బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన  ఏ పని చేసినా వెరైటీగానే ఉంటుంది. వయసు దాటిపోతున్నా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్‌ను భలే ఎంజాయ్ చేస్తున్నాడు సల్మాన్. వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. ప్రేమ పావురాలు సినిమాలో ఎలా ఉన్నాడో.. ఇప్పటికీ అలాగే ఉన్నాడు సల్మాన్. అప్పటితో పోల్చితే ఇప్పుడు మరింత ఫిట్ గా కనిపిస్తున్నాడు. తాజాగా ఈ బాలీవుడ్ హీరో ఓ వింత పని చేస్తూ కెమెరాలకు చిక్కాడు. ఇంతకీ ఆయన ఏం చేశాడో తెలుసా?


ప్యాంట్ జేబులో గ్లాసు


ఇటీవల సల్మాన్ ఖాన్ ఓ పార్టీకి వెళ్లాడు. కారు డోర్ తీసుకుని కిందికి దిగబోతుండగా.. ఫోటోగ్రాఫర్లు సల్మాన్‌ను చుట్టేశారు. ఫోటోలు తీసుకొనేందుకు ఎగబడ్డారు. దీంతో ఆయన తన చేతిలోని గాజు గ్లాసును జేబులో పెట్టుకున్నాడు. అయితే, ఖాళీ గ్లాసు కాదు. అందులో ఏదో లిక్విడ్ ఉంది. నీళ్లో, మరేంటో స్పష్టంగా తెలియదు. ఫోటో గ్రాఫర్స్ దాన్ని కూడా ఫోటోలు తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ గ్లాసును ప్యాంట్ జేబులో పెట్టుకోవడం ఫోటోల్లో వీడియోలో స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. “ఫోటోలో కనిపించకుండా దాచేయాలని వీడియోలో దొరికిపోయాడు సల్మాన్ ఖాన్” అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. మరి కొంత మంది “ఆ గాజు గ్లాసులో ఏముంది సల్లు?” అంటూ ఆటపట్టిస్తున్నారు. “ఆ గ్లాసులో ఉన్నది  వొడ్కా నా? టానిక్కా?” అని మరికొందరు అడుగుతున్నారు. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్ తో నవ్వుల పువ్వులు పూస్తున్నాయి.






జేబులో గ్లాస్ పెట్టడం ఇదే తొలిసారి కాదు


సల్మాన్ ఖాన్ గ్లాసును జేబులో పెట్టడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఇలా ఓసారి చేశారు. బిగ్ బాస్-13 రియాలిటీ షోలో ఆయన ఇలాగే చేశారు. ఓ వీకెండ్ ఎపిసోడ్ లో తన చేతిలోని గ్లాసును ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. తాజాగా మరోసారి అలాగే చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.   






ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే.. పూజా హెగ్డేతో కలిసి ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్‌ ను ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ సినిమాకు  ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్నారు.  యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరో వెంకటేష్, మరో నటుడు జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అటు కత్రినా కైఫ్‌ తో కలిసి ‘టైగర్-3’ సినిమా చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. ఈ సినిమాకు మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో కలిసి 'కిక్ 2' అనే సినిమా కూడా చేస్తున్నాడు.


Also Read : ఎన్టీఆర్‌ను టార్గెట్ చేసిన కేసీఆర్? - దెబ్బకు రెండున్నర కోట్ల నష్టం






Also Read : ఫ్లాప్‌ల‌తో క‌ట్టిన స్టార్‌డ‌మ్ కోట - ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ క్రేజ్ వేరే లెవల్