టమోటాలతో సింపుల్ గా చేసే వంటకాలలో టమోటా పులావ్ ఒకటి. దీని రుచి అదిరిపోతుంది. పిల్లలకు ఇది బెస్ట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. లంచ్ బాక్సుకు ఇది మంచి రెసిపీ. పిల్లలు, పెద్దలు ఇద్దరికీ మంచి ఫుడ్ ఇది. వండడం కూడా చాలా సులువు. అరగంటలో ఇది రెడీ అయిపోతుంది. దీన్ని తింటే ఫుల్ మీల్స్ తిన్నట్టే ఉంటుంది. అది కూడా వేడివేడిగా తింటే ఆ రుచే వేరు
కావాల్సిన పదార్థాలు
బాస్మతి బియ్యం - రెండు కప్పులు
టమోటా ముక్కలు - ఒక కప్పు
ఉల్లిపాయ - ఒకటి
నెయ్యి - రెండు స్పూనులు
కారం - ఒక స్పూను
పసుపు - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు - నాలుగు స్పూన్లు
నూనె - నాలుగు స్పూన్లు
కరివేపాకులు - గుప్పెడు
జీడిపప్పులు - ఎనిమిది
అల్లం తరుగు - ఒక స్పూను
వెల్లుల్లి తరుగు - ఒక స్పూను
పచ్చిమిర్చి - రెండు
గరం మసాలా - ఒక స్పూను
తయారీ ఇలా
1. బియ్యం బాగా కడిగి పొడిగా వచ్చేలా అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. కాస్త నూనె వేసి వండితే అన్నం పొడిగా వస్తుంది.
2. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి.
3. టమాటో ముక్కలు వేసి కలపాలి. మూత పెడితే టమాటోలు బాగా మగ్గుతాయి.
4. పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. అన్ని ఉడికాక గరం మసాలా పొడి వేయాలి.
5. అందులో ఒక స్పూను నెయ్యి కూడా వేస్తే మంచి టేస్టు వేస్తుంది.
6. అందులో వేయించిన జీడిపప్పులు, కొత్తిమీర తరుగు కూడా వేసి కలపాలి.
7. ఇప్పుడు ఉప్పు కూడా వేసి బాగా కలపాలి.
8. స్టవ్ కట్టేసి అందులో ఉడికిన అన్నాన్ని వేసి కలపాలి. కలిపేటప్పుడు ముద్దయ్యేలా కాకుండా పొడిపొడిగా కలపాలి.
9. అంతే టమోటా పులావ్ రెడీ అయినట్టే.
టమోటా ప్రయోజనాలు...
1. టమోటాలు చర్మం, జుట్టుకు ఎంతో మంచివి. ఇందులో ఉండే లైకోపీన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది.
2. మధుమేహులు టమోటాలను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ఇందులో ఉండే క్రోమియం ఉండడం వల్ల చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
3. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఒత్తిడి హార్మోన్లను నియంత్రిస్తుంది.
4. ఇందులో ఉండే లైకోపీన్ ప్రొస్టేట్, పొట్ట, కొలొరెక్టల్ క్యాన్సర్ వంటివి రాకుండా అడ్డుకుంటుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను ఇది అడ్డుకుంటుంది.
Also read: ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఇదే, అక్కడికి వెళితే చావు తప్పదు
Also read: పీరియడ్స్ కేవలం ఒకటి లేదా రెండు రోజులకే ముగిసిపోతున్నాయా? ఇది అనారోగ్యానికి సంకేతం