చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినేది బాదం పప్పు. పోషకాల పవర్ హౌస్. ఈ నట్స్ రెగ్యులర్ గా డైట్లో చేర్చుకోవడం వల్ల అనేక విటమిన్లు, శరీరానికి అవసరమైన ఖనిజాలు అందుతాయి. కొన్ని బాదం పప్పులు రాత్రంతా నానబెట్టి పొద్దునే తొక్క తీసేసి తింటే పోషకాలు అందుతాయి. ఇందులో విటమిన్ ఇ, బి6 పుష్కలంగా ఉన్నాయి. మెదడు కణాలలో ప్రోటీన్లను గ్రహించడంలో సహాయపడతాయి. అంతే కాదు ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. మెదడు అభివృద్ధికి సహాయపడతాయి.


యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం


కణాలను దెబ్బతినకుండా కాపాడటంలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా అవసరం. బాదంలో ఇవి సమృద్ధిగా లభిస్తాయి. శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి, వాపు, వృద్ధాప్యం నుంచి కాపాడుతుంది. ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు పొందాలంటే బాదంపప్పు తొక్క కూడా తినాలని అనేక నివేదికలు చెబుతున్నాయి.


విటమిన్ ఇ ఇస్తుంది


విటమిన్ ఇ గుండె పనీతీరులో సహాయపడే ముఖ్యమైన విటమిన్లలో ఒకటి. అల్జీమర్స్ ఉన్నవారికి కూడా ఇది మేలైన ప్రయోజనాలు చేకూరుస్తుంది. 28 గ్రాముల బాదంపప్పుని తీసుకుంటే రోజువారీ శరీరానికి అవసరమైన విటమిన్ ఇ అవసరాన్ని 50 శాతం వరకు తీర్చేస్తుంది.


మెగ్నీషియం మెండు


బాదం పప్పుని అద్భుతమైన ఆహారంగా మార్చే మరొక పోషకం మెగ్నీషియం. ఇది శరీరంలో 200 కంటే ఎక్కువ విధులు నిర్వహిస్తుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తికి రోజూ 420 మిల్లీ గ్రాముల మెగ్నీషియం అవసరం.


బరువు నియంత్రణ


28 గ్రాముల బాదం పప్పులో 3.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. డైటరీ ఫైబర్ మంచి మూలం. అందువల్ల ప్రతిరోజూ ఉదయాన్నే కొన్ని బాదంపప్పులు తీసుకుంటే అది మిమ్మల్ని ఎక్కువ కాలం పాటు నిండుగా ఉంచుతుంది. రోజంతా కేలరీలు తీసుకోవడం తగ్గిస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది.


గుండెకి మంచిది


ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల గుండెకి మంచి ఆహారంగా నిపుణులు చెబుతున్నారు. రక్తపోటుని నియంత్రించడంలో బాదంపప్పు కీలక పాత్ర పోషిస్తుందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రిస్తుంది. అయితే అధికంగా తీసుకుంటే గుండె ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది.


వీటితో జాగ్రత్త


బాదంపప్పులో చేదువి కూడా ఉంటాయి. వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మామూలు బాదం మాదిరిగానే ఇవి కూడా ఉంటాయి. కానీ తినేటప్పుడు చేదు తగిలితే మాత్రం వెంటేనే తినకుండా పారేయడం మంచిది. అందులో కొద్ది మొత్తంలో అమిగ్డాలిన్ ఉంటుంది. ఇది శరీరం తీసుకున్నప్పుడు సైనెడ్ గా మారిపోతుంది. అందుకే చేదు బాదం తీసుకోవడం విషపూరితం అవుతుంది. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. ఒక వేళ మీరు బాదం తినేటప్పుడు చేదు తగిలితే వాటిని మింగకుండా బయటకి ఉమ్మివేయడం మంచిది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: ఒబేసిటీ వల్ల జుట్టు రాలిపోతుందా? దీన్ని అధిగమించడం ఎలా?