Mahammad Siraj Fitness Plan : “Who is the fittest bowler in this era?” అనే ప్రశ్నకు చాలా మంది ఇచ్చే సమాధానం – మహమ్మద్ సిరాజ్. ఇండియా-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ తర్వాత అతని ఫిట్‌నెస్‌ను చాలా మంది ప్రశంసిస్తున్నారు. గాయాలు లేకుండా, ఎప్పుడూ ఫ్రెష్‌గా కనిపిస్తూ, వర్క్‌లోడ్‌ భావించకుండా... consistent‌గా ఇండియాకు ఎప్పుడూ వికెట్లు కావాలన్నా.. నేనున్నాంటూ ముందుకు వచ్చాడు.

ఇండియా ఇంగ్లాండ్ సిరీస్​లో ఇరు జట్లలో.. 5 టెస్టులు ఆడిన ఏకైక పేసర్​గా మహమ్మద్ సిరాజ్ నిలిచాడు. గడిచిన ఐదేళ్లుగా ఎలా గాయాల బారిన పడకుండా.. తన శరీరాన్ని కాపాడుకుంటున్నాడు. ఫిట్​నెస్​కి ప్రాధన్యత ఇస్తూ.. జిమ్​లో కష్టపడే ఈ ఫాస్ట్ బౌలర్ ఎలాంటి డైట్ తీసుకుంటాడో ఎవరికి తెలియదు. కానీ ఇతనికి ఇష్టమైన ఫుడ్ ఏంటి అనేది పలు ఇంటర్వ్యూలలో చాలాసార్లు తెలిపాడు. మరి సిరాజ్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? డైట్ ఏ విధంగా ఫాలో అవుతారు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

పక్కా హైదరాబాదీ

సాధారణంగా క్రికెటర్లకు ఫిట్‌నెస్ మైండ్‌సెట్ వుంటుంది. కానీ చీట్ డేస్​లో మాత్రం వాటిని పక్కన పెడతానని సిరాజ్ తెలిపాడు. ఆ సమయంలో ఎక్కువగా హైదరాబాద్ బిర్యానీ, హలీమ్, కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ తీసుకుంటానని.. ముఖ్యంగా కస్టర్ ఫ్రూట్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. ఇరానీ ఛాయ్ కూడా సిరాజ్ ఎక్కువగా ఇష్టపడతారు. "బిర్యానీ అంటే చాలా ఇష్టం. Hyderabad food మిస్ అవ్వను"  చాలా ఇంటర్వ్యూల్లో తెలిపాడు.

రెస్టారెంట్ ఓనర్ కూడా

సిరాజ్‌కు ఫుడ్ అంటే ఇష్టం. అందుకే హైదరాబాద్‌లో ఓ రెస్టారెంట్ కూడా ప్రారంభించాడు. అయితే అతను ఎప్పుడు రెస్టారెంట్​కి వెళ్లినా ఓ ఫేవరెట్ ఆర్డర్ ఉంటుందట. అదే జీరా రైస్, బటర్ చికెన్, పుచ్చకాయ జ్యూస్. వీటిని ఎప్పుడూ రెస్టారెంట్​కి వెళ్లినా తీసుకుంటానని చెప్పాడు. "Simple and satisfying food ఉంటే చాలు" అని రెస్టారెంట్​కి వెళ్లినప్పుడు అతిగా ఆలోచించకుండా.. క్లారిటీతో నచ్చిన ఫుడ్​ని కడుపు నిండా చాలని చెప్పాడు. 

ఫిట్​నెస్ రొటీన్

 

ఫిట్​గా ఉండేందుకు వెయిట్ ట్రైనింగ్ చేస్తాడు సిరాజ్. కార్డియో రెగ్యులర్​గా చేస్తాడు. దీనివల్ల మొబిలిటీ, ఫ్లెక్సీబులిటీ పెరుగుతుంది. బరువులు కూడా ఎత్తుతాడు. రన్నింగ్ చేయడం, ఎరోబిక్స్ చేయడం అతని ఫిట్​నెస్​లో భాగమే. సమతుల్యమైన క్లీన్ డైట్ తీసుకుంటాడు సిరాజ్. ఎనర్జీని పెంచుకునేందుకు నట్స్, సీడ్స్ డైట్​లో తీసుకుంటారు. ఫిట్​నెస్​లో భాగంగా స్విమ్మింగ్​ కూడా ఎక్కువగానే చేస్తాడు ఈ ఫాస్ట్ బౌలర్. 

మీరు కూడా సిరాజ్​లాగా ఫిట్​గా ఉండాలంటే.. క్లీన్​ డైట్​ తప్పనిసరి అని తెలుసుకోవాలి. చీట్​ డేలో మీకు నచ్చిన ఫుడ్ తీసుకోవాలి. కానీ మితంగా తింటే మంచిది. రెగ్యులర్​గా వ్యాయామం చేస్తూ.. బ్యాలెన్స్​గా, డిస్​ప్లేన్​గా ఉంటే.. మీరు కూడా ఆ తరహా ఫిట్​నెస్ లెవెల్స్​ని అందుకోగలుగుతారు.