Freezing Eggs Late Pregnancy : ఈ రోజుల్లో చాలా మంది మహిళలు.. కెరీర్​లో ముందుకు వెళ్తూ.. భవిష్యత్తులో తల్లులు కావాలనుకుంటున్న వారు.. తమ ఎగ్స్​ను ఫ్రీజింగ్ చేసుకోవాలనే ఆలోచనల్లో ఉంటున్నారు. చాలామంది సెలబ్రెటీలు కూడా తమ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటున్నారు. హీరోయిన్స్ మెహ్రీన్, మృణాల్ వంటివారు కూడా దీని గురించి చాలాసార్లు ప్రస్తావించారు. అయితే ఈ ప్రక్రియలో పాల్గొనాలంటే ఏ వయసు మంచిది? ప్రాసెస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇప్పుడు చూసేద్దాం.

Continues below advertisement

ఎగ్ ఫ్రీజింగ్..

ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియలో మహిళ అండాశయాల నుంచి అండాలను తీసి.. అవసరమైతే తర్వాత ఉపయోగించుకోవడానికి వాటిని భద్రంగా నిల్వ చేస్తారు. ముందుగా టెస్ట్​లు చేసి.. చికిత్స ప్రక్రియ ప్రారంభిస్తారు.

Also Read : పెళ్లికాకుండానే ఎగ్​ఫ్రీజింగ్ చేసుకోవచ్చా? బెనిఫిట్స్ ఏంటి? దీంతో ఎంత లేట్​గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు?

Continues below advertisement

ఏ వయస్సులో ఫ్రీజ్ చేయడం మంచిది?

వయసు పెరిగే కొద్దీ అండాల సంఖ్య, నాణ్యత మారుతుంది. సాధారణంగా చిన్న వయసులో సేకరించిన అండాలు మెరుగైన నాణ్యతను కలిగి ఉండవచ్చు. 30 ఏళ్ల వయసులో అండాలను ఫ్రీజ్ చేస్తే మంచి నాణ్యత లభించవచ్చు. అయితే 35 ఏళ్ల తర్వాత ఈ నిర్ణయం ఎక్కువగా వ్యక్తిగత పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. 40 ఏళ్ల వయసులో కూడా ఈ ప్రక్రియ సాధ్యం కావచ్చు. కానీ మంచి అండాలు దొరికే అవకాశాలు తక్కువగా ఉండవచ్చని నిపుణులు చెప్తున్నారు. 

అయితే అండాలను ఫ్రీజ్ చేయడం అంటే భవిష్యత్తులో సంతానం కలుగుతుందని హామీ ఇవ్వడం కాదంటూ మరో షాకింగ్ విషయం తెలిపారు. ఎందుకంటే అండాలను ఫ్రీజ్ చేసే వయసు వాటి నాణ్యతను ప్రభావితం చేస్తుంది. సేకరించిన పరిపక్వ అండాల సంఖ్య కూడా దీనిలో పాత్ర పోషిస్తాయి. అందుకే నిర్ణయం తీసుకునే ముందు ఐవీఎఫ్, ఎగ్ ఫ్రీజింగ్ గురించి పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. 

Also Read : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అండాలను గడ్డకట్టించే ప్రక్రియలో భాగంగా.. అండాశయాలలో అనేక అండాల అభివృద్ధిని ప్రేరేపించడానికి మందులను ఉపయోగిస్తారు. ఈ సమయంలో అండాశయాలు కొద్ది కాలం పాటు ఉబ్బి.. పెళుసుగా మారతాయి. అందువల్ల వేగంగా పరుగెత్తడం, దూకడం, బరువైన వస్తువులను ఎత్తడం లేదా శరీరాన్ని అకస్మాత్తుగా మెలితిప్పాల్సిన వ్యాయామాలు చేయకూడదు. 

తేలికపాటి నడక, సులభమైన శారీరక వ్యాయామం చేయవచ్చు. కానీ ఇది మహిళల ఆరోగ్యపరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అండాలను సేకరించే సమయంలో విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఈ ప్రక్రియ తర్వాత వ్యాయామాన్ని ఎప్పుడు తిరిగి ప్రారంభించాలనే దాని గురించి కూడా వైద్యులు వివరంగా సూచించే అవకాశం ఉంది. 

Also Read : మహిళల్లో ఈ వయసు తర్వాత ప్రెగ్నెన్సీ కష్టమా? ఫెర్టిలిటీ నిపుణులు ఏమంటున్నారంటే..