Maruti Suzuki Announces Attractive Discounts Across Several Car Models: ఈ జూన్ నెలలో కొత్త కార్ కొనాలని ప్లాన్ చేసే మారుతి సుజుకి లవర్స్ కు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. మారుతి సుజుకి అరేనా డీలర్‌షిప్స్ తమ మోస్ట్ పాపులర్ కార్లపై భారీ డిస్కౌంట్లు, అట్రాక్టివ్ బెనిఫిట్స్ ఆఫర్ చేస్తున్నాయి. విక్టోరిస్, స్విఫ్ట్, బ్రెజ్జా వంటి టాప్ సెల్లింగ్ మోడల్స్ పై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ డిస్కౌంట్లు అనేవి సిటీ, డీలర్‌షిప్, స్టాక్ అవైలబిలిటీ, కార్ వేరియంట్ బట్టి మారుతుంటాయి.
మారుతి సుజుకి విక్టోరిస్ పై హయ్యెస్ట్ డిస్కౌంట్..
ఈ నెలలో అన్నింటికంటే బిగ్గెస్ట్ డిస్కౌంట్ మారుతి సుజుకి విక్టోరిస్ మోడల్ పై లభిస్తోంది. దీని స్ట్రాంగ్-హైబ్రిడ్ వేరియంట్లపై కస్టమర్లు ఏకంగా రూ. 90,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ రివార్డ్స్, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ కార్ సీఎన్‌జీ వేరియంట్లపై రూ. 80,000 వరకు, పెట్రోల్ వేరియంట్లపై రూ. 60,000 వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. విక్టోరిస్ కరెంట్ ప్రైస్ రూ. 10.50 లక్షల నుంచి రూ. 19.99 లక్షల వరకు ఉంది. అలాగే పాపులర్ హ్యాచ్ బ్యాక్ మారుతి స్విఫ్ట్ ఏఎంటీ మోడల్ పై రూ. 45,000 వరకు, మాన్యువల్, సీఎన్‌జీ వేరియంట్లపై రూ. 40,000 వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. స్విఫ్ట్ ధర రూ. 5.79 లక్షల నుంచి రూ. 8.65 లక్షల వరకు అందుబాటులో ఉంది.
Read Also: వర్షాకాలంలో జర్నీ చేయడానికి 5 Best SUVలు ఇవే.. మీరూ ట్రై చేయండి
బ్రెజ్జా, వ్యాగన్ ఆర్ కార్లపై తగ్గింపు..
మారుతి సుజుకి బ్రెజ్జా ఎస్‌యూవీని సెలెక్ట్ చేసుకునే బయ్యర్స్ పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లపై రూ. 55,000 వరకు బెనిఫిట్స్ అందుకోవచ్చు. ఫ్యామిలీ కార్ వ్యాగన్ ఆర్ పై రూ. 52,500 వరకు డిస్కౌంట్ ఆఫర్ నడుస్తోంది. తక్కువ బడ్జెట్ లో వచ్చే ఆల్టో కే10 పై రూ. 52,500 వరకు ఆఫర్స్ ఉండగా, సెలెరియో, ఎస్-ప్రెస్సో, ఈకో మోడల్స్ పై రూ. 37,500 వరకు డిస్కౌంట్లు ఇస్తున్నారు. మిడిల్ క్లాస్ బయ్యర్స్ కు ఈ ఎంట్రీ లెవెల్ కార్ల ఆఫర్లు బెస్ట్ ఛాయిస్ అని చెప్పాలి.
డిజైర్, ఎర్టిగా కార్లపై నో ఆఫర్స్..
కస్టమర్లు ఎంతో ఇష్టపడే మోస్ట్ పాపులర్ మోడల్స్ మారుతి సుజుకి డిజైర్, మారుతి సుజుకి ఎర్టిగా కార్లపై ఈ నెల ఎలాంటి అఫీషియల్ డిస్కౌంట్లు ప్రకటించలేదు. మార్కెట్ లో ఈ రెండు కార్లకు విపరీతమైన డిమాండ్, భారీ వెయిటింగ్ పీరియడ్ ఉండటమే ఆఫర్లు ఇవ్వకపోవడానికి మెయిన్ రీజన్ అని డీలర్ వర్గాలు చెబుతున్నాయి. లేటెస్ట్ ఆఫర్స్ కంప్లీట్ డీటెయిల్స్ కోసం దగ్గరలోని మారుతి షోరూమ్ ను విజిట్ చేయాలని ప్రతినిధులు సూచించారు.
