Sundar Pichai 3 Golden Rules for Staying Calm : ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలలో ఒకటైన గూగుల్‌కు నాయకత్వం వహిస్తున్న సుందర్ పిచాయ్.. తన ప్రశాంతమైన ప్రవర్తనతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ప్రభుత్వ కమిటీల ముందు కఠినమైన ప్రశ్నలకు సమాధానమివ్వడానికైనా.. కంపెనీకి సంబంధించిన వివాదాలను ఎదుర్కోవడానికైనా.. లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వేగవంతమైన పోటీలో గూగుల్‌ను ముందుంచడానికైనా.. సుందర్ పిచాయ్ ఎప్పుడూ ముందుంటారు. 

Continues below advertisement

సుందర్ పిచాయ్ కంగారుపడటం లేదా భావోద్వేగంతో స్పందించడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాము. కానీ కొందరు చిన్న విషయాలకే కంగారు పడిపోతారు. కోపంతో తప్పు నిర్ణయాలు తీసుకుని అవకాశాలు దూరం చేసుకుంటారు. మీరు కూడా అలాంటివారిలో ఒకరు అయితే.. సుందర్ పిచాయ్​ని ఫాలో అయిపోండి. ఒత్తిడి ఎక్కువ ఉన్న సమయంలో ఆయన ఫాలో అయ్యే గోల్డెన్ రూల్స్ ఏంటో చూసేద్దాం.

వెంటనే స్పందించవద్దు..

సుందర్ పిచాయ్ పనితీరు నుంచి మనం నేర్చుకోగల మొదటి రూల్ ఏమిటంటే.. ఎలాంటి పరిస్థితిలోనైనా తక్షణమే స్పందించకుండా ఉండటం. ఆయనతో కలిసి పనిచేసే చాలామంది ఈ విషయాన్ని చెప్తారు. సుందర్ పిచాయ్ మంచి శ్రోత అని. ఒత్తిడికి గురైనప్పుడు.. చాలామంది ఎదుటి వ్యక్తి చెప్పేది పూర్తిగా వినకుండానే స్పందిస్తారు. కానీ పిచాయ్ అలా కాదు.. ముందు మొత్తం పరిస్థితిని అర్థం చేసుకుని.. ఆ తర్వాతే స్పందిస్తారు. అందుకే ఆయన నిర్ణయాలు మరింత బ్యాలెన్స్డ్​గా కనిపిస్తాయి. కొన్నిసార్లు కొన్ని నిమిషాలు ఆలోచించడం వల్ల గొడవలు లేదా వాదనలు కంట్రోల అవుతాయి. 

Continues below advertisement

సమస్యకు పరిష్కారం తెలుసుకోండి..

ఎలాంటి పరిస్థితుల్లో అయినా మన ఆలోచన సొల్యూషన్​పై ఉండాలి కానీ.. అహాన్ని కాపాడుకోవడంపై ఉండకూడదని చెప్తారు సుందర్ పిచాయ్. పెద్ద సంస్థలలో అభిప్రాయ భేదాలు సర్వసాధారణం. అయితే ఆ సమయంలో పరిష్కారాలను కనుగొనడానికి బదులుగా.. తాము చెప్పిందే సరైనదని నిరూపించుకోవడంలో చాలామంది నిమగ్నమైపోతారు. కానీ సుందర్ పిచాయ్ తన సహకార నాయకత్వ శైలితో వాదనలు గెలవడం కంటే మెరుగైన ఫలితాలను సాధించడానికే ప్రాధాన్యత ఇస్తారు.

ఇదే తత్వం వ్యక్తిగత జీవితంలో కూడా హెల్ప్ చేస్తుంది. సమస్యను పరిష్కరించాల్సిన సమయంలో.. దానిని రెట్టింపు చేసే అహాన్ని తీసుకురాకూదని ఆయన నుంచి నేర్చుకోవచ్చు. ఎప్పుడూ మన వాదననే నెగ్గాలి అంటే.. కొన్ని రిలేషన్స్ దెబ్బతింటాయని గుర్తించుకోవాలి.

ముందుచూపు ఉండాలి..

ముందుచూపు అనేది అన్నింటికన్నా ముఖ్యమైనది. మన ఆలోచన ఎప్పుడూ లాంగ్​టర్మ్​రిజల్ట్స్​పై ఉండాలి. గూగుల్ నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నప్పటికీ.. సుందర్ పిచాయ్ దాని గురించి.. చాలా తక్కువగా ఆందోళన చెందుతారు. ఎందుకంటే ఆయన ప్రతి సవాలును దీర్ఘకాలిక దృక్పథంతో చూస్తారు.

ఏదో ఒక బ్యాడ్ డే, సక్సెస్ కానీ ఓ మీటింగ్ లేదా ఏదైనా ఓ పొరపాటు మొత్తం ప్రయాణాన్ని నిర్దేశించవని ఆయన నమ్ముతారు. అందుకే ఇప్పుడు ఏదైనా జరిగిన తప్పుకి భయపడి జర్నీని ఆపడం లేదా ఆపేద్దామనుకునే ధోరణి కరెక్ట్ కాదు. జరిగిందేదో జరిగింది దీనిని ముందుకు ఎలా తీసుకెళ్లాలి అనే ధోరణి చాలా ఇంపార్టెంట్. 

ఈ మూడు రూల్స్ ఆఫీస్​ లైఫ్​కే కాదు.. మీ పర్సనల్​ లైఫ్​లో కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. కాబట్టి ఒత్తిడి ఎక్కువగా అనిపించినప్పుడు వీటిని రియల్​ లైఫ్​లో కూడా అప్లై చేసేయండి. కచ్చితంగా సానుకూల ఫలితాలు చూడగలుగుతారు.