Fashion Trend : ఓవర్‌సైజ్ సూట్లు ప్యాంట్లు ధరించడం రోజు రోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం ఇదే ట్రెండ్ అని చెప్పవచ్చు. ఇది కేవలం పురుషుల్లో అనుకుంటే అది పొరపాటే. మహిళలు కూడా ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. ఫ్యాషన్ ప్రపంచంలో ఈ ట్రెండీ ఫార్మల్ వేర్ల డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది.
మహిళలు ధరించగలిగే ఈ ట్రెండీ ఫార్మల్ వేర్లు ధరించడానికి ఒకప్పటిలా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి ఇప్పుడు వివిధ డిజైన్లలో అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి మీరు ఎక్కువ కష్టపడకుండా.. జస్ట్ చిన్న మార్పులతో మీ ఆఫీస్ లుక్‌ను స్టైల్ చేసుకోవచ్చు. మీ లుక్‌ని మెరుగుపరచుకునేందుకు, డిఫరెంట్‌గా కనిపించేందుకు మీరు క్లాసిక్ ఇండో వెస్ట్రన్ ఫ్యూజన్ రకమైనవి ఎంచుకోవచ్చు. అయితే మీరు ఎలాంటి ప్యాంటులు ఎంచుకుంటే మీ ఫార్మల్ లుక్‌తో రాక్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
హై-వెయిస్టెడ్ ట్రౌజర్స్
కార్పొరేట్ లేదా ప్రొఫెషనల్ లుక్‌లో మీరు కనిపించాలనుకుంటే ఇవి మీకు బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఈ ఫీల్డ్‌లో మీరు మీ సహోద్యోగులకు, పోటీదారులకు మీరు ఎంత ప్రొఫెషనల్‌గా ఉంటారో మీ లుక్ తెలియజేస్తుంది. ఈ హై వెయిస్టెడ్ ట్రౌజర్స్ మీకు కచ్చితంగా ప్రొఫెషనల్ లుక్‌ని ఇస్తాయి. ఇవి నడుముపైకి ఉండి.. మీ దుస్తులకు మంచి గ్రాండ్, ఆత్మవిశ్వాసంతో కూడిన రూపాన్ని అందిస్తాయి. అంతేకాకుండా మీరు కాస్త పొట్టిగా ఉంటే కనుక ఇది మీకు మరో బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఈ ట్రౌజర్స్ మీకు పొడవైన రూపాన్ని అందిస్తుంది. మీ టాప్‌కి ట్రౌజర్‌కి నడుమ పెద్ద బెల్ట్‌తో స్టైల్ చేస్తే.. మీరు మరింత క్లాసీగా కనిపిస్తారు.
ఇవి వివిధ రంగులలో అందుబాటులో ఉంటాయి. అయితే మీరు కచ్చితంగా ఒక నలుపు, బూడిద రంగు హై వెయిస్టెడ్ ట్రౌజర్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ రెండు రంగులు ఏ టాప్‌తో అయినా మ్యాచ్ అవుతాయి. వీటిని శాటిన్ షర్ట్ లేదా ఫార్మల్ షర్టుతో స్టైల్ చేయవచ్చు. దానిపై బ్లేజర్ వేస్తే చాలు. ఇది మీ లుక్‌ని పూర్తిగా కంప్లీట్ చేస్తుంది. హై వెయిస్టెడ్ ట్రౌజర్లను మీరు రోజువారీ లైఫ్‌లో ఉపయోగించవ్చు. మీరు ట్రెండ్‌ని ఆలస్యంగా ఫాలో అవుతున్నారు అనుకోకండి. మీరు లేట్‌గా వీటిని ఎంచుకున్నా లేటెస్ట్గా కనిపిచండం గ్యారెంటీ.
STREET 9
Women Beautiful Grey Solid Trousers
₹919, SHOP NOW.
బాస్ లుక్ కోసం టాపర్డ్ ట్రౌజర్
ఈ రకమైన ట్రౌజర్ పైనుంచి వదులుగా ఉండి.. చీలమండలం దగ్గర మాత్రం ఫిట్‌గా ఉంటుంది. నడుము దగ్గర కుచ్చీలతో దీనిని రూపొందిస్తారు. ఇది మీ డల్ లుక్‌ని కూడా పూర్తి వైబ్రెంట్‌గా మారుస్తుంది. డల్ షర్టులను కూడా సులభంగా ఎలివేట్ చేస్తుంది.
టాపర్డ్ ప్యాంటు మీ ఆఫీస్ లుక్‌ని క్లాసీగా చేస్తుంది. నిజం చెప్పాలంటే ఇది మీ గో-టు బాటమ్ వేర్. దీనిని మీరు నచ్చిన టాప్‌తో స్టైల్ చేయవచ్చు. వెస్ట్రన్, క్లాసిక్ లుక్స్‌ని ఈ ట్రౌజర్ ఇస్తుంది. ఎందుకంటే దీనిని మీరు టాప్‌తో పెయిర్ చేయవచ్చు లేదా అనార్కలితో కూడా స్టైల్ చేయవచ్చు. ఈ సిల్క్ టేపర్డ్ ప్యాంటు ఆఫీస్ పార్టీల సమయంలో మిమ్మల్ని ప్రత్యేకంగా చూపిస్తుంది. ఈ టాపర్డ్ ట్రౌజర్లు స్మార్ట్ లుక్‌ని ఇవ్వడమే కాకుండా.. ట్రెండీ, ప్రొఫెషనల్ లుక్‌ని అందిస్తాయి.
KOTON
Tapered Fit Pleat-Front Trousers
₹1,504, SHOP NOW
వైడ్-లెగ్ ట్రౌజర్స్
మీ రెగ్యూలర్ ఆఫీస్ లుక్‌కి కాస్త బ్రేక్ ఇచ్చి నాటకీయత జోడించాలనుకుంటే వైడ్ లెగ్ ట్రౌజర్స్ మంచి ఎంపిక. ఇవి వదులుగా ఉండి మీకు సౌకర్యంగా ఉంటాయి. కాబట్టి కేవలం ఆఫీస్‌లకే కాదు.. హాలీడేకి వెళ్తున్నప్పుడు లేదా రెగ్యూలర్ సమయంలో కూడా వీటిని వేసుకోవచ్చు. కాటన్, సిల్క్‌లో అందుబాటులో ఉండే ఈ ట్రౌజర్స్ మీకు మంచి ఆఫీస్ లుక్‌ని గ్యారెంటీగా ఇస్తాయి.
క్యాజువల్ ట్రెండీ లుక్ కోసం మీ టాప్‌ని టక్ చేసి.. దాని తగిన షూలతో పెయిర్ చేయవచ్చు. సిల్క్ షర్ట్స్ ఈ రకమైన ట్రౌజర్స్ అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. మీ కాళ్లను ఎత్తుగా చూపి.. మీరు పొడుగుగా ఉన్నట్లు భ్రమ కలిగిస్తాయి. వీటిని మీరు స్ట్రాపీ చెప్పులు, హీల్స్, లేదా షూలతో జత చేయవచ్చు.
UNIQLO
Linen Blend Tucked Wide Trousers
₹1490, SHOP NOW
రాక్ ది ఫ్లేర్డ్ ప్యాంటు
రాక్ ది ఫ్లేర్డ్ ప్యాంటులు ఓల్డ్ మోడల్ అయినా.. ఇప్పుడు మళ్లీ ట్రెండ్‌లోకి వచ్చాయి. మరింత స్టైలిష్‌గా కనిపించడమే కాకుండా.. కూల్ లుక్‌ని అందిస్తాయి. స్కిన్నీ లేదా వైడ్-లెగ్ ప్యాంటులా కాకుండా.. నడుము నుంచి మోకాలి వరకు సమానంగా ఉంటాయి. మోకాలి నుంచి బెల్ బోటమ్. ఇవి లూజ్‌గా ఉండి మీకు కంఫర్ట్ ఇస్తాయి. చీలమండలం వద్ద ప్లీట్స్ లేదా రఫుల్స్‌తో వస్తాయి. వీటిని కిక్ ఫ్లేర్స్ లేదా పుడిల్ ఫ్లేర్స్ అంటారు. వీటిలో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే.. మీరు ఈ ఫ్లైర్డ్ ట్రౌజర్లను ఏ ఈవెంట్లోనైనా స్టైల్ చేయవచ్చు. టీ షర్ట్ నుంచి డెనిమ్ టాప్, ఫార్మల్ టీ షర్టులు, టాప్స్ ఇలా వేటితోనైనా పెయిర్ చేయవచ్చు.
Broadstar
Broadstar Black Relaxed Fit High Rise Flared Trousers
₹1199, SHOP NOW
సెయిలర్ ట్రౌజర్స్
ఈ సెయిలర్ ట్రౌజర్స్ని యూఎస్ నావికాదళంలోని నావికుల యూనిఫాం నుంచి ప్రేరణ పొంది డిజైన్ చేశారు. ఇది ఓ స్మార్ట్ స్టైల్ అని చెప్పవచ్చు. ఇవి మిమ్మల్ని నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి. ఈ ట్రౌజర్స్ లెగ్ కట్, సైడ్ ప్యానెల్స్, బటన్స్ చాలా గ్రాండ్‌గా ఉంటాయి. వీటిని ధరించడానికి చాలా సౌకర్యంగా ఉంటాయి. ట్యాంక్ టాప్‌లు, లైన్స్‌తో కూడిన చొక్కాలు, టర్టిల్‌నెక్ స్వెటర్‌లు బాగా నప్పుతాయి. ఇవి మీకు స్టైలిష్ ఫార్మల్ లుక్‌ని అందిస్తాయి.
PROJECT EVE
High-Rise Treggings with Elasticated Waistband
₹540, SHOP NOW
క్లాసిక్ టైలర్డ్ ట్రౌజర్
సరళమైన, చిక్ లుక్ కావాలనుకునేవారు క్లాసిక్ టైలర్డ్ ట్రౌజర్స్ ఎంచుకోవచ్చు. ఇవి నేటి అధునాతనతను వెదజల్లుతాయి. హై వెయిస్ట్‌తో రూపొందించిన ఈ ట్రౌజర్స్‌ను మీరు తెల్లని టాప్, బ్లేజర్‌తో పెయిర్ చేశారంటే.. మీ ఆఫీస్ లుక్‌కి తిరుగు ఉండదు. వీటిని మీరు ఆఫీస్ మీటింగ్స్, బిజినెస్ మీటింగ్స్ సమయంలో చక్కగా నప్పుతాయి. వీటిని మీరు హీల్స్‌తో జత చేస్తే మీరు మరింత ట్రెండీగా, స్టైలిష్‌గా కనిపిస్తారు.
Annabelle by Pantaloons
Annabelle by Pantaloons Navy Formal Trousers
₹1699, SHOP NOW
ట్రౌజర్లను ఓల్డ్, బోరింగ్ అవుట్ఫిట్ల్లా చూడకుండా.. వాటికి మీ ఫ్యాషన్ జోడిస్తే ట్రెండ్‌కి కరెక్ట్‌గా సెట్ అవుతాయి. రోటీన్‌గా ఆఫీస్‌కి వెళ్లడానికి బదులు మీరు ఇలాంటి డిఫరెంట్ లుక్స్‌ని ట్రై చేసి ఆఫీస్ ఫ్యాషన్‌కి కొత్త అర్థాలు నేర్పవచ్చు.
Disclaimer: This is a partnered article. The information is provided to you on an "as-is" basis, without any warranty. Although all efforts are made, however, there is no guarantee to the accuracy of the information. ABP Network Private Limited (‘ABP’) and/or ABP Live make no representations or warranties as to the truthfulness, fairness, completeness, or accuracy of the information. Readers are advised visit to the website of the relevant advertiser to verify the pricing of the goods or services before any purchase.