటీ ఇచ్చింది ప్రియాంక.


ప్రతీ ఇంటర్వ్యూలో అదే ప్రశ్న


‘‘బయట నన్ను ఎంతమంది అడిగారు తెలుసా. అన్ని ఇంటర్వ్యూలలో అదే ప్రశ్న. పెళ్లెప్పుడు సార్ అని’’ అని అన్నాడు శివ్. తన మాటలను వెక్కిరిస్తూ ‘‘చెప్పండి సార్ పెళ్లి ఎప్పుడు’’ అని అడిగింది ప్రియాంక. ‘‘నువ్వు లోపల అడిగావు కాబట్టి నువ్వు చెప్పాలి అది’’ అని రివర్స్ అయ్యాడు శివ్. దానికి సమాధానంగా.. ‘‘మీరందరూ మా పెళ్లిరోజు కోసం ఎదురుచూస్తున్నారు నాకు తెలుసు. అదే మేము బిగ్ బాస్‌లో రివీల్ చేసేశాము’’ అని ప్రేక్షకులకు చెప్తుండగానే.. శివ్ మధ్యలో జోక్యం చేసుకున్నాడు. ‘‘నేను కాదు ప్రియాంక రివీల్ చేసింది’’ అని క్లారిటీగా చెప్పాడు. అవును నేనే అడిగాను అంటూ ప్రియాంక కూడా ఒప్పుకుంది. చూస్తుంటే.. ప్రియాంక పెళ్లి గురించి బిగ్ బాస్‌ హౌస్‌లో ప్రస్తావించడం శివ్‌కు ఇష్టం లేనట్లుగా కనిపించింది.


ప్రతీ ఒక్క ఆడపిల్లకు అది చాలా స్పెషల్


‘‘నేను ముందు నుంచే మీ అందరికీ చెప్తున్నాను. మాకు పెళ్లి ఆలోచన వచ్చిందంటే ముందు మేము మీ ముందుకే వస్తామని. పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన ముందు నుంచి ఉంది. కానీ ఇప్పుడు కచ్చితంగా రాబోయే సంవత్సరం అంటే 2024లో మా పెళ్లి జరగబోతుంది, చేసుకోబోతున్నాం. ప్రియాంక నువ్వేం చెప్పాలనుకుంటున్నావు పెళ్లి గురించి’’ అంటూ తనను అడిగాడు శివ్. ‘‘పెళ్లి గురించి ఏం చెప్పాలి? నాకు చాలా ఎగ్జైటెడ్‌గా ఉంది. పెళ్లి అనేది చాలా పెద్ద విషయం. జీవితంలో ప్రతీ ఒక్క ఆడపిల్లకు అది చాలా స్పెషల్ మూమెంట్. దానికోసం చాలా ప్రిపేర్ కావాలి’’ అని ప్రియాంక తన ఫీలింగ్‌ను చెప్పుకొచ్చింది. దాంతో ‘‘దయజేసి ఇంకెప్పుడు మీ పెళ్లి ఎప్పుడు అని అడగకండి. ఎందుకంటే మేము చెప్పేశాం 2024లో చేసుకోబోతున్నాం. ఎప్పుడు, ఎక్కడ అనేది కూడా త్వరలోనే చెప్తాం. పెళ్లి అనేది చాలా పెద్ద విషయం. దానికి మనం పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయ్యిండాలి’’ అని శివ్ తెలిపాడు.


Also Read: ‘స్పై’ బ్యాచ్‌ను కలిసిన శుభశ్రీ - పల్లవి ప్రశాంత్‌ను చాలా మిస్ అయ్యానంటూ ఎమోషనల్