ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీదే వంటలు అవుతున్నాయి. గ్యాస్ ధర మాత్రం రోజురోజుకీ పెరిగిపోతోంది. అందుకే దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే ఎక్కువ కాలం పాటు గ్యాస్ వచ్చే విధంగా చూసుకోవచ్చు. అంతేకాదు ఎల్పీజీ గ్యాస్‌ను ఎక్కువగా వాడడం వల్ల వాతావరణంలోకి గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతాయి. ఇలా ఎక్కువగా వాడకుండా, తక్కువ సమయంలోనే వంటను పూర్తి చేసుకుంటే ఈ వాయువుల విడుదలను అడ్డుకోవచ్చు. తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.


1. వంట చేసేటప్పుడు రోజులో ఒకేసారి ఎక్కువ మొత్తంలో కూర వండుకోవడం మంచిది. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి ఇలా వండడం వల్ల గ్యాస్ ఎక్కువ మొత్తంలో పోతుంది. అదే మధ్యాహ్న భోజనం చేయడానికి ఒక గంట ముందు వండుకుంటే, అదే కూర మధ్యాహ్నం, రాత్రికి  కూడా వస్తుంది. దీనివల్ల రెండు మూడు సార్లు గ్యాస్‌ను వాడాల్సిన అవసరం రాదు.


2. సాధారణ గిన్నెలో కాకుండా ప్రెషర్ కుక్కర్‌ను ఎక్కువగా వాడండి. ప్రెషర్ కుక్కర్ తక్కువ సమయంలోనే ఆహారాన్ని ఉడికిస్తుంది. ఎందుకంటే ఇది అధిక పీడనం కింద ఆహారాన్ని ఉడికిస్తుంది. కాబట్టి తక్కువ సమయంలో వంట పూర్తవుతుంది. గ్యాస్ కూడా ఆదా అవుతుంది. 


3. చిన్న గిన్నెలో వంటలు చేస్తున్నప్పుడు పెద్ద బర్నర్ పై ఆ గిన్నెను పెట్టవద్దు. దీనివల్ల మంట చాలా మటుకు బయటికి పోతుంది. గ్యాస్ చాలా మటుకు బయటికి పోతుంది.


4. బర్నర్‌ను తరచూ శుభ్రపరుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అది త్వరగా వేడెక్కుతుంది. వేడెక్కి వంట త్వరగా పూర్తయ్యేలా చేస్తుంది. 


5. వంట పూర్తవడానికి ఐదు నిమిషాల ముందే బర్నర్ ఆపి వేయండి.  గిన్నె మీద మూత మాత్రం తీయవద్దు. లోపల ఉన్న వేడి ఆ మిగతా వంటను పూర్తి చేస్తుంది. దీనివల్ల గ్యాస్ ఆదా అవుతుంది.


6. వంట చేస్తున్నప్పుడు ఏ గిన్నెలో వండుతున్నా కూడా మూత పెట్టే ఉంచండి. మూత పెట్టడం వల్ల లోపల ఉన్న వేడి ఆవిరి బయటికి పోదు. ఆ వేడి మీదే లోపల త్వరగా ఉడికేస్తుంది. 


7. పగటిపూట వంట చేస్తున్నప్పుడు సహజ కాంతినే ఉపయోగించుకోండి. వంటగదిలోని లైట్లను ఆన్ చేయవద్దు. దీనివల్ల శక్తి ఆదా అవుతుంది. అలాగే మీకు తెలియకుండానే గ్యాస్ వినియోగం కూడా తగ్గుతుంది.  


ఈ చిట్కాలన్నీ పాటించడం వల్ల గ్యాస్ సిలెండర్ దాదాపు పది రోజులు అదనంగా వస్తుంది.



Also read: మామిడి పండ్లను తినేముందు కాసేపు నీళ్లలో నానబెట్టాలా? అలా చేయడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి?



Also read: మీరు తెలివైన వారైతే 15 సెకండ్లలో ఈ బొమ్మలో ఉన్న గ్రహాంతరవాసిని గుర్తించండి






















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.