పండుగ సీజన్​లో కుటుంబం, స్నేహితులతో కలిసి ఆనందగా వేడుకలు చేసుకుంటాం. అందరూ కలిసి రుచికరమైన విందులు చేస్తాం. ఈ సమయంలో డైట్​లకు బ్రేక్​ ఇచ్చి మరీ అన్ని లాగించేస్తాం. అయితే స్ట్రిక్ట్ డైట్స్ పాటించి.. ఒకేసారి రుచికరమైన ఫుడ్ తినడం వల్లనో.. లేక అతిగా తినడం వల్లనో, స్వీట్స్ ఎక్కువగా తినడం వల్లనో జీర్ణవ్యవస్థ కాస్త అసౌకర్యానికి గురి అవుతుంది. ఈ సమయంలో అన్నీ తిన్నా మీ గట్​ని హెల్తీగా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. 


ఫెస్టివల్ సమయంలో మనం సరైన సమయానికి భోజనం చేయము. పూజల వల్లనో.. లేక ఫ్రెండ్స్, ఫ్యామిలీ వస్తే కలిపి తిందామనో.. అనుకున్న సమయానికన్నా లేట్​గా భోజనం చేస్తారు. ఇది మన జీర్ణవ్యవస్థను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి సమయానికి కాస్త ఏదైనా తినండి. లేదా టైమ్​కి అందరూ భోజనం చేసేలా ప్లాన్ చేసుకోండి. 


కంట్రోల్​లో ఉండండి..


అన్ని రుచికరమైన ఆహారాలు కళ్ల ముందు కనిపిస్తే తినకుండా ఉండడం కాస్త కష్టమే. కానీ ఈ సమయంలో అన్నీ ట్రై చేసినా.. వాటికి కాస్త లిమిట్స్ పెట్టుకోండి. దీనివల్ల మీకు, మీ హెల్త్​కి మంచిది. మీ కడుపు నిండిపోయిందని అనిపిస్తే.. అక్కడితో ఆపేయండి. ఇది మీ జీర్ణవ్యవస్థపై భారాన్ని తగ్గిస్తుంది. అన్ని తినేయాలని ఎక్కువగా తినేస్తే జీర్ణవ్యవస్థ ఎక్కువ ప్రెజర్ పడుతుంది. పైగా ఈ సమయంలో పోషకమైన ఆహారం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆచితూచి ఆహారాన్ని తీసుకోవాలి. 


హైడ్రేటెడ్​గా ఉండండి..


మీ గట్​ ఆరోగ్యంగా ఉండేందుకు మీరు హైడ్రేటెడ్​గా ఉండడం చాలా అవసరం. పుష్కలంగా నీరు, హెర్బల్​ టీలు, పండ్ల రసాలు తీసుకోవచ్చు. ఇది మీ పేగు ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతుంది. ఈ సమయంలో మీరు డీహైడ్రేషన్​కు గురైతే.. పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది. మీరు హైడ్రేట్​గా ఉంటే మీ శరీరంలో టాక్సిన్స్ ఈజీగా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి.


ఫైబర్ ఉండేలా చేసుకోండి..


కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ వంటి అధిక-ఫైబర్ కలిగిన ఆహారాలు తీసుకుంటే మీ గట్​ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మీ జీర్ణవ్యవస్థలో బ్యాక్టీరియా పెరగకుండా చేస్తుంది. కాబట్టి మీరు తీసుకునే పిండివంటలతో పాటు.. వీటిని కూడా మీ ఆహారంలో చేర్చుకోండి. పెరుగు వంటి ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు కూడా మీ జీర్ణక్రియకు మంచివి. కాబట్టి వీటిని కూడా మీరు తినే ఆహారంలో చేర్చుకోవచ్చు. గ్రీన్ టీ, సలాడ్​లు, పండ్లు తీసుకోవచ్చు. 


వాటికి దూరంగా ఉండండి..


పండుగ సమయంలో ధూమ్ ధామ్ చేస్తూ చాలామంది ఆల్కహాల్​ తీసుకుంటారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి మద్యం, సిగరెట్స్ తీసుకుంటారు. ఇవి జీర్ణసమస్యలు కలిగిస్తాయి. కాబట్టి పూర్తిగా విస్మరించలేని సమయంలో వాటిని మితంగా తీసుకోండి. పూర్తిగా మానేస్తే ఇంకా మంచిది. కేవలం జీర్ణవ్యవస్థకే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.


ఒత్తిడిని తగ్గించుకోండి..


పండుగ సమయంలో వివిధ కారణాల వల్ల ఒత్తిడి పెంచుకుంటూ ఉంటారు కొందరు. ఒత్తిడి కూడా గట్​ హెల్త్​పై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మీరు కాసేపు బ్రీత్ ఎక్సర్​సైజ్​లు చేయండి. లేదంటే యోగా చేయండి. నచ్చినవారితో కూర్చొని మాట్లాడండి. దీనివల్ల మీకు స్ట్రెస్ తగ్గుతుంది. 


ఇవేకాకుండా భోజనం చేసిన తర్వాత కాస్త నడవండి. సరైన నిద్రకూడా చాలా అవసరం. ఫ్యామిలీతో గడుపుతూ చాలామంది తక్కువ సమయం నిద్రపోతారు. ఇది గట్ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో మంచిగా నిద్రపోండి. ఒక పూట ఎక్కువగా తింటే.. మరో పూట ఫుడ్ కంట్రోల్ చేయండి. ఇది మీ గట్ ఆరోగ్యానికి మంచిది. 


Also Read : జిడ్డు చర్మాన్ని దూరం చేసి, మొటిమలకు బాయ్ చెప్పే బెస్ట్ ప్రొడెక్ట్స్ ఇవే