Israel Gaza Attack:


వైరల్ వీడియో 


ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్ ( Israel's Defence Forces) హమాస్ ఉగ్రవాదులపై విరుచు పడుతున్నాయి. సాధారణ పౌరులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురి చేస్తున్న ఉగ్రమూకలపై ఊహించని విధంగా దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా గాజా పరిసర ప్రాంతాల్లో సొరంగాల్లో దాక్కుని దాడులు చేస్తున్న వాళ్లని కనిపెట్టి గట్టి బదులిస్తున్నారు. గాజా సెక్యూరిటీ ఫెన్స్ వద్ద సాహసోపేతమైన ఆపరేషన్‌ నిర్వహించి 250 మంది బందీలను కాపాడాయి ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ బృందాలు. చాకచాక్యంగా దాడి చేసి 60 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. 26 మందిని అదుపులోకి తీసుకున్నారు. హమాస్‌ సౌత్‌ డివిజన్‌ కమాండర్‌నీ అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌కి సంబంధించిన ఓ వీడియోని IDF ట్విటర్‌లో విడుదల చేసింది. డిఫెన్స్ బలగాలు ఎంత ధైర్యం చేసి హమాస్‌ ఉగ్రవాదులను మట్టుబెట్టాయో ఈ వీడియోని సాక్ష్యంగా చూపించింది. ఈ వీడియోలో ఇజ్రాయేల్ సైనికులు బిల్డింగ్‌లోకి దూసుకెళ్తున్నారు. చుట్టూ కాల్పులు చప్పుళ్లు వినిపిస్తున్నాయి. కొందరు ఎదురు కాల్పులకు దిగగా..మరి కొందరు గ్రనేడ్‌లు విసురుతూ ఉగ్రవాదులను చుట్టుముట్టారు. "అటాక్ చేయండి" అంటూ కమాండర్ అందరికీ ఆదేశాలిచ్చాడు. మరో సైనికుడు వీళ్లందరికీ ముందుగా వెళ్లి లైన్ క్లియర్ చేశాడు. "గన్ తీయండి..గురి పెట్టండి" అని మరో సోల్జర్ గట్టిగా అరిచాడు. అక్కడ ఎంత ఉద్రిక్త వాతావరణం ఉందో ఈ వీడియో చూస్తేనే అర్థమైపోతుంది. దాదాపు ఏడు రోజులుగా ఇజ్రాయేల్, పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధం కారణంగా ఇజ్రాయేల్‌లో 12 వందల మంది, గాజా స్ట్రిప్ వద్ద మరో 14 వందల మంది ప్రాణాలు కోల్పోయారు.