రీక్షల టైమ్ లో ఎంత చదివినా ఖచ్చితంగా ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం గుర్తుకురాదు. కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటారు.. వెంటనే చెప్పలేదంటే దాన్ని మర్చిపోతారు. తర్వాత ఎంత గుర్తు చేసుకుందామని అనుకున్నా గుర్తుకు రాదు. ఇలా చాలా మందికి జరుగుతూనే ఉంటుంది. ఇక వయసు మళ్లిన వాళ్ళు అయితే మతిమరుపు వల్ల తీవ్ర ఇబ్బందులు కూడా పడతారు. అప్పుడే తింటారు కానీ వాళ్ళు తిన్న విషయం కూడా గుర్తు ఉండదు. ఇలా జ్ఞాపకశక్తి మందగించడం వల్ల చాలా నష్టపోవాల్సి వస్తుంది. దాన్ని అధిగమించాలంటే తగిన మీ మెమరి పెంచే పోషకాలు ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని ఆయుర్వేదం చెబుతోంది. ఇలా చెయ్యడం వల్ల మీ మెమరి పవర్ చాలా బాగుంటుంది.


శరీరానికి పోషకాహారం అవసరం అయినట్టే మెదడు కూడా సరిగా పని చెయ్యడానికి పోషకాలు అవసరం. అందుకే జ్ఞాపకశక్తిని పెంచే ఈ ఆహారాన్ని మీ డైట్లో చేర్చుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. నెయ్యి, ఆలివ్ నూనె, వాల్‌నట్, నానబెట్టిన బాదం, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు, తాజా పండ్లు మాత్రమే కాదు కాయధాన్యాలు, పప్పు, బీన్స్, పనీర్ కూడా తినాలి. ఆయుర్వేదం ప్రకారం జీలకర్ర మెదడు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. నల్ల మిరియాలు కూడా మెదడుకి మేలు చేస్తాయి.


ఆయుర్వేద మూలికలు


ఆయుర్వేద మూలికలు మెదడులోని ధీ, ధృతి, స్మృతి అనే మూడు అభ్యాసాల సామర్థ్యాలకు మద్దతు ఇచ్చి వాటిని మెరుగుపరుస్తాయి. గోటు కోలా, అశ్వగంధ, బాకోపా వంటి ప్రత్యేకమైన మూలికలలో ఉపయోగించడం వల్ల అద్భుతమైన జ్ఞాపకశక్తి పొందవచ్చు.


యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం


మెదడు బాగా పని చేయాలంటే ఆక్సిజన్ అవసరం. అయితే అధిక ఆక్సిజన్ వినియోగం, లిపిడ్ రిచ కంటెంట్ మెదడు ఆక్సీకరణ ఒత్తిడికి గురి చేస్తాయి. ఇది శరీర కణాలలో ఫ్రీ రాడికల్స్ అధికంగా చేరడానికి దారితీస్తుంది. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించి మానసిక స్థితిని సమతుల్యం చేస్తుంది. పింక్, ఎరుపు రంగు పండ్లు, కూరగాయాలు, పుచ్చకాయ, టమోటాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి బ్రెయిన్ డెవలప్ మెంట్ కి తోడ్పడతాయి.


మెదడుని హైడ్రేట్ చెయ్యడానికి హెర్బల్ టీ


శరీర విధులు సక్రమంగా నిర్వర్తించడానికి తగినంత నీరు అవసరం. లేదంటే బలహీనంగా మారిపోయి శరీరం డీ హైడ్రేట్ కి గురవుతుంది. ప్రత్యేకమైన హెర్బల్ టీ తాగడం వల్ల మెదడు హైడ్రేట్ అవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మానసిక శక్తి, జ్ఞాపకశక్తిని పెంచుతుందని హెర్బల్ టీ సిఫార్సు చేస్తున్నారు. హెర్బల్ టీలో హింగ్, పసుపు, అజ్వైన్, తులసి ఉన్నాయి.


బాగా నిద్రపోవాలి


నిద్రలేమి మెదడు పనితీరుని తీవ్రంగా దెబ్బ తీస్తుంది. ఇది జ్ఞాపకశక్తి, ఆలోచన విధానాన్ని క్షీణించేలా చేస్తుంది. అందుకే ప్రతిరోజు తగినంత నిద్ర ఉండాలని వైద్యులు సూచిస్తారు. ప్రతిరోజు ఒకే సమయంలో పడుకుని ఒకే టైమ్ కి లేవడం అలవాటు చేసుకోవాలి. నిద్రలేమితో ఇబ్బంది పడుతుంటే ఆయుర్వేద మూలిక బకోపా మెదడుని శాంతపరచడానికి ఉపయోగపడుతుంది. నిద్రని ప్రోత్సహించేలా చేస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: నడవలేని స్థితిలో మైక్ టైసన్‌, ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!


Also Read: ‘బ్లాక్ కాఫీ’ ప్రేమలో షారుఖ్, రితేష్‌ - దీని ప్రయోజనాలు తెలిస్తే మీరూ లవ్‌లో పడిపోతారు