క్రోన్స్ డిసీజ్ జీర్ణ వ్యవస్థ లోపలి భాగాల్లో ఇన్ఫ్లమేషన్ కలిగిస్తుంది. ఇది జీవితకాలం కొనసాగే వ్యాధి. మిగతా ఆరోగ్యం అంతా బవున్నప్పటికీ తరచుగా లక్షణాలు ఉదృతమై ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా డయేరియా, కడుపులో క్రాంప్స్ వంటి నొప్పి ఉంటుంది. తరచుగా బరువు తగ్గుతుంటారు. అలసట కొనసాగుతూ ఉంటుంది. అంతేకాదు శరీరంలోని ఇతర భాగాల మీద కూడా ప్రభావం చూపించవచ్చు. కళ్ళ నుంచి చర్మం, కీళ్ల వరకు అన్ని అవయవాల్లోనూ క్రోన్స్ లక్షణాలు గుర్తించవచ్చు.


కళ్లు


క్రోన్స్ సమస్య ఉన్నవారికి కంటి సమస్యలు కూడా ఉండవచ్చు. యార్క్, స్కార్బరో టీచింగ్ హాస్పిటల్స్ ఫౌండేషన్ ప్రకారం క్రోన్స్ తో బాధపడుతున్న వారు ఎక్కువగా ఎపిస్క్లేరిటిస్ అనే కంటి సమస్యతో బాధపడుతుంటారు. ఇది కనుగుడ్డులోని తెల్లని బాగాన్ని కప్పి ఉంచే పొర కణజాలాలను ప్రభావితం చేస్తుంది. కళ్లు ఎర్రబారడం, గాయపడడం, ఇన్ఫ్లమేషన్ కలుగుతాయి. జీర్ణ సమస్యలతో పాటు ఎపిస్క్లేరిటిస్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. క్రోన్స్ తో సంబంధం ఉన్న మరో రెండు రకాల కంటి సమస్యలు స్క్లరైటిస్, యువటిస్.  ఈ సమస్యల్లో కంటిలోని నల్లని కంటి పాపలో మంటగా ఉంటుంది.


చర్మం


క్రోన్స్ తో బాధడపుతున్న వారిలో అత్యంత సాధారణంగా కనిపించే చర్మ సమస్య ఎరిథెమా నోడోసమ్. ఈ సమస్యలో కాళ్లపై లేత ఎరుపు లేదా వైలెట్ రంగులో ఇన్ఫ్లమేషన్ కనిపిస్తుంది. పురుషుల కంటే  సమస్య మహిళల్లో ఎక్కువ. క్రోన్స్ తో బాధపడతున్న ఏడుగురిలో ఒకరికి తప్పక వస్తుంది. ఎరిథెమా నోడోసమ్ క్రోన్స్ తో పాటు ఫ్లేర్ అప్ అవుతుంటుంది. ఇదే కాకుండా చాలా అరుదుగా ఫియోడెర్మా గ్యాంగ్రెనోసమ్ అనే చర్మ సమస్య కూడా క్రొన్స్ తో బాధపడే వారిలో కనిపిస్తుంది. ఈ సమస్యలో చిన్నచిన్న బొబ్బులగా మొదలై చర్మం మీద బలమైన పూతగా మారుతుంది. ఇవి చర్మం మీద ఎక్కడైనా ఏర్పడవచ్చు. ఈ సమస్య చాలా అరుదుగా కనిపిస్తుందనే చెప్పవచ్చు.


నోరు


క్రోన్స్ తో బాధపడేవారిలో అప్పుడప్పుడు నోటిలో కూడా సమస్యలు రావచ్చు. దీనిని ఓరోఫేషియల్ గ్రాన్యులోమాటోసిస్ అని కూడా అంటారు. ఇది చాలా అరుదు కానీ క్రొన్స్ తో బాధపడే పిల్లల్లో ఎక్కువ. ఈ సమస్యలో పెదవుల్లో వాపు, నొటి పగుళ్ళ వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంత మందిలో క్రోన్స్ ఫ్లేర్ అప్ అయినపుడు నోటిలో పూతలు కూడా ఏర్పడవచ్చు.


కీళ్ళు


క్రోన్స్ లో ఆర్థరైటిస్ చాలా సాధారణంగా కనిపించే సమస్య. క్రోన్స్ పెద్ద పేగు మీద ప్రభావం చూపినపుడు దానిని క్రోన్స్ కోలైటిస్ అంటారు. ఇలాంటి సందర్భంలో కీళ్ల సమస్యలు వస్తుంటాయి. చేతులు, కాళ్లలోని పెద్ద కీళ్లైన మోచేతులు, మణికట్టు, మోకాలు, చీల మండలతో సహా అన్ని కీళ్లలో వాపు గాయాలు ఏర్పడుతాయి.


క్రోన్స్ కోలైటిస్ సమస్యకు చికిత్స అందించినపుడు సాధారణంగా కీళ్ల సమస్య కూడా మెరుగుపడతాయి. కొన్ని సందర్భాల్లో వెన్నెముక, పొత్తికడుపులోని కీళ్ళలో ఇన్ఫ్లమేషన్ ఏర్పడుతుంది. దీనినిన ఆంకిలోసిస్ స్పాండిలైటిస్ లేదా సాక్రోలైటిస్ అని అంటారు. క్రోన్స్ తో బాధపడేవారిలో క్రోన్స్ ఫ్లేర్ అప్ లేకపోయినా కూడా దానికదే ఈ వెన్నెముక సమస్య ఫ్లేర్ అప్ కావచ్చు. వెన్ను పూసలు బిగుసుకుపోవడం వల్ల క్రమంగా వెన్నెముకలో కదలికలు నిరోధించబడతాయి.


కాలేయం


 క్రోన్స్ తో బాధ పడేవారిలో ప్రతి 50 మందిలో ఒకరు ప్రైమరీ స్క్లేరోసింగ్ కోలాంటాటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడతారు. దీని వల్ల కాలేయం లోపల, బయట ఉన్న బైల్ డక్ట్స్ లో మంట, క్రమంగా పరిమాణం తగ్గిపోతాయి. అలసట, దురదలు, కామెర్లు, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.


Also read: అబ్బాయిలూ జాగ్రత్త! టీనేజ్‌లో బరువు పెరిగితే ఆ క్యాన్సర్ ముప్పు తప్పదట!