Diabetic Diet Restrictions for Eggs : హెల్తీ ఫుడ్​లలో గుడ్డు ఒకటి. అందుకే వీటిని పోషకాహారంగా చెప్తారు. దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. శరీరానికి ప్రోటీన్, విటమిన్ డితో పాటు పలు రకాలు పోషకాలు అందుతాయి. చాలామంది వీటిని రెగ్యూలర్​గా తీసుకుంటారు. ముఖ్యంగా జిమ్​కి వెళ్లేవారు, పోషకాలు, ప్రోటీన్ గురించి చూసేవారు వీటిని తీసుకుంటారు. ఇవి మంచి రుచితో పాటు.. ఆరోగ్యానికి ప్రయోజనాలు అందిస్తాయి. అయితే దీనిని రెగ్యూలర్​గా తీసుకుంటే పర్లేదు కానీ ఎక్కువగా తింటే కొన్ని సైడ్​ ఎఫెక్ట్స్​ తప్పవట. 


ముఖ్యంగా మధుమేహమున్నవారు ఎగ్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట. ఇంతకీ గుడ్లు వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? రోజుకు ఎన్ని ఎగ్స్ తీసుకోవాలి? గుడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే తీవ్రమైన ఇబ్బందులు ఏంటి? మధుమేహమున్నవారికి ఇది ఎందుకు అంత మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. 


జీర్ణ సమస్యలు


గుడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరికి కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే గుడ్లు పడనివారికి కూడా ఇది జీర్ణసమస్యలు కలిగిస్తుంది. కొందరికి అతిసారం వంటి ఇబ్బందులు కూడా కలగవచ్చు. అలాగే కొవ్వు కలిగిన పదార్థాలతో దీనిని తీసుకుంటే మలబద్ధకం వస్తుంది. కాబట్టి వీటిని ఎక్కువగా కాకుండా లిమిట్​గా తీసుకోవాలి. 


అలెర్జీలు


గుడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరికి అలెర్జీలు వస్తాయి. దద్దర్లు, తామర, వాపు, జీర్ణ సమస్యలు కలుగుతాయి. మరికొందరిలో శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. జలుబు, కళ్లు ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఉడికించని గుడ్లు తీసుకుంటే ఇన్​ఫెక్షన్లు వచ్చే ప్రమాదముంది. వాంతులు, వికారం, విరేచనాలు అవ్వొచ్చు. ఇలాంటి ఇబ్బందులు ఉంటే వెంటనే వైద్యుల సహాయం తీసుకోవాలి.  


కొలెస్ట్రాల్ పెరుగుతుంది..


ఎగ్స్​లో డైటరీ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది కొందరిలో కొలెస్ట్రాల్​ను ఎక్కువ చేస్తుంది. అయితే ఇది చెడు కొలెస్ట్రాల్​ను అంతగా పెంచదు కానీ.. ఇప్పటికే ఈ సమస్యతో బాధపడేవారు గుడ్లను లిమిట్​గా తీసుకుంటేనే మంచిది. ప్రతిరోజూ కాకుండా.. రెండ్రోజులకోసారి ఎగ్స్ తింటే మంచిది. కొలెస్ట్రాల్ కంట్రోల్​లో ఉండి.. గుండె సమస్యలు లేని వారు వీటిని బేషుగ్గా తినొచ్చు. 


డయాబెటిస్ ఉన్నవారికి.. 


గుడ్లలో ఇన్సులిన్​ని ఉత్పత్తి చేసే బయోటిన్​ కూడా ఉంటుంది. వీటిని లిమిట్​గా తీసుకుంటే బ్లడ్ షుగర్ కంట్రోల్​లో ఉంటుంది కానీ.. ఎక్కువగా తినడం వల్ల చెడు ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా ఎక్కువగా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే అవకాశం కూడా ఉందని ఓ అధ్యయనం తెలిపింది. వారానికి ఏడు లేదా అంతకంటే ఎక్కువ తినేవారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 58 శాతం ఉందని డయాబెటిస్ కేర్ జర్నల్​లో ప్రచురించారు. అదే ఆడవారికి అయితే ఇది 77 శాతంగా ఎక్కువగా ప్రమాదకరంగా ఉందట. 



రోజుకు ఎన్ని గుడ్లు తినొచ్చు..


హెల్తీగా ఉండే వ్యక్తి వారానికి ఏడుగుడ్లు తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదని హార్వర్డ్ మెడికల్ స్కూల్ డేటాలో తెలిపింది. కొన్ని ఆరోగ్య సమస్యలను కంట్రోల్ చేయడానికి గుడ్లు తినడం మానేస్తే బెటర్. అధిక కొలెస్ట్రాల్ ఉంటే వారానికి 2 లేదా 3 గుడ్లు తీసుకోవాలి. గుండె సమస్యలున్నవారు వారిని మూడు లేదా 4 తినొచ్చు. మధుమేహం ఉంటే వారానికి 5 తీసుకుంటే ఎక్కువ. కాబట్టి మీ హెల్త్​ని బట్టి వీటి సంఖ్య ఉండాలి. వైద్యుల సలహాలు తీసుకుని వీటిని మీ డైట్​లో చేర్చుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. 


Also Read : ఈ ఒక్క మసాలా దినుసుతో మగవారికి ఎన్ని ప్రయోజనాలో.. లైంగిక సమస్యలను కూడా దూరం చేస్తుందట