First Night Effect Explained : ఫస్ట్ నైట్ ఎఫెక్ట్.. కొత్త ప్రదేశంలో మొదటి రాత్రి నిద్రపోయినప్పుడు నిద్ర నాణ్యత తగ్గడాన్ని సూచిస్తుంది. స్లీప్ ల్యాబొరేటరీ, హోటల్ లేదా ఇతర కొత్త ప్రదేశాల్లో నిద్రపోయినప్పుడు ఇది కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. లేదా కొత్త ప్రదేశంలో నిద్రపోయిన తర్వాత తరచుగా మేల్కొనడం, నిద్ర సామర్థ్యం తగ్గడం, గాఢ నిద్ర తగ్గడం, మెదడు విధుల్లో మార్పులు కనిపించడం వంటివి దీని లక్షణాలుగా చెప్తారు.

Continues below advertisement

ఏదైనా కొత్త ప్రదేశంలో వాతావరణానికి ప్రతిస్పందనగా కేంద్ర నాడీ వ్యవస్థ, స్వయంప్రతిపత్తి నాడీ వ్యవస్థ అతి జాగ్రత్తకు లోనైనప్పుడు FNE సంభవిస్తుంది. దీని ప్రభావాలు రాత్రి తరువాత తగ్గినప్పటికీ.. దాని తీవ్రత వ్యక్తి స్వభావం, వయస్సు, ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. 

పరిశోధనలో ఏమి తేలిందంటే..

కొత్త ప్రదేశానికి వెళ్ళిన మొదటి రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోవడాన్ని శాస్త్రవేత్తలు "ఫస్ట్-నైట్ ఎఫెక్ట్ " అని పిలుస్తారు. ఈ విషయంపై దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి, కానీ 2016 లో అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇది ఎందుకు జరుగుతుందో మొదటిసారిగా వివరంగా వివరించారు.

Continues below advertisement

Also Read : మంచి నిద్రతో పాటు మానసిక ఆరోగ్యం కూడా కావాలా? అయితే రాత్రుళ్లు చేయాల్సిన పనులు ఇవే

స్లీప్ ల్యాబ్లో అధ్యయనం..

పరిశోధకులు 35 మంది ఆరోగ్యవంతులపై ఈ అధ్యయనం చేశారు. దీనిలో పాల్గొన్నవారు రెండు వేర్వేరు రాత్రులు స్లీప్ ల్యాబ్‌లో నిద్రపోయారు. వారు నిద్రపోతున్నప్పుడు EEG (ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ), MRI, ఇతర బ్రెయిన్ ఇమేజింగ్ పద్ధతులను ఉపయోగించి మెదడు కార్యకలాపాలను నమోదు చేశారు.

పడుకున్నా అలెర్ట్​గా ఉన్న బ్రెయిన్

కొత్త ప్రదేశంలో మొదటి రాత్రి నిద్రలో, మెదడులోని ఎడమ అర్ధగోళం పూర్తిగా విశ్రాంతి తీసుకోకుండా.. మరింత చురుకుగా ఉంటుందని తేల్చారు. పరిసరాల్లోని శబ్దాలకు, కదలికలకు వేగంగా స్పందించేది ఈ ప్రాంతమే. అధ్యయనం సమయంలో శాస్త్రవేత్తలు మెల్లని బీప్ శబ్దాలను కూడా వినిపించారట. మొదటి రాత్రి పాల్గొన్నవారి మెదళ్లు ఈ శబ్దాలకు మరింత త్వరగా స్పందించి.. సులభంగా మేల్కొన్నారని కనుగొన్నారు. రెండవ రాత్రి అదే ప్రదేశంలో నిద్రపోయినప్పుడు.. ఈ వ్యత్యాసం దాదాపుగా తొలగిపోయి.. మెదడులోని రెండు భాగాల కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చినట్లు గుర్తించారు. 

Also Read : శరీరం అలసిపోయినా నిద్ర రాకపోవడానికి కారణాలు ఇవే.. ఈ టిప్స్​తో బాడీకి రెస్ట్ ఇచ్చేయండి

ఫస్ట్ నైట్ ఎఫెక్ట్​కు కారణాలు ఇవే..

కొత్త ప్రదేశంలో మొదటిసారి నిద్రపోయినప్పుడు.. మెదడు పూర్తిగా విశ్రాంతి తీసుకోదు. ముఖ్యంగా మెదడులోని ఒక భాగం మరింత చురుకుగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల ఆ వ్యక్తి చుట్టుపక్కల శబ్దాలు లేదా కదలికల పట్ల మరింత అలెర్ట్​గా ఉంటారు. దీనివల్ల రాత్రిపూట తరచుగా మేల్కొనే అవకాశం ఉంది.

ఆదిమానవుల నుంచే..

కొత్త ప్రదేశాలలో ఆదిమానవులను సురక్షితంగా ఉంచడానికే ఈ ప్రతిస్పందన.. పరిణామం చెందిందని పరిశోధకులు భావిస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండటం వల్ల అడవి జంతువుల నుంచి ఆకస్మిక దాడులు లేదా ఇతర ప్రమాదాల ముప్పు తగ్గినట్లు చెప్పారు. అందుకే ఇప్పుడు హోటళ్లు, ఇళ్లు సురక్షితంగా ఉన్నప్పటికీ.. మన మెదళ్లు ఇప్పటికీ అదే విధంగా స్పందిస్తాయి.

గాఢ నిద్ర ఉండదు..

కొత్త ప్రదేశంలో మొదటి రాత్రి గాఢ ​​నిద్ర తక్కువగా ఉంటుందట. దీని ఫలితంగా నిద్ర చాలా తేలికగా ఉంటుంది. అందుకే ఎక్కువసార్లు మేల్కొంటారని పరిశోధనలు చెప్తున్నాయి. తగినంత సమయం నిద్రపోయిన తర్వాత కూడా అలసటగా అనిపించడానికి ఇదే కారణం అంటున్నారు. 

Also Read : పిల్లల్లో పెరుగుతోన్న గుండె సమస్యలు.. స్క్రీన్ సమయమే కారణం అంటోన్న తాజా అధ్యయనం

పైగా వేరే పరుపు, దిండు, గది ఉష్ణోగ్రత, లైటింగ్, వాసనలు లేదా పరిసరాల శబ్దం వంటివి కూడా నిద్రను ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా పండుగల ఉత్సాహం లేదా ఏదైనా మీటింగ్​కు ముందు ఆందోళన వంటి మానసిక కారకాలు కూడా చురుకుదనాన్ని పెంచి.. నిద్ర పట్టడాన్ని ఆలస్యం చేస్తాయట. 

టెంపరరీ మాత్రమే..

ఈ ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ అనేది శాశ్వతం కాదని.. మెదడు కొత్త వాతావరణాన్ని సురక్షితమైనదిగా అంగీకరించిన తర్వాత.. రెండవ లేదా మూడవ రాత్రి నాటికి నిద్ర తిరిగి సాధారణ స్థితికి వస్తుందని తెలిపారు. 

కొత్త ప్రదేశంలో మంచి నిద్ర కోసం..

మీరు కొత్త ప్రదేశానికి వెళ్లినా మీరు మంచిగా నిద్రపోవాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. మీ నిద్ర సమయాన్ని మార్చుకోకూడదు. వీలైతే మీ సొంత దిండు లేదా దుప్పటిని మీతో తీసుకెళ్లండి. నిద్రపోయే ముందు కెఫీన్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండండి. స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోవాలి. స్లీప్ మాస్క్‌ తీసుకెళ్లడం మంచిది. గదిని చల్లగా, నిశ్శబ్దంగా, చీకటిగా ఉంచుకోవడం మంచిది. 

Also Read : పిల్లల్లో బరువు పెరుగుదలకు(Obesity) నిద్రలేమి కూడా కారణమేనా? వైద్యుల హెచ్చరికలు ఇవే