అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమాకు ఖ్యాతి తీసుకు వచ్చిన సినిమాల్లో దర్శక ధీరుడు రాజమౌళి తాజా సినిమా 'ఆర్ఆర్ఆర్' (RRR Movie) పేరు తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు హాలీవుడ్ ప్రముఖులు అందరూ మన సినిమాను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా విడుదల అయిన తర్వాత ఇంటర్నేషనల్ ఆడియన్స్, సినిమా ప్రముఖుల నుంచి ఎంత స్పందన వస్తుందో తెలిసిందే. హాలీవుడ్ మాత్రమే కాదు... కొరియన్ సినిమా ప్రముఖుల దృష్టి కూడా ఈ సినిమాపై పడింది.


కొరియన్‌లో 'ఆర్ఆర్ఆర్' రీమేక్...
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' (RRR remake in Korean language) ను కొరియాలో రీమేక్ చేస్తామంటూ కొరియన్ సినిమా ఇండస్ట్రీ నుంచి తనను కొందరు సంప్రదించారని నిర్మాత సునీత తాటి తెలిపారు. ఆవిడ కొరియన్ సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.


సమంత ప్రధాన పాత్రలో రూపొందిన మహిళా ప్రాధాన్య చిత్రం 'ఓ బేబీ'ని సురేష్ ప్రొడక్షన్ భాగస్వామ్యంతో సునీత తాటి రీమేక్ చేశారు. ఇప్పుడు రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో రూపొందిన 'శాకిని డాకిని' కూడా కొరియన్ సినిమా 'మిడ్‌నైట్ రన్నర్స్'కు రీమేక్. కొరియన్ ప్రముఖులతో ఆవిడకు పరిచయాలు ఉన్నాయి. అందుకని, ఆమెను సంప్రదించారు. రాజమౌళి (Rajamouli)తో ఈ విషయమై తాను మాట్లాడానని సునీత తెలిపారు. అయితే, దర్శక ధీరుడి రియాక్షన్ ఏంటి? అనేది చెప్పలేదు. అన్నీ కుదిరితే... త్వరలో కొరియాలో 'ఆర్ఆర్ఆర్' రీమేక్ కావచ్చు.


Also Read : ఎన్టీఆర్‌ను టార్గెట్ చేసిన కేసీఆర్? - దెబ్బకు రెండున్నర కోట్ల నష్టం


ఎన్టీఆర్‌కు ఆస్కార్ వస్తుందా?
హాలీవుడ్ సినిమా ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా ఆస్కార్ బరిలో నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కొమురం భీం (Komaram Bheem) పాత్రలో ఎన్టీఆర్ ఎన్టీఆర్ నటనకు ఆస్కార్ లభించే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. అయితే... ఇప్పుడు పక్కాగా అవార్డు వస్తుందని చెప్పడం తొందరపాటు అవుతుంది. ఎందుకంటే... ఈ ఏడాది చివరి వరకు వచ్చే సినిమాలు, అందులో మిగతా హీరోల నటన చూస్తే గానీ చెప్పలేం!


'ఆర్ఆర్ఆర్'లో పెద్ద పులితో ఫైట్, ఇంటర్వెల్ సీన్స్‌లో ఎన్టీఆర్ నటన అద్భుతం.  ఆ రెండూ మాత్రమే కాదు... భావోద్వేగభరిత సన్నివేశాల్లోనూ ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. ప్రతి ఏడాది ఆస్కార్స్ ప్రకటించడానికి ముందు ఎవరెవరికి రావచ్చు? అంటూ 'ప్రెడిక్షన్స్' చెప్పడం సహజంగా జరుగుతుండేది. ఉత్తమ నటుడిగా ఈ ఏడాది ఆస్కార్ బరిలో ఎవరెవరు ఉన్నారో చెబుతూ... 'వెరైటీ' ఒక లిస్టు వెల్లడించింది. అందులో పోటీ ఇచ్చే హీరోల జాబితాలో ఎన్టీఆర్ పేరు కూడా ఉంది. అయితే... ఎన్టీఆర్ పేరు టాప్ 40లో లేదు. (NTR In Unranked Possible Contenders - Oscars Award) అయితేనేం? ఆయన పేరు లిస్టులో ఉండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 


'ఆర్ఆర్ఆర్'కు ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' కేటగిరీలో పురస్కారం వచ్చే ఆస్కారం ఉందని ఒక ఆంగ్ల మీడియా సంస్థ పేర్కొంది. 


Also Read : 'కెప్టెన్' టు 'బ్రహ్మాస్త్ర' - థియేటర్లలో విడుదలయ్యే ఎనిమిది సినిమాల్లో మీ ఓటు దేనికి?