బరువు తగ్గడం చాలా కష్టమైన పని కానీ అసాధ్యమైనది మాత్రం కాదు. సమతుల్య ఆహరం తీసుకుంటే, వ్యాయామ చేస్తూ, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే బరువు తగ్గడం చాలా సులువుగా ఉంటుంది. శారీరక శ్రమ చాలా అవసరం. తిన్న వెంటనే గంటల తరబడి కూర్చోవడం వల్ల కూడా లావైపోయి బరువు పెరుగుతారు. శరీరంలో అన్నీ సక్రమంగా జరగాలంటే కంటి నిండా నిద్ర చాలా అవసరమని చెప్తున్నారు నిపుణులు. బరువు తగ్గేందుకు కూడా ఇది దోహదపడుతుంది. నిద్రపోయే ముందు కొన్ని పదార్థాలు, పానీయాలు తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుందని అంటున్నారు. ఇవి తీసుకోవడం వల్ల మంచిగా నిద్ర కూడా పడుతుంది.


నిద్రకి ఉపక్రమించే ముందు ఈ పానీయాలు తీసుకోవడం వల్ల మంచి నిద్రతోపాటు పాటు కొవ్వు కూడా కరుగుతుంది. శరీరానికి కనీసం 8 గంటల నిద్ర అవసరం అని వైద్యులు చెబుతూ ఉంటారు. అది కనుక గాడి తప్పితే దాని ప్రభావం మొత్తం జీవగడియారం మీద పడుతుంది. దాని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చేస్తాయి. అందుకే నిద్ర శరీరానికి చాలా ముఖ్యమని అంటారు. రాత్రి నిద్రతో పోల్చితే పగటి నిద్ర అంతా ప్రభావవంతంగా ఉండదు. నిద్ర పోయే ముందు వీటిని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.


ప్రోటీన్ షేక్: మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వాళ్ళు అయితే నిద్రకు ముందు ప్రోటీన్లు కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఇవి కండరాలను సరి చేసి పునరుద్ధరించడానికి ఉపయోగపడతాయి. ఇది ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. పేగులను శుభ్రం చేసి ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.


పాలు: నిద్రపోయే ముందు ఒక గ్లాసు పాలు తీసుకోవడం వల్ల నిరంతరాయంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. మరుసటి రోజు కాల్షియం అతిగా తినకుండా నిరోధిస్తుంది. జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తుంది. పొట్టను తగ్గించేందుకు సహకరిస్తుంది.


దాల్చిన చెక్క టీ: జీవక్రియను పెంచడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లతో కూడినది ఈ దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ. పడుకునే ముందు ఈ టీ తాగడం వల్ల బరువు స్థిరంగా తగ్గుతుంది. ఇది తయారు చేయడం కూడా చాలా సులభం. రెండు కప్పుల నీటిలో దాల్చిన చెక్క బెరడు కొంచెం వేసి బాగా మరిగించి తర్వాత వాటిని వడకట్టుకుని తాగడమే.


మెంతి నీళ్ళు: మెంతి నీరు శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేసి జీవక్రియను పెంచుతుంది. మెంతి గింజలను కనీసం 2-3 గంటలు నీటిలో నానబెట్టి నిద్రవేళకు 30 నిమిషాల ముందు క్రమం తప్పకుండా ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల కచ్చితంగా బరువు తగ్గుతారని నిపుణులు సూచిస్తున్నారు.


ద్రాక్ష రసం: నిద్రపోయే ముందు ఒక గ్లాసు తాజా ద్రాక్ష రసం తాగితే శరీరంలోని కొవ్వును కరిగించేందుకు సహాయపడుతుంది. ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొవ్వును విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి. ఇన్సులిన్ స్రావాన్ని నియంత్రించి శరీర సిర్కాడియన్ లయలను అదుపులో ఉండేలా చేస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: అమ్మాయిలూ షేవింగ్ చేస్తున్నారా? అయితే, మీరు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి


Also Read: దంతాలు పసుపు రంగులోకి మారుతున్నాయా? ఈ చిట్కాలు పాటిస్తే మిలమిలా మెరిసిపోతాయ్!