చాలామందికి అవాంఛిత రోమాలు పెరిగి తీవ్ర ఇబ్బంది పెడుతుంటాయి. అటువంటి వాళ్ళు నలుగురిలో మధ్య తిరగడానికి చాలా షేమ్ గా ఫీల్ అవుతారు. ఇది దీర్ఘకాలిక సమస్యగా మారిపోయింది. మార్కెట్లో షేవింగ్ క్రీమ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటిని తొలగించుకోవడం చాలా సులభం అయ్యింది. కానీ షేవింగ్ చేసిన కొద్ది రోజులకే వెంటనే వెంటుకలు వచ్చేస్తే ఇబ్బందిగా అనిపిస్తుంది. కొంతమంది షేవింగ్ కి బదులుగా వాక్సింగ్ చేయించుకుంటున్నారు. గతంలో అయితే అది చాలా నొప్పితో కూడుకున్నది. కానీ దీర్ఘకాలంలో.. షేవింగ్ కంటే వాక్సింగ్ సమర్థవంతంగా పని చేస్తుందని బ్యూటీషియన్స్ అంటున్నారు. వాక్స్ చెయ్యడం వల్ల అవాంఛిత రోమాలు వెంటనే పెరిగే అవకాశమే ఉండదట.


మృదువైన, దీర్ఘకాలిక ప్రయోజనాలు


షేవింగ్ కి బదులుగా వాక్స్ చెయ్యడం వల్ల మూడు వారాల పాటు అవాంఛిత రోమాల పెరుగుదల ఎక్కువగా ఉండదు. పైగా చర్మం మృదువుగా ఉంటుంది. అదే షేవింగ్ చేస్తే చర్మం చాలా మురికిగా మారిపోవడానికి కొన్ని రోజులు మాత్రమే పడుతుంది. బిజీ షెడ్యూల్ లో షేవింగ్ చెయ్యడం కొద్దిగా కష్టమైన పనే. వాక్సింగ్ అనేది రూట్ నుంచి వెంట్రుకలను తొలగిస్తుంది. అందువల్ల కొన్ని వారాల పాటు మృదువైన చర్మాన్ని మీకు అందిస్తుంది. అదే షేవింగ్ చేస్తే కొద్ది రోజులకే చిన్న చిన్న మొలకలుగా వెంట్రుకలు వచ్చి గుచ్చుకుంటూ చర్మం రఫ్ గా అనిపిస్తుంది.


దురద, గాయాలు ఉండవు


వాకింగ్స్ చెయ్యడం వల్ల చర్మం దురద పెట్టదు, అలాగే గాయాలకు కూడా చోటు ఉండదు. షేవింగ్ చేస్తే బ్లేడ్ కారణంగా గాయాలై రక్తం కారే ప్రమాదం ఉంది. పదే పదే రేజర్ ని వాడటం వల్ల అది చర్మాన్ని కత్తిరించడం వల్ల ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశం కూడా ఉంది. రేజర్ బ్లేడ్ వల్ల వచ్చే బాధకరమైన నొప్పి కంటే వాక్సింగ్ త్వరగా అయిపోతుంది. షేవింగ్ చెయ్యడం వల్ల హెయిర్ ఫోలికల్స్, దురద, మంట, రేజర్ బర్న్,ఇన్ గ్రోన్ హెయిర్ ఏర్పడటం జరుగుతుంది. అయితే వాక్సింగ్ ఎక్స్ ఫోలియేషన్ గా పనిచేస్తుంది.


హైపర్‌పిగ్మెంటేషన్ ఉండదు


వాక్సింగ్ వల్ల మృత కణాలు తొలగించడానికి అదనపు సహాయకారిగా ఉపయోగపడుతుంది. మృతకణాలను తొలగించడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. ఇన్ గ్రోన్ హెయిర్ నివారించడానికి వాక్సింగ్‌కు చాలా రోజుల ముందు మీ చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయండి. కొందరు వ్యక్తులు షేవింగ్ చేసిన తర్వాత వారి చర్మం ముదురు రంగులో కనిపిస్తుంది. అయితే వాక్సింగ్ చేసిన తర్వాత అలా కనిపించదు. వాక్సింగ్ మీ చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడమే కాకుండా హైపర్‌పిగ్మెంటేషన్‌ను నివారించడంలో సహాయపడుతుంది.


వెంట్రుకలు సన్నగా పెరుగుతాయి


షేవింగ్ చేసిన తర్వాత వచ్చే వెంట్రుకలు చాలా మందంగా కనిపిస్తాయి. కానీ వాక్సింగ్ చేసిన తర్వాత వచ్చే వెంట్రుకలు మాత్రం సన్నగా వస్తాయి. అంతే కాదు పెరుగుదల కూడా నెమ్మదిగా ఉంటుంది. వాక్స్ చేస్తే జుట్టు తిరిగి పెరిగినప్పుడు చాలా తక్కువగా కనిపించడం గమనించవచ్చు. స్థిరమైన వాక్సింగ్ వెంట్రుకల కుదుళ్లను బలహీనపరుస్తుంది. అదే షేవ్ చేసినప్పుడు ఫోలికల్ దట్టమైన భాగం వద్ద జుట్టు విరిగిపోతుంది. దీని వల్ల అది తిరిగి పెరిగేటప్పుడు మందంగా వస్తుంది.


Also Read: గజినీలకు గుడ్ న్యూస్, ఆ క్యాప్ పెట్టుకుంటే మతిమరుపు పోతుందట!


Also Read: పోషకాల పవర్ హౌస్ కివీ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అసలు వదిలిపెట్టరు