ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ ముప్పు రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ నివారణ, క్యాన్సర్‌ను ప్రభావితం చేసే అంశాలపై పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నాయి. వీటి ద్వారా క్యాన్సర్ కణాలు వృద్ధి చేందే విధానం, క్యాన్సర్‌కు కారణమయ్యే పరిస్థితులు, దాన్ని నయం చేసే  విధానాల గురించి చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి. వాటిలో తాజాగా ఉపవాసం కూడా చేరింది.


ఔనండి, మెమోరియాల్ స్లోన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్ లోని పరిశోధకులు చేసిన ప్రయోగాల్లో ఉపవాసం వల్ల శరీరంలోని సహజమైన రక్షణ వ్యవస్థ బలోపేతం అయినట్లు తేల్చారు. ఉపవాసం ఒక నాచురల్ కిల్లర్‌లా క్యాన్సర్ కణాల మీద పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. క్యాన్సర్ కణాల మీద దాడి చేసే కీలక భాగం రోగనిరోధక వ్యవస్థ. ఉఫవాసంతో అది చురుకుగా మారుతుందని పేర్కొన్నారు.


కీమోథెరపీ మందుల వల్ల హానికరమైన దుష్ప్రభావాలు ఉంటాయి. వీటి నుంచి తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తుంది. స్వల్పకాలిక ఉపవాసం ఆరోగ్యకరమైన కణాలను రక్షించగలదని 2012 లో ఎలుకల మీద చేసిన ప్రయోగాల్లో దృవీకరించారు. 2016లో స్వల్పకాలిక ఉపవాసం కీమోవల్ల కలిగే విషప్రభావాన్ని గణనీయంగా తగ్గించినట్టు గుర్తించారు.


వారంలో రెండు సార్లు ఉపవాసం?


జర్మన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ చేసిన మరొక అధ్యయనంలో.. అప్పుడప్పుడు చేసే ఉపవాసాల వల్ల కాలేయం, క్యాన్సర్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయాలను తెలుసుకున్నారు. ఐదు రోజుల పాటు ఒక క్రమపధ్దతిలో తిని.. రెండు రోజుల పాటు ఒక నిర్ణీత విధానంలో ఉపవాసం చేసినట్టయితే ఫ్యాటీ లివర్, లివర్ ఇన్ఫ్లమేషన్ లేదా కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించవచ్చని నిపుణులు తేల్చారు.


Also Read: శోభనం రాత్రి వీడియోను పోస్ట్ చేసిన కొత్త జంట - తల బాదుకుంటున్న నెటిజన్స్, ఇంతకీ ఆ వీడియోలో ఏముంది?


క్యాన్సర్ కణాలను నాశనం చెయ్యడంలో కీలక పాత్ర


ఉపవాసం క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గించగలడం మాత్రమే కాదు, ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడం ద్వారా క్యాన్సర్ వృద్దిని నివారిస్తాయి. ఉపవాసం వల్ల చెడిపోయిన కణాలు శరీరం నుంచి తొలగిపోతాయి. క్యాన్సర్ ముదిరిపోక ముందే ఈ కణాలను నాశనం చేస్తాయి. ఏది ఏమైనా వ్యక్తిగత పరిస్థితుల మీద ఉపవాసం చెయ్యాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే క్యాన్సర్ లేదా దానికి తీసుకునే చికిత్స వల్ల బరువు బాగా తగ్గిపోయిన వారు ఉపవాసం చెయ్యడం ఒక సవాలుగా మారవచ్చు.


ఇంకా ప్రయోగాల దశలోనే..


ఈ అధ్యయనాలు క్యాన్సర్ చికిత్స, నివారణపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు నిర్వహించిన ప్రయోగాలన్నీ ఎలుకల మీదే జరిగాయి. మనుషుల మీద ఈ ప్రభావాలు ఎలా ఉంటాయనేది ఇంకా నిర్ధారించాల్సి ఉంది. ఈ అధ్యయనంలో ఉపవాస ప్రభావాలలో నిర్థిష్ట ప్రొటీన్లను హైలైట్ చేసినట్టు గమనించారు. ఈ ప్రొటీన్ల పనితీరును బాగా అర్థం చేసుకోగలిగితే మరింత పురోగతి సాధించే అవకాశం ఉంటుంది.


Also Read: వెలుగుల చాటు చీకటి - ఈ టైమ్‌లో లైట్లు ఆన్‌చేసి కూర్చుంటే మధుమేహం ముప్పు తప్పదట, డయాబెటిస్ రాకూడదంటే ఇలా చెయ్యండి