Ray Stevenson: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో నటించిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ (58) సోమవారం మరణించారు. అయితే ఆయన మరణానికి గల కారణాలు తెలియరాలేదు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’లో స్కాట్ దొరగా రే స్టీవెన్సన్ చక్కటి విలనిజం పండించారు.


రే స్టీవెన్సన్ హాలీవుడ్‌లో మంచి పేరున్న నటుడు. 1998లో వచ్చిన ‘ది థియరీ ఆఫ్ ఫ్లైట్’ ద్వారా ఆయన సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. కింగ్ ఆర్థర్, థోర్ మూడు భాగాలు, స్టార్ వార్స్, వైకింగ్స్, ట్రాన్స్‌పోర్టర్ లాంటి టాప్ హాలీవుడ్ సినిమాల్లో కూడా రే స్టీవెన్సన్ నటించారు.


1997లోనే రూత్ గెమ్మెల్ అనే హాలీవుడ్ నటిని రే స్టీవెన్సన్ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ 2005లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆంత్రోపాలజిస్టు ఎలిసబెట్టా కరాకియాతో సహజీవనం చేస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.