Facials Suggestions For Dussehra : అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ముఖ్యంగా పండుగల సమయంలో మరింత అందంగా కనిపించేందుకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు. మీరు కూడా పండుగ సమయంలో అందగా కనిపించాలనుకుంటే ఇప్పుటి నుంచే కేర్ తీసుకోవడం ప్రారంభించండి. కొన్ని ఫేషియల్స్ మీ ముఖంపై మురికిని వదిలించి మీకు మంచి గ్లోని అందిస్తాయి. పండుగ సమయంలో మీకు మరింత మెరుపును అందిస్తాయి. మేకప్​ ఎక్కువగా వినియోగించనివారు కూడా సహజంగా తమ స్కిన్​ని ఈ ఫేషియల్స్​తో మెరిసేలా చేసుకోవచ్చు.


పండుగల సమయంలో బంధువులు, స్నేహితులను కలుస్తూ ఉంటాం. ఆ సమయంలో మీ చర్మం ప్రకాశించేలా చేసుకోవడానికి కొన్ని ఫేషియల్స్ మీకు హెల్ప్ అవుతాయి. పైగా ఇవి మీ చర్మానికి ఎలాంటి హాని చేయవు. ఇంతకీ ఆ ఫేషియల్స్ ఏమిటో? ఎలా వీటిని ట్రై చేయవచ్చో.. ఏ ఫేషియల్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 


హైడ్రేటింగ్ ఫేషియల్


పొడి చర్మం ఉన్నవారికి హైడ్రేటింగ్ ఫేషియల్ ఓ వరమనే చెప్పవచ్చు. ఇది మీ చర్మానికి కావాల్సిన తేమను అందించి.. మాయిశ్చరైజింగ్ చేస్తుంది. దీనిలో హైడ్రేటింగ్ సీరమ్స్, మాయిశ్చరైజర్స్, మాస్క్​లును ప్రత్యేక మిక్స్ చేసి ఫేషియల్​గా ఉపయోగిస్తారు. ఇది మీ ముఖం కోల్పోయిన తేమను తిరిగి అందించడమే కాకుండా.. మీ చర్మాన్ని బొద్దుగా మెరిసేలా చేస్తుంది. పండుగ సమయంలో మీకు దివాలాంటి లుక్​ని ఇస్తుంది. 


బ్రైటెనింగ్ ఫేషియల్..


ఎండలో, దుమ్ము, ధూళిలో తిరిగి మీ ముఖం డల్​గా మారిందా? అయితే మీరు బ్రైటెనింగ్ ఫేషియల్ ట్రై చేయవచ్చు. ఈ ఫేషియల్ మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. డెడ్​ స్కిన్ సెల్స్​ను తొలగించి.. చర్మాన్ని సున్నితంగా ఎక్స్​ఫోలియేట్ చేస్తుంది. విటమిన్ సి వంటి పదార్థాలు.. బ్రైటెనింగ్ సీరమ్​లను ఈ ఫేషియల్​ కోసం ఉపయోగిస్తారు. 
దీనివల్ల మీ స్కిన్​కు మంచి టోన్ వస్తుంది. సహజమైన, ప్రకాశవంతమైన మెరుపును అందిస్తాయి. పండుగ సమయంలో మీ ఛాయ ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది.


యాంటీ ఏజింగ్ ఫేషియల్


మీరు పండుగ సీజన్​లో మరింత యవ్వనంగా కనిపించాలనుకుంటే మీరు యాంటీ ఏజింగ్ ఫేషియల్ చేయించుకోవచ్చు. వయసు మీద పడుతుందనే బాధ మీలో, మీ ఫేస్​లో ఉంటే మీరు యాంటీ ఏజింగ్ ఫేషియల్ చేయించుకోవచ్చు. ఇది మీకు రిఫ్రెష్​మెంట్ ఇస్తుంది. దీనిలో మైక్రోడెర్మాబ్రేషన్, కొల్లాజెన్ బూస్టింగ్​ సీరమ్​ల అప్లికేషన్, రిజువనేటింగ్ మాస్క్​లు ఉపయోగిస్తారు. ఇవి వృద్ధాప్య లక్షణాలను అదుపులో ఉంచుతాయి. తద్వార మీ చర్మం మరింత యవ్వనంగా, రిఫ్రెష్​గా కనిపిస్తుంది. 


మొటిమలు ఉంటే.. 


ఏదైనా ఫంక్షన్​కి వెళ్లాలనుకున్నప్పుడు, ప్రత్యేకమైన సమయాల్లో మొటిమలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు ప్రత్యేకమైన యాక్నే ప్రోన్ స్కిన్ ఫేషియల్ ట్రై చేయవచ్చు. ఇది మీకు లోతైన క్లెన్సింగ్, ఎక్స్​ఫోలియేషన్, మొటిమలు కలిగించే బ్యాక్టిరియాను దూరం చేస్తుంది. ఇది మీ స్కిన్ టోన్​ను ఫెయిర్ చేయడమే కాకుండా.. మచ్చలు లేని చర్మాన్ని అందిస్తుంది. 


డైమండ్ ఫేషియల్..


ఈ ఫేషియల్ గోల్డ్ లేదా డైమండ్ డస్ట్ వంటి రిచ్ పదార్థాలను కలిగి ఉంటుంది. ఇవి చర్మాన్ని పునరుజ్జీవింపజేసి, ప్రకాశవంతమైన లక్షణాలు కలిగి ఉంటుంది. పెళ్లి, ఇతర ముఖ్యమైన ఫంక్షన్ల సమయంలో దీనిని చాలామంది ఆశ్రయిస్తారు. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా చేసి.. నలుగురిలో మిమ్మల్ని ప్రత్యేకంగా చూపిస్తుంది. ఈ ఫేషియల్స్​లో మీకు ఏది బాగా నప్పుతుందో దానిని మీరు ట్రై చేసి.. మీ పండుగను మరింత బ్రైట్​గా మార్చుకోవచ్చు. 


Also  Read : ఈ జ్యూస్​తో మొటిమలు దూరం.. మెరిసే అందం మీ సొంతం