Evening Physical Activity Benefits: ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య స్థూలకాయం.  సరైన శారీరక శ్రమ లేకపోవడం, కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చొని పని చేయడం వల్ల ఈజీగా బరువు పెరుగుతున్నారు. పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే, ఈవినింగ్ వర్కౌట్స్ చేయడం ద్వారా ఒబేసిటీ నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందంటున్నారు ఆస్ట్రేలియన్ పరిశోధకులు. గుండె సంబంధ సమస్యలతో పాటు అలకాల మరణం ముప్పును తగ్గించుకోవచ్చు అంటున్నారు.


8 ఏళ్ల పాటు 30 వేల మందిపై పరిశోధన


ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయం పరిశోధకులు తాజాగా ఓ అధ్యయనం నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఎక్కువగా వర్కౌట్స్ చేసే వారిలో హృదయ సంబంధ వ్యాధులతో కలిగే అకాల మరణ ముప్పు తగ్గినట్లు గురించారు. రోజంతా చేసే శారీరక శ్రమతో పోల్చితే సాయంత్రం చేసే వర్కౌట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తున్నట్లు తేల్చారు. ఒబేసిటీ, హృదయ సంబంధ సమస్యలతో చాలా మంది అకాల మరణానికి గురవుతున్నారని ఈ పరిశోధనను లీడ్ చేసిన ఫిజియాలజీ నిపుణుడు డాక్టర్ ఏంజెలో సబాగ్ తెలిపారు. స్థూలకాయం నుంచి బయటపడేందుకు వ్యాయామం ఒక్కటే పరిష్కారం కానప్పటికీ, సాయంత్రం పూట వర్కౌట్స్ చేయడం వల్ల కొంత ఉపశమనం పొందే అవకాశం ఉందన్నారు. ఈ పరిశోధనను సుమారు 8 ఏళ్ల పాటు కొనసాగించినట్లు చెప్పారు. 30 వేల మంది నుంచి శాంపిల్స్ సేకరించామన్నారు. సాయంత్రం పూట 3 నిమిషాలు, అంతకంటే ఎక్కువ సేపు వర్కౌట్స్ చేసే వారిలో గ్లూకోజ్ కంట్రోల్ లో ఉండటంతో పాటు హృదయ సంబంధ సమస్యల ముప్పు తగ్గినట్లు వెల్లడించారు.   


ఈవినింగ్ వర్కౌట్స్ తో అకాల మరణానికి చెక్


ఈ పరిశోధన కోసం యుకె బయోబ్యాంక్ డేటాను వాడుకున్నారు. ఊబకాయంః కలిగి 40 ఏళ్లు పైబడిన 29,836 మందితో పాటు టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్న 2,995 మందిపై పరిశోధన నిర్వహించారు. ఈ పరిశోధన జరుగుతున్న సమయంలో వీరిలో 1,425 మంది చనిపోయారు. 3,980 హృదయ సంబంధం సమస్యలతో పాటు 2,162 మంది మైక్రోవాస్కులర్ డిస్‌ఫంక్షన్ తో బాధపడుతున్నట్లు గుర్తించారు. అయితే, సాయంత్రం పూట వ్యాయాయం చేసే వారితో చేయని వారిలోనే ఈ అకాల మరణం ముప్పు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. స్థూలకాయం, టైప్ 2 డయాబెటిస్ కంట్రోల్ అనేది ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించడంతో పాటు శారీరక శ్రమ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఉదయం చేసే వర్కౌట్స్ తో పోల్చితే సాయంత్ర జిమ్ చేయడం వల్ల ఒబేసిటీ, హృదయ సమస్యలు, డయాబెటిస్ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉందన్నారు. ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సాయంత్రం పూట పవర్ వాకింగ్ చేయడం, మెట్లు ఎక్కడం, ఇంట్లో పనులు చేయడం వల్ల కూడా ఆరోగ్యానికి మేలు కలుగుతుందన్నారు. 


Read Also: గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అది స్మోకింగ్ కంటే ప్రమాదకరమట, ఎందుకంటే?


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.