మధ్యాహ్నాం తిన్న తర్వాత ఆఫీస్​లో ఉన్నా.. కాలేజీలో ఉన్నా.. ఇంట్లో ఉన్నా.. కాస్త మగతగా అనిపిస్తుంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో ఈ ఫీల్ ఉంటుంది. నిద్ర రాకపోయినా కాస్త లేజీగా అనిపిస్తుంది. భోజనం చేస్తే శక్తి వస్తుంది అంటారు కానీ.. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అకస్మాత్తుగా శక్తి తగ్గుతుంది. ఇది చాలా మందికి ఎదురయ్యే అనుభవమే. 


మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత భారంగా ఉండి.. కనురెప్పలు బరువెక్కుతాయి. పనిచేయడం కష్టమవుతుంది. ఆ సమయంలో కొందరు పడుకుంటారు. మరికొందరు నిద్రపోలేని పరిస్థితుల్లో కాస్త పని నుంచి విరామం తీసుకుంటారు. లేదంటే నిద్రను పోగొట్టుకునేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తారు. మీరు కూడా ఈ మధ్యాహ్న నిద్రతో ఇబ్బంది పడుతుంటే.. దానిని అధిగమించడానికి ఇక్కడ కొన్ని చిట్కాలున్నాయి. 


లంచ్ తర్వాత మీకు నిద్ర ఎందుకు వస్తుందో తెలుసా?


మధ్యాహ్నం నిద్రరావడానికి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా కారణం అవుతాయి. థైరాయిడ్, స్లీప్ ఆప్నియా, రక్తహీనత, శారీరక, మానసిక ఒత్తిడి, మధుమేహం వంటి మొదలైన సమస్యల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. బ్లడ్​ షుగర్ స్పైక్​లు, తగినంత నిద్ర లేకపోవడం కూడా ఓ కారణమవుతుంది. మీ నిద్ర చక్రంలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల కూడా మీకు నిద్ర వస్తుంది. ఇది మీ పగటి పూట నిద్రను బాగా ప్రభావితమవుతుంది. 


అలసట ఎందుకు వస్తుందంటే..


తిన్నా తర్వాత కాస్త అలసటగా, బద్ధకంగా ఉంటుంది. ఇది మీరు తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు మిమ్మల్ని అలసిపోయేలా చేస్తాయి. అధిక కార్బ్, అధిక కొవ్వు కలిగిన ఫుడ్స్ బద్ధకాన్ని ఇస్తాయి. మీరు భోజనం చేసే సమయం కూడా మీ శక్తి స్థాయిలను ప్రభావితం చేస్తుంది. 


మీరు ఎంత తింటున్నారు అనేది కూడా నిద్రపై ప్రభావం చూపిస్తుంది. మీరు ఎక్కువగా తింటే.. మీరు కచ్చితంగా బద్ధకంగా ఉంటారు. మాంసాహారం ఎక్కువగా తీసుకున్నా సరే నిద్ర ఎక్కువగా వస్తుంది. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు మీ రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులకు కారణమవుతాయి. కాబట్టి అన్ని ముఖ్యమైన పోషకాలు కలిగిన సమతుల్యమైన భోజనాన్ని మీరు తీసుకోవచ్చు. ఇది అడెనోసిన్ స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. తద్వారా మీకు పగటి నిద్ర తగ్గుతుంది. 


నిద్రను తగ్గించుకోవడానికి నిద్రపోండి..


నిజమే భోజనం తర్వాత నిద్రను తగ్గించుకోవాలంటే నిద్రపోండి. కొంత సేపు నిద్రపోవడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెప్తున్నారు. అందుకే మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రలేమిని వదిలించుకోవడానికి మీరు నిద్రపోవడమే అత్యుత్తమైన పని. 
కాబట్టి.. వీలైతే మీరు భోజనం చేసిన తర్వాత 15 నుంచి 20 నిమిషాల వరకు నిద్రపోండి. ఇది మీ శరీరాన్ని విశ్రాంతి మోడ్​లోకి తీసుకెళ్తుంది. తద్వారా మీ నిద్ర అనంతరం మీరు చాలా యాక్టివ్​గా ఉంటారు. మునుపటి కంటే వేగంగా పని చేస్తారు. 


రాత్రి నిద్ర ముఖ్యం..


పగటిపూట అలసటకు అత్యంత సాధారణ కారణాలలో ఒకటి రాత్రి సరిగ్గా నిద్రలేకపోవడమే. కాబట్టి రోజుకి ఆరు నుంచి ఎనిమిది గంటలు కచ్చితంగా నిద్రపోండి. ఇది మీకు మధ్యాహ్నం నిద్రను చాలా వరకు తగ్గిస్తుంది. నిద్రలేమి, స్లీప్ ఆప్నియా వంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి. ఇప్పుడు ఎలా ఉన్నా అవి ఫ్యూచర్​లో మరిన్ని ఆరోగ్య సమస్యలు తీసుకువస్తాయి.


ఎండలో తిరగండి..


మీ సిర్కాడియన్ రిథమ్ సూర్యకాంతి ద్వారా ఎక్కువగా ప్రభావితమవుతుంది. కాబట్టి తిన్న తర్వాత కాస్త ఎండలో తిరిగి రండి. ఇది మీకు నిద్రను దూరం చేస్తుంది. ఇలా బయటకు వెళ్లడం వల్ల మీ ఇంద్రియాలు యాక్టివ్ అవుతాయి. తద్వార నిద్ర దూరం అవుతుంది. 
ఇలా చేయడం వల్ల అంతర్గత గడియారాన్ని క్రమక్రమంగా స్లీప్ మోడలోకి తీసుకుంటే మేల్కొంటుంది. అంతేకాకుండా నిద్రభారం ఈ ఎక్స్​పోజర్​ వల్ల వదిలేస్తుంది. 


తేలికపాటి వ్యాయామాలు..


మిమ్మల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడానికి తేలికపాటి వ్యాయామం చేయండి. మధ్యాహ్న భోజనం పూర్తి చేసిన తర్వాత కొంత సమయం తీసుకుని వాకింగ్ లేదా బేసిక్ స్ట్రెచింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు చేయండి. ఇది మిమ్మల్ని చురుకుగా ఉండేలా చేస్తుంది. భోజనం తిన్న తర్వాత కొన్ని యోగాసనాలు కూడా చేయవచ్చు. వ్యాయామం వల్ల నిద్ర పోతుంది. అందుకే రాత్రి నిద్రకు ముందు వ్యాయామం చేయకూడదని చెప్తారు. 


Also Read : పండుగ వేళ అన్ని తినేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.