ర్ణుడి చావుకు అనేక కారణాలు అన్నట్లు.. డయాబెటిస్‌ రావడానికి కూడా అనేక కారణాలున్నాయి. ఆ లిస్టులో తాజాగా మరో కారణం యాడ్ అయ్యింది. అదే.. వెలుగు. అయినా, వెలుతురికి డయాబెటిస్‌కు లింకేమిటి? అనేగా మీ సందేహం? అయితే, మీరు తప్పకుండా ఈ తాజా అధ్యయనం గురించి తెలుసుకోవల్సిందే. 


మీకు రాత్రిపూట లైట్లు ఆన్ చేసుకుని నిద్రపోవడం అలవాటా? లేదా అర్థరాత్రిళ్లు మొబైల్ లేదా టీవీలు చూసే క్రేజీ హాబిట్ ఉందా? అయితే.. కంగ్రాట్స్, మిమ్మల్ని త్వరలోనే డయాబెటిస్ పలకరించనుంది. ఇటీవల నిర్వహించిన ‘ది లాన్సెట్’ అధ్యయనం ప్రకారం.. అర్థరాత్రి 12.00 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఎక్కువ కాంతికి గురయ్యే వ్యక్తులకు మధుమేహం వచ్చే అవకాశం ఉంది. 
 
ఇటీవల యూకేలో 85 వేల మందిపై జరిపిన పరిశోధనల్లో ఈ కొత్త విషయం ‘వెలుగు’లోకి వచ్చింది. సాధారణం రాత్రి వేళల్లో మొబైల్, టీవీలు చూడటం వల్ల కళ్లు దెబ్బతింటాయని అంటారు. అలాగే, రాత్రిళ్లు నిద్రపోకుండా మెలకువగా ఉండే వ్యక్తులు త్వరగా డయాబెటిస్‌కు గురవ్వుతారు. తాజాగా రాత్రిళ్లు ఎక్కువ సేపు కాంతిలో ఉండే వ్యక్తుల్లో షూగర్ స్థాయిలు పెరుగుతాయని, అది క్రమేనా డయాబెటిస్‌కు దారి తీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. సుమారు ఎనిమిదేళ్లపాటు జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు తెలిశాయి.


కాంతి స్థాయిని బట్టి...


అయితే, వెలుతురు ద్వారా డయాబెటిస్ రావడం అనేది ఆ కాంతి స్థాయిని బట్టి ఆధారపడి ఉంటుందని పరిశోధకులు తెలిపారు. అంటే ఎంత ఎక్కువ కాంతికి బాధితుడు ఎక్స్‌పోజ్ అవుతాడో అంత ఎక్కువ స్థాయిలో డయాబెటిస్ ఛాన్సులు పెరుగుతాయి. ఈ ఫలితాలు, ప్రభావాలు.. క్యాండిల్ లైట్ వెలుతురిలో ఉండేవారికి ఒకలా.. అధిక కాంతిని వెదజల్లే లైట్ల కింద పనిచేసేవారిలో ఒకలా ఉంటాయట. ఉదాహరణకు.. ఆఫీసుల్లో ఎక్కువ వెలుతురులో నైట్ డ్యూటీలు చేసే ఉద్యోగులకు ఈ ముప్పు ఎక్కువగా ఉండవచ్చు. ఈ అధ్యయనంలో పాల్గొన్న చాలామంది స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లు లేనివారే. కానీ, రాత్రి 12 నుంచి తెల్లవారుజాము వరకు మెలకువ ఉండటం వల్ల.. వారిలోని బ్లడ్ షుగర్ స్థాయిలు పెరిగాయట.  


రాత్రే ఎందుకు?


మన శరీరం రెగ్యులర్‌గా ఒక టైమ్‌ను పాటించాలని అనుకుంటుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో నిర్దిష్ట సమయానికి నిద్రపోయేందుకు మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. కానీ, ఆ టైమ్‌లో మీరు నైట్ డ్యూటీలో ఉండటం లేదా మొబైల్, టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నట్లయితే.. సిర్కాడియన్ రిథమ్‌కు అంతరాయం ఏర్పడుతుంది. ఇది జీవక్రియలపై చెడు ప్రభావం చూపుతుంది. మన శరీరంలో జీవక్రియలు సక్రమంగా నిర్వహించడంలో సిర్కాడియన్ రిథమ్ కీలక పాత్ర పోషిస్తుంది. గ్యాడ్జెట్స్ లేదా రూమ్‌లో ఉండే కాంతి వల్ల అది గందరగోళానికి గురవ్వుతుంది. అది క్రమేనా ఇన్సులిన్ నిరోధకతపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా టైప్ 2 డయాబెటిస్‌ బారిన పడతారు.


మెలటోనిన్ ప్రభావమూ ఎక్కువే


నిద్రను కలిగించే హార్మోన్ మెలటోనిన్ కూడా ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు తెలుపుతున్నారు. రాత్రిపూట ఎక్కువ కాంతికి గురికావడం వల్ల మెలటోనిన్ స్థాయి తగ్గిపోతుంది. ఫలితంగా జీవక్రియలు మందగిస్తాయి. ఎందుకంటే మెలటోనీన్ సిర్కాడియన్ రిథమ్‌లను నియంత్రిస్తుంది. కాబట్టి రాత్రి వీలైనంత త్వరగా నిద్రపోవడం ద్వారా మధుమేహం ముప్పు నుంచి బయటపడవచ్చు. ఒక వేళ లేటుగా నిద్రపోయే అలవాటు ఉన్నా.. అర్ధరాత్రి 12 వరకు మెలకువగా ఉండవద్దు. ఆ టైమ్‌లో ఎక్కువ కాంతిని చూడొద్దు.


Also Read: కాఫీ తాగడానికి బెస్ట్ టైమ్స్ ఇవే - మీరూ తప్పకుండా ట్రై చెయ్యండి, మంచి ఫలితాలుంటాయి