బరువు తగ్గడం కోసం డైట్ నుంచి వర్కవుట్ వరకు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఇవే కాదు రోజు స్టార్టింగ్ లో మనం తీసుకునే ఆహారం బరువు మీద అత్యంత ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. అందుకే బరువు తగ్గేందుకు తినడం లేదా తాగడం అనేది రోజు ప్రారంభించేందుకు చక్కని మార్గం. అటువంటి వాళ్ళు బరువు తగ్గించుకునేందుకు ఈ పానీయాలు చక్కగా ఉపయోగపడతాయి. చాలా మంది కొత్తిమీర నీళ్ళు, నిమ్మకాయ రసం, క్యారమ్ సీడ్ వాటర్ సహాయపడతాయి. ఇవే కాదు ఈ పానీయాలు కూడా మీ బరువు తగ్గే ప్రయాణాన్ని సులభం చేస్తాయి.


వామ్ము వాటర్


దీన్నే క్యారమ్ సీడ్ వాటర్ అని కూడా పిలుస్తారు. బరువు తగ్గించేందుకు ప్రయోజనకరమైన పానీయం. ఖాళీ కడుపుతో వీటిని తాగడం వల్ల బొడ్డు చుట్టు పేరుకుపోయిన కొవ్వుని కరిగించేస్తుంది. వేడి నీటిలో ఒక స్పూన్ వామ్ము వేసుకుని ఆ మిశ్రమాన్ని 3 నుంచి 5 నిమిషాల వరకు బాగా మారిగించుకోవాలి. ఆ తర్వాత వాటిని వడకట్టుకుని కొద్దిగా చల్లారిన తర్వాత తాగొచ్చు.


యాపిల్ సిడర్ వెనిగర్


వంటకి రుచి ఇవ్వడమే కాదు మీ శరీరానికి మంచి ఆకృతిని ఇచ్చేందుకు యాపిల్ సిడర్ వెనిగర్ ఉపయోగపడుతుంది. ఇది బరువు తగ్గడానికి మాత్రమే కాదు జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు ఆకలిని అరికట్టేందుకు సహాయపడుతుంది. దీన్ని నేరుగా తీసుకోకూడదు. ఖచ్చితంగా నీటిలో కలుపుకుని మాత్రమే తాగాలి. అంతే కాదు యాపిల్ సిడర్ వెనిగర్ పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే ఇది అనేక దుష్ప్రభావాలని కలిగిస్తుంది.


అల్లం టీ


చాలా మందికి నిద్రలేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. పాలతో చేసిన టీకి బదులుగా అల్లం టీ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. ఇది బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ టీలో కొద్దిగా తేనె కలుపుకుని తాగితే అజీర్ణం సమస్య దూరం అవుతుంది. ఉదయాన్నే దీన్ని తాగడం వల్ల మెటబాలిజం పెంచి ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అల్లం టీ జలుబు, దగ్గు నుంచి రక్షణనిస్తుంది.


నిమ్మనీరు


ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. జీవక్రియను కూడా పెంచుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి ఉండటం వల్ల రోగనిరోధక వ్యవస్థకు మంచిది. ఖాళీ పొట్టతో దీన్ని తాగితే శరీరంలోని వ్యర్థాలని తొలగించి శుభ్రపరుస్తుంది. శరీరంలోని మంతని తగ్గించడంలో సహాయపడుతుంది.


ధనియా నీరు


కొత్తిమీర వాటర్ అని కూడా పిలుస్తారు. ధనియాలతో చేసిన నీరు తాగినా లేదంటే కొత్తిమీర నీళ్ళు తాగినా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఇది జీవక్రియ మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ధనియాలు రాత్రంతా నానబెట్టి వాటిని వడకట్టుకుని పొద్దున్నే తాగాలి. క్రమం తప్పకుండా ఇలా చేశారంటే మీరు కూడా అందరిలా నాజూకుగా కనిపిస్తారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: రోజూ గుప్పెడు బాదం తిన్నారంటే ఈ ప్రయోజనాలన్నీ పొందుతారు