Israel Palestine Attack:
వెస్ట్‌బ్యాంక్‌లో దాడులు..
హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయేల్ దాడులు కొనసాగిస్తోంది. టెర్రరిస్ట్‌లు ఎక్కడ నక్కి ఉన్నా బాంబుల వర్షం కురిపిస్తోంది. గాజాపై పట్టు సాధిస్తున్న ఇజ్రాయేల్ సైన్యం క్రమంగా వెస్ట్‌బ్యాంక్‌పైనా (West Bank Attacks) ఫోకస్ పెట్టింది. వెస్ట్‌బ్యాంక్‌లోని ఓ మసీదుపై దాడి చేసినట్టు వెల్లడించింది. ఆ మసీదునే హమాస్ ఉగ్రవాదులతో పాటు జిహాదీ టెర్రరిస్ట్‌లు కమాండ్ సెంటర్‌గా మార్చుకున్నారు. అక్కడి నుంచి దాడులకు ప్లాన్ చేస్తున్నారు. ఇది పసిగట్టిన Israel Defence Forces (IDF) వెంటనే ఆ మసీదుని నేలమట్టం చేసింది. Israeli Security Agency (ISA)తో కలిసి దాడులు చేసింది. దీంతో పాటు గాజాలోనూ దాడుల ఉద్ధృతిని పెంచుతోంది. ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు (PM Benjamin Netanyahu) కూడా ఇప్పటికే గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అయితే...అటు హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్‌పై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. బందీలను తిరిగి అప్పగించాలని చూస్తున్నా ఇజ్రాయేల్ వాళ్లను పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. దీనిపై నెతన్యాహు ఘాటుగా స్పందించారు. ఆ ఆరోపణల్ని కొట్టిపారేశారు. ఇటీవలే అమెరికాకి చెందిన ఇద్దరి పౌరుల్ని ఇటీవలే విడుదల చేశారు హమాస్ ఉగ్రవాదులు. బందీలుగా ఉన్న వాళ్లందరినీ విడిపించుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. మరో ఇద్దరినీ విడుదల చేసేందుకు హమాస్ ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారు.
ఇటలీ ప్రధానితో భేటీ..
ఈ యుద్ధ నేపథ్యంలో...ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని భేటీ అయ్యారు. ఇజ్రాయేల్‌కి జార్జియా మద్దతునిచ్చారు. ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్ మరో కీలక ప్రకటన చేసింది. గత 24 గంటలుగా హమాస్ ఉగ్రవాదులు దాడులు చేస్తూనే ఉన్నారని వెల్లడించింది. ముఖ్యంగా గాజా స్ట్రిప్‌పై రాకెట్‌ల దాడులు ఆపడం లేదని తెలిపింది. ఐసిస్ ఉగ్రవాదుల కన్నా దారుణంగా హమాస్ వ్యవహరిస్తోందని, పసికందుల్ని కూడా వదలకుండా చంపుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమను తాము ఓ గొప్ప మానవతా సంస్థగా ప్రచారం చేసుకుంటూ...ఆ మసుగులో ఇలాంటి దారుణాలకు పాల్పడుతోందని మండి పడింది. ప్రపంచం వాళ్ల ట్రాప్‌లో పడకూడదని స్పష్టం చేసింది.