చాక్లెట్ ఆరోగ్యానికి మంచిదేనా? దీనిపై ఇప్పటివరకు చాలా అధ్యయనాలు జరిగాయి. కొన్ని అధ్యయనాలు చాక్లెట్లు ఆరోగ్యానికి మంచివేనని చెబితే, మరికొన్ని అనారోగ్యాన్ని కలిగిస్తాయని చెప్పాయి. ఈ గందరగోళాన్ని తొలగించేందుకు తాజాగా మరో అధ్యయనం నిర్వహించారు. ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ.. చాక్లెట్లు తినడం వల్ల యువత చిన్న వయస్సులోనే చనిపోయే ప్రమాదం 12 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. అంతేగాక ప్రాణాంతకమైన గుండె జబ్బులు లేదా క్యాన్సర్ వచ్చే ప్రమాదం 16 శాతానికి తగ్గుతుందని వెల్లడించింది.
వారానికి రెండు సాధారణ సైజు డైరీ మిల్క్ బార్‌లు తినేవారికి మధుమేహం వచ్చే అవకాశం నాలుగు రెట్లు తగ్గుతుందని అధ్యయనం పేర్కొంది. చాక్లెట్ చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గిస్తుందని తెలిపారు. చాక్లెట్లో ఉండే కోకో ఫ్లేవనాయిడ్స్ సమ్మేళనాలు రక్త నాళాల ఆరోగ్యాన్ని పెంచుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మేరీల్యాండ్‌లోని యుఎస్ నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెసర్ జియాకీ హువాంగ్ ఈ అధ్యయనం గురించి వివరిస్తూ.. ‘‘మితంగా చాక్లెట్లు తీసుకొవడం ద్వారా అనారోగ్య సమస్యలను పాక్షికంగా తగ్గించవచ్చు’’ అని తెలిపారు. అయితే, బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించింది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి చాక్లెట్ తినమని సిఫార్సు చేయడంపై పునరాలోచించాలని పేర్కొంది. దీనిపై మరింత లోతైన పరిశోధన అవసరమని చెప్పింది. చాక్లెట్‌తో పోల్చితే.. గుండెకు సమతుల్య ఆహారం మించిన బెస్ట్ ఫుడ్ ఏదీ లేదని స్పష్టం చేసింది.
బ్రిటిష్ మెడికల్ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం డార్క్ చాక్లెట్ మితంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం మూడింట ఒక వంతు తగ్గించుకోవచ్చు. స్విట్జర్లాండ్ శాస్తవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఆందోళన, ఒత్తిడికి గురవుతున్న వ్యక్తులకు డార్క్ చాకోలెట్ రెండు వారాల పాటూ తినిపిస్తే పరిస్థితి మెరుగవుతుంది. యూనివర్సిటీ ఆఫ్ కోపెన్‌హాగన్ లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఆకలి కోరికలు తగ్గుతాయని, తద్వారా ఇతర ఆహారం తక్కువగా తింటారని తేలింది. ఇది ఆయిలీ ఫుడ్స్, ఉప్పు, కారంగా ఉండే ఆహారాలను తినాలన్న కోరికలను తగ్గిస్తుందని కూడా తెలిసింది. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే రోజూ డార్క్ చాక్లెట్ ముక్కను తినొచ్చు.
Also Read: హెలికాప్టర్‌ను కూల్చేసిన షార్క్, కిరణ్ బేడీని తిట్టిపోస్తున్న నెటిజన్స్, ఎందుకంటే..
చాక్లెట్ల వల్ల కలిగే మరికొన్ని ప్రయోజనాలు:
❤ సాధారణ చాక్లెట్లతో పోల్చితే డార్క్ చాక్లెట్లు ఆరోగ్యానికి మంచివని నిపుణులు సూచిస్తున్నారు.
❤ చాక్లెట్లు పిల్లలకే కాదు పెద్దలకు కూడా మంచివే.
❤ మానసిక శక్తిని, ఉల్లాసాన్ని వెంటనే పెంచే ఒక క్లాసిక్ ట్రీట్ చాక్లెట్.
❤ బరువు తగ్గేందుకు ప్రయత్నించే వారు రోజూ చాక్లెట్ ముక్కను కచ్చితంగా తినాలి.
❤ గుండె పోటు, స్ట్రోక్స్ వచ్చే అవకాశాన్ని చాక్లెట్ తగ్గిస్తుంది.
❤ చాక్లెట్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
❤ మూడ్ స్వింగ్స్‌ను తగ్గించడంలో చాక్లెట్ సహకరిస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.
❤ డార్క్ చాకొలెట్ తినడం వల్ల మెదడులో ఉండే డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్‌ను విడుదలవుతుంది.
❤ చిన్న చాక్లెట్ ముక్క మెదడు ఆరోగ్యాన్ని, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
❤ కోకో పొడి అధికంగా ఉండే పానీయాలు, లేదా చాక్లెట్ తినడం వల్ల మెదడుకు రక్తప్రసరణ మెరుగుపడుతుందని తేలింది.
Also Read: ఛీ, యాక్, ఆ స్వామిజీ మలాన్ని తింటున్న జనం, ఆశ్రమంలో 11 శవాలు లభ్యం!
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.